పారితోషికం యాభై కోట్లు! | Hrithik Roshan charges 50 cr for Ashutosh Gowariker's MohenjoDaro? | Sakshi
Sakshi News home page

పారితోషికం యాభై కోట్లు!

Published Thu, Jul 10 2014 12:08 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పారితోషికం యాభై కోట్లు! - Sakshi

పారితోషికం యాభై కోట్లు!

‘‘అదే కనుక నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో హృతిక్ రోషన్ అవు తాడు’’ అని బాలీవుడ్‌లో చర్చించుకుంటున్నారు. మరి.. ‘మొహొంజొదారో’ అనే చిత్రానికి హృతిక్ డిమాండ్ చేసిన పారితోషికం ఆ స్థాయిలో ఉంది. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇది చారిత్రక కథాచిత్రం కావడంతో నటీనటులకు శారీరక శ్రమ ఎక్కువే ఉంటుందట. దాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాణానికి ఎక్కువ రోజులు పడుతుందనే కారణంగానే హృతిక్ 50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. ఈ చిత్రం నిర్మాణానికి సంబంధించి ఓ ప్రముఖ స్టూడియో అధినేతతో సంప్రదింపులు జరుపుతున్నారట అశుతోష్. మరో పదిహేను రోజుల్లో నిర్మాత ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement