Pooja Hegde Said Mohenjo Daro Movie Is Lowest Point In Her Career - Sakshi
Sakshi News home page

Pooja Hegde: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్‌ రాలేదు

Published Tue, Jun 28 2022 3:22 PM | Last Updated on Tue, Jun 28 2022 4:37 PM

Pooja Hegde Said Mohenjo Daro Movie is Lowest Point in Her Career - Sakshi

దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్‌ హీరోలదరి సరసన నటించి అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్‌ ఇండియా చిత్రాలతో ఆమె కెరీర్‌లో దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో పలు చిత్రాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. మరోవైపు స్పెషల్‌ సాంగ్స్‌లో కూడా నటించే అవకాశం అందుకుంటుంది. 

చదవండి: బిగ్‌బాస్‌ 6లోకి వడ్డే నవీన్‌.. భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌!

ప్రస్తుతం హిందీలో సల్మాన్‌ ఖాన్‌ ‘కభీ ఈథ్‌ కభీ దివాలీ’ సర్కస్‌ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పూజా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన కెరీర్‌లో సక్సెస్‌, ఫెల్యూయిర్స్‌పై స్పందించింది. ‘తెలుగులో నేను నటించిన 6 సినిమాలు వరుసగా హిట్‌ అవ్వడం నా కెరీర్‌ అది బిగ్గెస్ట్‌ సక్సెస్‌. ఇక లోయేస్ట్‌ పాయింట్‌ వచ్చేసి నా డెబ్యూ(మొహంజోదారో) చిత్రమే బాక్సాఫీసు వద్ద పరాజయం పొందడం. నా కెరీర్‌లో అది ఒక చెత్త సినిమాగా నిలిచింది. నా లీస్ట్‌ చిత్రాల్లో అది ఒక్కటే. ఆ సినిమా వల్ల నాకు ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు.

చదవండి: క్రేజీ రూమర్.. ఆ దర్శకుడితో మహేశ్‌ బాబు 30వ సినిమా!

ఈ సినిమా ఫ్లాప్‌తో నాకు ఐరన్‌ లెగ్‌ అనే పేరు కూడా వచ్చింది. ఈ క్రమంలో తెలుగు చిత్రం అలా వైకుంఠపురంలో నాకు బ్రేక్‌ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమా నా కెరీర్‌ను అద్భుతంగా మార్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా పూజా బాలీవుడ్‌ మూవీ మొహంజోదారోతో సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ గ్రీకువీరుడు హృతిక్‌ రోషన్‌తో పూజా జతకట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో పూజా జనగనమణ మూవీతో పాటు పలు ప్రాజెక్ట్స్‌కు సైన్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement