హృతిక్కు రికార్డ్ రెమ్యూనరేషన్ | India's All-time Highest Paid Star hrithik roshan | Sakshi
Sakshi News home page

హృతిక్కు రికార్డ్ రెమ్యూనరేషన్

Published Thu, Jun 16 2016 9:30 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

హృతిక్కు రికార్డ్ రెమ్యూనరేషన్

హృతిక్కు రికార్డ్ రెమ్యూనరేషన్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే సూపర్ హీరో క్యారెక్టర్స్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరో అదే స్థాయిలో భారీ రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నాడు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచే సినిమాలేవి చేయకపోయినా.. ఖాన్ త్రయానికి షాక్ ఇస్తూ దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా నిలిచాడు.

ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మొహెంజోదారో సినిమాలో నటిస్తున్నాడు హృతిక్. దర్శక నిర్మాత అశుతోష్ గోవరికర్, యుటివి మోషన్ పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను 150 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హృతిక్ కూడా ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్లు, ప్రమాధకరమైన సీన్లలో నటించాడు. అందుకు తగ్గట్టుగా 68 కోట్ల రూపాయల రెమ్యూనరేష్ అందుకుంటున్నాడు హృతిక్.

ఇప్పటి వరకు 50 కోట్ల రెమ్యూనరేషన్ తో టాప్ ప్లేస్ లో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను వెనక్కు నెట్టి అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా అవతరించాడు హృతిక్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మొహెంజోదారో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.  ఆగస్టు 12న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement