ప్రపంచ అందగాళ్లలో హృతిక్‌ ఫస్ట్‌ | Hrithik Roshan rated the most handsome man in the world | Sakshi
Sakshi News home page

ప్రపంచ అందగాళ్లలో హృతిక్‌ ఫస్ట్‌

Published Wed, Jan 17 2018 12:48 AM | Last Updated on Wed, Jan 17 2018 12:48 AM

Hrithik Roshan rated the most handsome man in the world  - Sakshi

‘ఆసియన్‌ సెక్సియస్ట్‌ మేన్, మేన్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌’ వంటి టైటిల్స్‌ దక్కించుకున్న బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ తాజాగా మరో అరుదైన టైటిల్‌ సొంతం చేసుకున్నారు. ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ ఇచ్చిన ‘వరల్డ్‌ టాప్‌ టెన్‌ హ్యాండ్సమ్‌ హీరో’ల ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచారు ఈ ఆరడుగుల అందగాడు. అది కూడా ప్రముఖ హాలీవుడ్‌ నటులు రాబర్ట్‌ ప్యాటిన్సన్, క్రిస్‌ ఇవాన్స్‌లను వెనక్కి నెట్టి మరీ తొలి స్థానంలో నిలవడం విశేషం. మరో బాలీవుడ్‌ హీరో, కండల వీరుడు సల్మాన్‌ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు.

ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని ఘనతను హృతిక్‌ సాధించాడంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హృతిక్‌ని అభినందిస్తున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్‌ ఆనందాలకు అవధుల్లేవు. మా హీరోనే అందగాడు అంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రపంచ టాప్‌టెన్‌ హ్యాండ్సమ్‌ హీరోల్లో వరుసగా హృతిక్‌ రోషన్, రాబర్ట్‌ ప్యాటిన్సన్, గాడ్‌ఫ్రే గావో, క్రిస్‌ ఇవాన్స్, సల్మాన్‌ ఖాన్, డేవిడ్‌ బోరియానాజ్, నోవా మిల్స్, హెన్రీ కవిల్, టామ్‌ హిడిల్‌స్టన్, సామ్‌ హ్యూగన్‌ నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement