నిజం నావైపే..! | The film features Hrithik journalists | Sakshi
Sakshi News home page

నిజం నావైపే..!

Published Wed, Jul 13 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

నిజం నావైపే..!

నిజం నావైపే..!

 సినిమా
 
‘చాలా విషయాలు చెప్పాలనుంది. చెప్తాను కానీ, ఇప్పుడు కాదు. మీ ప్రశ్నలన్నిటికీ కచ్చితంగా సమాధానం చెప్తాను. అందుకు (వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి) ఇది సరైన వేదిక కాదని నా అభిప్రాయం. సహనంతో ఎదురు చూడండి’’ అన్నారు హృతిక్ రోషన్. అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో హృతిక్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మొహంజొదారో’ విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఓ కార్యక్రమంలో విలేకరులు సినిమా విశేషాలతో పాటు ఈ మధ్య కంగనా రనౌత్‌తో వచ్చిన వివాదం గురించి ప్రశ్నించారు. బాణాల్లా దూసుకొచ్చిన ప్రశ్నలకు హృతిక్ పై విధంగా స్పందించారు. ఈ హ్యాండ్‌సమ్ హీరో సమాధానం విన్న విలేకరులు.. ‘మీరు మీడియా ముందుకు రావడమే తక్కువ.


మళ్లీ మాకు దొరుకుతారా?’ అంటూ ఒకరి తర్వాత మరొకరు వదలకుండా కంగనా రనౌత్ వివాదం గురించి ప్రశ్నించారు. హృతిక్ రోషన్ - కంగనా రనౌత్ వివాదం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందు మాటలు విసురుకోవడం, ఆ తర్వాత ఒకరికొకరు కోర్టు నోటీసులు పంపించుకోవడం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంలో చాలామంది కంగనానే సపోర్ట్ చేశారు. రవీనా టాండన్, విద్యా బాలన్, సోనమ్ కపూర్, కల్కీ కొచ్లిన్, సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు బహిరంగంగానే కంగనాకు మద్దతు తెలిపారు. హృతిక్ మాజీ భార్య సుసానేఖాన్, అతని కుటుంబ సభ్యులు మినహా హృతిక్‌కి మద్దతు ఇచ్చినవారు లేరు. ఈ విషయంపై హృతిక్ స్పందిస్తూ - ‘నిజం మీవైపు (అంటే.. హృతిక్ పక్కన) ఉన్నప్పుడు ఎవరి మద్దతూ అవసరం లేదు. ఆ నిజమే కొండంత అండ’ అని వ్యాఖ్యానించారు. మరి.. ఈ మాటలకు కంగనా స్పందిస్తారా? మరో వివాదానికి ఈ మాటలు నాంది అవుతాయా?
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement