ప్రమోషన్ అంటే.. హీరోయిన్కు జ్వరమొచ్చింది! | pooja hegde down with dengue fever, distances self from movie promotion | Sakshi
Sakshi News home page

ప్రమోషన్ అంటే.. హీరోయిన్కు జ్వరమొచ్చింది!

Published Tue, Jul 26 2016 3:52 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ప్రమోషన్ అంటే.. హీరోయిన్కు జ్వరమొచ్చింది! - Sakshi

ప్రమోషన్ అంటే.. హీరోయిన్కు జ్వరమొచ్చింది!

బాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం రావడమే అరుదు. అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్ అనేసరికి మాత్రం జ్వరం వచ్చిందంటూ ఇంట్లో పడకేసిందట. అది కూడా అలాంటి, ఇలాంటి జ్వరం కాదు.. డెంగ్యూ జ్వరం. దాంతో తప్పనిసరిగా ఆమె ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నాలుగు రోజుల క్రితం ఆమెకు డెంగ్యూ జ్వరాన్ని గుర్తించారని, కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో ఏంటోనని టెస్ట్ చేయించుకుంటే ఈ వ ఇషయం తెలిసిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

నిజానికి సినిమా ప్రమోషన్ కోసం పలు ఫొటోషూట్లకు కూడా వస్తానని చెప్పిందని, కానీ ఇప్పుడు ఇంటికి పరిమితం అయ్యిందని చెబుతున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ కూడా సానుకూలంగానే స్పందించి.. ముందు తగినంత విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాతే రావాలని తెలిపారట. తాను తొలిసారిగా అమీషాపటేల్తో నటించానని, అది తామిద్దరికీ మొదటి సినిమా అని.. ఇప్పుడు పూజా హెగ్డేను బాలీవుడ్కు పరిచయం చేయడం చాలా గొప్పగా అనిపిస్తోందని హృతిక్ చెప్పాడు. తెలుగులో ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ సరసన, ఒక లైలా కోసంలో నాగచైతన్యతోను నటించిన పూజా హెగ్డే.. హిందీలో తెరంగేట్రం చేయడమే టాప్ హీరోతో కావడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement