Pooja Hegde Reveals Her Heart Broken Moment With Hrithik Roshan: టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటించిన 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చెర్రీకి సరసన పూజా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది పూజా హెగ్డే.
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కెరీర్లో సూపర్ హిట్గా నిలిచిన చిత్రాల్లో 'కోయీ మిల్గయా' ఒకటి. ఈ సినిమా సమయంలో జరిగిన విషయాలను పూజా హెగ్డె చెప్పుకొచ్చింది. 'కోయీ మిల్గయా సినిమా సమయంలో నాకు పన్నెండేళ్లు. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షోకు వెళ్లాను. కానీ ఫొటో కోసం ప్రయత్నిస్తుంటే హృతిక్ స్టేజి దిగి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైపోయినట్లుగా అనిపించింది.' అని తెలిపింది. (చదవండి: పూజా హెగ్డేపై దిల్‌రాజు కామెంట్స్.. షాక్ అయిన ఆడియెన్స్)
అయితే సుమారు పదేళ్ల తర్వాత పూజా హెగ్డే, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా 'మొహంజొదారో' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తున్న సర్కస్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెస్తోపాటు పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే)
Pooja Hegde-Hrithik: అప్పుడు నా గుండె ముక్కలైపోయింది: పూజా హెగ్డే
Published Tue, May 3 2022 12:22 PM | Last Updated on Tue, May 3 2022 1:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment