MohenjoDaro
-
మేళాలో ప్రత్యేక ఆకర్షణ... నాగ సాధువులు
వాళ్లు బంధాలు, అనుబంధాలుండవు. సర్వం త్యజించిన సన్యాసులు. చలికాలమైనా, ఎండాకాలమైనా దిగంబరంగానే ఉంటారు. ఒళ్లంతా విభూది ధరిస్తారు. జనవాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు. కుంభమేళా సమయంలో మాత్రమే జన సామాన్యానికి కనిపిస్తారు. వాళ్లే నాగసాధువులు. కుంభమేళాకు శ్రీకారం చుట్టేది వాళ్లే. ఈసారి కూడా మేళాలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొహెంజోదారో కాలం నుంచీ నాగాల ఉనికికి సంబంధించిన ఆధారాలున్నాయి. అవసరమైనప్పుడు ఆలయాలను, సనాతన సంప్రదాయాలను అన్య మతస్తుల దాడులు తదితరాల నుంచి వీరు కాపాడినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆయుధాల వాడకంలోనూ వీళ్లు దిట్ట. అందుకే వీరిని హిందూ ధర్మానికి కమాండర్లుగానూ అభివర్ణిస్తుంటారు. వీరి ప్రాముఖ్యత అనాది కాలం నుంచీ కొనసాగుతూ వస్తోంది. హిమాలయాల్లో ఉంటారంటారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. తద్వారా పుణ్య జలాలకు మరింత పవిత్రత వస్తుందన్నది విశ్వాసం. అందుకే మేళాలో తొలి రాజ (షాహీ) స్నానం వీరితోనే చేయించి గౌరవిస్తారు. కుంభమేళా కోసం.. → ప్రయాగ్‌రాజ్‌లో 92 రహదారులు నిర్మించారు → 17 ప్రధాన రోడ్లను సుందరీకరించారు → 30 బల్లకట్టు వంతెనలు కట్టారు → భిన్న భాషల్లో 800 దారిసూచికలు ఏర్పాటుచేశారు → తొలిసారిగా అండర్‌వాటర్ డ్రోన్లను రంగంలోకి దింపారు. ఇవి 100 మీటర్ల లోతుకు సైతం వెళ్లి గాలిస్తాయి. అలాగే 120 మీటర్ల ఎత్తులోనూ గస్తీ కాయనున్నాయి. → రోజూ వేలాది భక్తులకు కంటి పరీక్షలకు 10 ఎకరాల్లో 11 భారీ గుడారాల్లో నేత్ర కుంభ్‌ను నెలకొల్పారు. → భద్రతకు ఏడంచెల కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు. → భక్తుల కోసం దేశ నలుమూలల నుంచి 13,000 ప్రత్యేక రైళ్లు ఏర్పాటయ్యాయి. → తప్పిపోయిన వారికోసం ‘ఖోయా–పాయా’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పూజకు ఛాన్స్ మిస్ అయ్యింది..?
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ పూజా హెగ్డే. తొలి సినిమాలోనే తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి, నాగచైతన్య సరసన నటించిన ఒక లైలా కోసం సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్లోనే కొనసాగుతుందని భావించినా.. హృతిక్ లాంటి స్టార్ హీరో సరసన బాలీవుడ్ ఛాన్స్ రావటంతో ముంబై బాట పట్టింది. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన మొహెంజోదారో చిత్రంలో హీరోయిన్గా నటించింది పూజ. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కావటంతో మరే సినిమా అంగీకరించకుండా దాదాపు రెండేళ్ల సమయాన్ని మొహెంజోదారో కోసం కేటాయించింది ఈ బ్యూటి. అయితే ఆశించినట్టుగా మొహెంజోదారో సక్సెస్ కాకపోవటంతో పూజా కెరీర్ కష్టాల్లో పడింది. ఒకప్పుడు పూజా హెగ్డే డేట్స్ కోసం ఎదురు చూసిన హీరోలు, దర్శకనిర్మాతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభమైన సినిమాకు ముందుగా పూజానే హీరోయిన్ అన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా టాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ అయితేనే బెటర్ అని భావిస్తున్నారట. దీంతో బన్నీ లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ మిస్ అయ్యింది పూజా హెగ్డే. -
పూజ కెరీర్ గాడిలో పడుతుందా..?
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజ హెగ్డే. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటికి అక్కినేని నాగచైతన్య సరసన నటించిన ఒక లైలా కోసం ఈ కూడా మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు స్టార్ హీరోల నుంచి పూజకు పిలుపు రాకపోయినా.., బాలీవుడ్ మాత్రం భారీ చిత్రంతో ఆహ్వానం పలికింది. హృతిక్ సరసన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన మొహెంజోదారో చిత్రంలో హీరోయిన్గా నటించింది పూజా హెగ్డే. భారీ చిత్రం కావటంతో పాటు హృతిక్, సంజయ్ ఘోష్ లాంటి టాప్ స్టార్స్‌తో కలిసి పని చేయటం కోసం తన కెరీర్ లోనే అత్యంత విలువైన రెండేళ్ల కాలాన్ని కేటాయించింది పూజ. అనుకున్నట్టుగా మొహెంజెదారో సక్సెస్ అయి ఉంటే పూజ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు అమ్మడి కెరీర్ కష్టాల్లో పడింది. మరి ఈ కష్టాలనుంచి పూజ ఎలా బయటపడుతుందో, తిరిగి ఎలా అవకాశాలు సాధిస్తుందో చూడాలి. -
మళ్లీ మొహంజొదారో
నాగరికత తొంభై శాతం మంది దర్శకుల ఊహలు తేలికైన కమర్షియల్ కథలకే పరిమితమవుతాయి. కానీ అశుతోష్ గోవారికర్ లాంటి దర్శకులు మాత్రం... థింక్ బిగ్ అన్నట్లు భారీ సినిమాలనే ఎంచుకుంటారు. ఆ కథలతో అద్భుతాలను సృష్టించి ప్రేక్షకులను అబ్బురపరుస్తారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన లగాన్, స్వదేశ్, జోథా అక్బర్... ఇలాంటి అనుభూతిని పంచినవే. లగాన్ భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్ అవార్డులకు పోటీ పడింది. అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్న కొత్త సినిమా మొహంజొదారో కూడా భారీ చిత్రమే. మొహంజొదారో చిత్రం 100 కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సింధులోయ నాగరికత కథానేపథ్యం. ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో సింధులోయ నాగరికత ఒకటి. క్రీస్తు పూర్వం 6 వేల సంవత్సరాల నాడు ఈ నాగరికత విలసిల్లింది. ఈ నాగరికతలో మొహంజొదారో ఒక ముఖ్య పట్టణం. ఆనాడే జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మొహంజొదారో ఓ సాక్ష్యం. వేల ఏళ్ల క్రితమే సింధు ప్రజలు ఎంతో ముందుచూపుతో ఆలోచించారు. ఎంతో ప్రణాళికాబద్దంగా సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. 1920లో సింధు నాగరికత అవశేషాలు బయటపడ్డాయి. అప్పుడే హరప్పా, మొహంజొదారో పట్టణాల గురించి ఆధునిక ప్రజలకు తెలిసి వచ్చింది. యునెస్కో 1980లో మొహంజొదారోను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చరిత్ర ఆధారంగానే మొహంజొదారో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు అశుతోష్. దానికోసం అతడు చాలా అధ్యయనం చేశాడు. ఏడుగురు పురావస్తు శాస్త్రజ్ఞుల సహాయంతో సింధు నాగరికత విషయాలు తెలుసుకున్నాడు. అప్పటి ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు, సంస్కృతి, భావోద్వేగాలు లాంటి సమాచారమంతా సేకరించాడు. పురావస్తు తవ్వకాలు జరిగిన గుజరాత్‌లోని ధోలావిరా లాంటి ప్రాంతాలు పరిశీలించాడు. సింధు నాగరికత గురించి అతికొద్ది ఆధారాలే లభిస్తున్నాయి. దీంతో చరిత్ర తెలుసుకుని సినిమాకు అన్వయించుకునేందుకు దర్శకుడికి మూడేళ్ల సమయం పట్టింది. మొహంజోదారో ఒక ప్రేమ కథ. సింధూ లోయ నాగరికతను ఆవిష్కరిస్తూ కథ సాగుతుంటుంది. తన శత్రువు కూతురిని ప్రేమించిన వ్యక్తి ఎలాంటి ప్రతిఘటన ఎదుర్కొన్నాడనేది ప్రధాన ఇతివృత్తం. అప్పటి పట్టణ వాతావరణాన్ని స్టూడియోలో వీఎఫ్ఎక్ తో పునసృష్టి చేశారు. ద డే ఆఫ్టర్ టుమారో, 10,000 బీసీ లాంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన నిపుణులు మొహంజొదారోను ప్రతిష్టించారు. ఆనాటి మానవుల శరీరాకృతి కోసం హృతిక్ రోషన్ మూడు నెలలు విదేశీ నిపుణుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించారు. మొహంజొదారో కోసం హృతిక్ 50 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నాడట. ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన పాటలు ఈ నెల 6 న విడుదల అయ్యి ఇప్పటికే అలరిస్తున్నాయి. సినిమా ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. -
నిజం నావైపే..!
సినిమా ‘చాలా విషయాలు చెప్పాలనుంది. చెప్తాను కానీ, ఇప్పుడు కాదు. మీ ప్రశ్నలన్నిటికీ కచ్చితంగా సమాధానం చెప్తాను. అందుకు (వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి) ఇది సరైన వేదిక కాదని నా అభిప్రాయం. సహనంతో ఎదురు చూడండి’’ అన్నారు హృతిక్ రోషన్. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో హృతిక్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మొహంజొదారో’ విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఓ కార్యక్రమంలో విలేకరులు సినిమా విశేషాలతో పాటు ఈ మధ్య కంగనా రనౌత్‌తో వచ్చిన వివాదం గురించి ప్రశ్నించారు. బాణాల్లా దూసుకొచ్చిన ప్రశ్నలకు హృతిక్ పై విధంగా స్పందించారు. ఈ హ్యాండ్సమ్ హీరో సమాధానం విన్న విలేకరులు.. ‘మీరు మీడియా ముందుకు రావడమే తక్కువ. మళ్లీ మాకు దొరుకుతారా?’ అంటూ ఒకరి తర్వాత మరొకరు వదలకుండా కంగనా రనౌత్ వివాదం గురించి ప్రశ్నించారు. హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ వివాదం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందు మాటలు విసురుకోవడం, ఆ తర్వాత ఒకరికొకరు కోర్టు నోటీసులు పంపించుకోవడం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలామంది కంగనానే సపోర్ట్ చేశారు. రవీనా టాండన్, విద్యా బాలన్, సోనమ్ కపూర్, కల్కీ కొచ్లిన్, సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు బహిరంగంగానే కంగనాకు మద్దతు తెలిపారు. హృతిక్ మాజీ భార్య సుసానేఖాన్, అతని కుటుంబ సభ్యులు మినహా హృతిక్‌కి మద్దతు ఇచ్చినవారు లేరు. ఈ విషయంపై హృతిక్ స్పందిస్తూ - ‘నిజం మీవైపు (అంటే.. హృతిక్ పక్కన) ఉన్నప్పుడు ఎవరి మద్దతూ అవసరం లేదు. ఆ నిజమే కొండంత అండ’ అని వ్యాఖ్యానించారు. మరి.. ఈ మాటలకు కంగనా స్పందిస్తారా? మరో వివాదానికి ఈ మాటలు నాంది అవుతాయా? -
బాలీవుడ్ హీరోతో 550 కోట్ల డీల్
త్వరలో మొహెంజోదారో సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న హృతిక్ రోషన్, మరో రికార్డ్ నెలకొల్పాడు. గతంలో మరే హీరో చేయని విధంగా స్టార్ నెట్‌వర్క్‌తో భారీ డీల్‌కు అంగీకరించాడు. రాబోయే హృతిక్ సినిమాల కోసం స్టార్ టివి ఏకంగా 550 కోట్ల మొత్తానికి హృతిక్ రోషన్‌తో ఒప్పదం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హృతిక్ తన రాబోయే ఆరు సినిమాల శాటిలైట్ హక్కులను ఆ టివి చానల్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. కాగా బాలీవుడ్ చరిత్రలోనే ఇదే బిగెస్ట్ డీల్ అంటున్నారు విశ్లేషకులు. జిందగీ నా మిలేంగే దుబారా, అగ్రిపథ్, క్రిష్ 3, బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలు మంచి విజయాలు సాధించటంతో పాటు.., ఆ సినిమాల శాటిలైట్ హక్కులు కూడా భారీ మొత్తాలకు అమ్ముడు పోవటంతో స్టార్ టివి ఇంత భారీ మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది. -
ఈ వారం యూట్యుబ్ హిట్స్
మొహెంజోదారో : ట్రైలర్ నిడివి : 3 ని. 30 సె. హిట్స్ : 77,41,591 బ్రిటిష్ పాలనకు ముందు, మొఘల్ సామ్రాజ్యానికి ముందు, క్రీస్తుకు ముందు, బుద్ధుడికి ముందు, ఇప్పటి భారతదేశానికి ముందు.. మొహెంజోదారో పట్టణాన్ని ప్రాణప్రదంగా భావించిన ఒక యువ రైతు, అక్కడి ఒక సౌందర్యవతిని ప్రేమించిన ధీరోదాత్తుడు.. పట్టణాన్ని, ప్రియురాలిని కాపాడేందుకు ప్రాణాలు తెగించే ప్రణయగాథ.. మొహెంజోదారో. ఈ చిత్రం ట్రైలర్ ఈవారమే విడుదలైంది. సినిమా ఆగస్టు 12న రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్, పూజా హెగ్డే నాయకానాయికలుగా నటిస్తున్నారు. లగాన్, జోధా అక్బర్ చిత్రాల దర్శకుడు అశుతోశ్ గోవరికర్ తీస్తున్న ఈ చిత్రంలోని సన్నివేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో ట్రైలర్ చూసి తెలుసుకోవచ్చు. క్రీ.పూ. 2016లో సింధూ లోయలో కథ మొదలౌతుంది. మనిషిలోని దురాశ అతి ప్రాచీనమైన మొహెంజోదారో నాగరికతను నాశనం చేస్తుంటే ఆ విధ్వంసాన్ని ఆపేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. ప్రధాన పూజారి కూతుర్ని ప్రేమిస్తాడు. ఆ క్రమంలోనే మొహెంజోదారో గురించి, తన గురించి, హీరోయిన్ గురించి కొన్ని రహస్యాలను తెలుసుకుంటాడు. బాత్ ఇన్ కోక్ నిడివి : 4 ని. 7 సె. హిట్స్ : 69,02,016 ఓ అమెరికన్ కోక్ ప్రియుడి ఈత కొలను వీడియో ఇది. కొన్ని వేల కోక్ బాటిళ్లను కొని ఇంట్లో జమచేసుకున్నాడు. ఇందుకు కొన్ని వారాల సమయం పట్టింది. కోక్ బాటిళ్ల మూతలు తీసి కొలను నింపుకున్నాడు. ఇందుకు కొన్ని గంటల సమయం పట్టింది. తర్వాత ఐస్ గడ్డలు వేసుకున్నాడు. ఆ తర్వాత కోక్ కొలనులోకి అంతెత్తున ఎగిరి దూకాడు. ఈత కొట్టాడు. స్నానం చేశాడు. పాటలు పాడాడు. ఆటలు ఆడాడు. తనతో పాటు కొలనులోకి తెచ్చుకున్న కోక్‌ను కొద్దిగా తాగి, మిగతాదంతా కోక్ సముద్రంలోకి ఒంపేశాడు. అక్కడితో ఆగలేదు. టెక్నాలజీ విధ్వంసానికి పాల్పడ్డాడు. (అదేమిటో వీడియోలో చూడండి). మొత్తం 1500 గ్యాలన్ల కోక్‌ను ఇందుకోసం వినియోగించాడు. అంటే 5678 లీటర్లు! మరి ఈ మాత్రం దానికి కొలను ఫుల్ అయిపోయిందా? ఫుల్ కాలేదు. నీళ్లను కోక్‌తో ఫిల్ చేశాడు. అతడు కుమ్మరించిన కోక్ పరిమాణం.. కొలను కెపాసిటీలో 7 శాతం మాత్రమేనట! ఏదైనా మంచి ఎక్స్పరిమెంట్. చిల్డ్ ఎక్స్‌పీరియెన్స్. -
'బుడ్డోడి'కి ఇంటా బయట పోటినే
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మళయాల సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండటం, సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఆగస్టు 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా పోటి తప్పేలా లేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రోజే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కలెక్షన్లపై ప్రేమమ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజొదారో కూడా ఆగస్టు 12నే రిలీజ్ అవుతోంది. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటిస్తుండటంతో పాటు పీరియాడిక్ జానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో జనతా గ్యారేజ్‌కు ఓవర్సీస్లో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి ఎన్టీఆర్ అదే రోజు థియేటర్లలోకి వస్తాడా..? లేక సేఫ్ టైంకి సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడా..? చూడాలి. -
బుడ్డోడికి ఇంటా బయట పోటినే
టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా జనతా గ్యారేజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు మళయాల సూపర్ స్టార్ కీలక పాత్రలో నటిస్తుండటం, సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండటంతో ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతున్నాయి. ఆగస్టు 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లో కూడా పోటి తప్పేలా లేదు. జనతా గ్యారేజ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న రోజే నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. మళయాల సూపర్ హిట్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జనతా గ్యారేజ్ కలెక్షన్లపై ప్రేమమ్ ఎఫెక్ట్ కనిపిస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్లో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజొదారో కూడా ఆగస్టు 12నే రిలీజ్ అవుతోంది. హృతిక్ లాంటి టాప్ స్టార్ నటిస్తుండటంతో పాటు పీరియాడిక్ జానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. దీంతో జనతా గ్యారేజ్‌కు ఓవర్సీస్లో థియేటర్ల సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. మరి ఇంత రిస్క్ చేసి ఎన్టీఆర్ అదే రోజు థియేటర్లలోకి వస్తాడా..? లేక సేఫ్ టైంకి సినిమాను పోస్ట్ పోన్ చేస్తాడా..? చూడాలి. -
హృతిక్‌కు రికార్డ్ రెమ్యూనరేషన్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే సూపర్ హీరో క్యారెక్టర్స్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో అదే స్థాయిలో భారీ రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నాడు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచే సినిమాలేవి చేయకపోయినా.. ఖాన్ త్రయానికి షాక్ ఇస్తూ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచాడు. ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజోదారో సినిమాలో నటిస్తున్నాడు హృతిక్. దర్శక నిర్మాత అశుతోష్ గోవరికర్, యుటివి మోషన్ పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హృతిక్ కూడా ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్లు, ప్రమాధకరమైన సీన్లలో నటించాడు. అందుకు తగ్గట్టుగా 68 కోట్ల రూపాయల రెమ్యూనరేష్ అందుకుంటున్నాడు హృతిక్. ఇప్పటి వరకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తో టాప్ ప్లేస్ లో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను వెనక్కు నెట్టి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా అవతరించాడు హృతిక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మొహెంజోదారో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 12న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
పారితోషికం యాభై కోట్లు!
‘‘అదే కనుక నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో హృతిక్ రోషన్ అవు తాడు’’ అని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. మరి.. ‘మొహొంజొదారో’ అనే చిత్రానికి హృతిక్ డిమాండ్ చేసిన పారితోషికం ఆ స్థాయిలో ఉంది. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇది చారిత్రక కథాచిత్రం కావడంతో నటీనటులకు శారీరక శ్రమ ఎక్కువే ఉంటుందట. దాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాణానికి ఎక్కువ రోజులు పడుతుందనే కారణంగానే హృతిక్ 50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. ఈ చిత్రం నిర్మాణానికి సంబంధించి ఓ ప్రముఖ స్టూడియో అధినేతతో సంప్రదింపులు జరుపుతున్నారట అశుతోష్. మరో పదిహేను రోజుల్లో నిర్మాత ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం.