koi mil gaya
-
ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ. తాజాగా హన్సిక చైల్డ్‌వుడ్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. 2003లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్‌లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్‌లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్‌ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. -
నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక
హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఇప్పటికే 50 సినిమాల మార్క్ దాటేసింది. దక్షిణాదితో పాటు హిందీలోనూ నటించింది. అయితే ఈమె పెళ్లి టైంలో కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. వాటి వల్ల తన తల్లి ఎలా బాధపడిందో కూడా చెప్పుకొచ్చింది. ఏంటా రూమర్స్? ముంబయికి చెందిన హన్సిక.. పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లోనూ యాక్ట్ చేసింది. కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత 2007లో 'దేశముదురు' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్‌లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!) పెళ్లి టైంలో అలా దాదాపు 20 ఏళ్లుగా హన్సిక సినిమాలు చేస్తోంది. గతేడాది డిసెంబరులో ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో హన్సిక.. అప్పట్లో ఎదగడానికి ఇంజెక్షన్స్ తీసుకుందనే పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. దీనిపై హన్సిక తల్లి స్పందించింది. ఇప్పుడు ఈ రూమర్స్‌పై తన అభిప్రాయాన్ని హన్సిక చెప్పేసింది. హన్సిక కామెంట్స్ 'నేను ఇలాంటి రూమర్స్ అస్సలు పట్టించుకోను. కానీ మా అమ్మ మాత్రం చాలా బాధపడుంటుంది. కానీ నాకు ఆ బాధని ఎప్పుడూ చూపించలేదు. ఎందుకంటే నన్ను రక్షించేది ఆమెనే కదా. అయితే ప్రశంసలు వచ్చినప్పుడు నేను తీసుకున్నా. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా అలానే తీసుకుంటా. వాటి విషయంలో నేను చాలా స్ట్రాంగ్ అయిపోయా' అని హన్సిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: ఊహించని సర్ప్రైజ్.. హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్లు!) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
ఆ సినిమాలో అన్యాయం.. అందుకే ఇండస్ట్రీని వదిలేశా: ప్రముఖ విలన్
మన దేశంలో వచ్చిన సూపర్‌హీరో సినిమాల్లో 'క్రిష్' ఓ సంచలనం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలొచ్చాయి. నాలుగో దానికోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ సిరీస్ లో నటించిన ప్రముఖ నటుడు సంచలన కామెంట్స్ చేశాడు. ఈ చిత్రం వల్లే తాను ఏకంగా ఇండస్ట్రీకి పరోక్షంగా దూరం కావాల్సి వచ్చిందని అన్నాడు. ఏం జరిగింది? హృతిక్ రోషన్, ప్రీతి జింతా జంటగా నటించిన 'కోయి మిల్ గయా'.. 2003లో థియేటర్లలో విడుదలైంది. కొన్నాళ్లకు తెలుగులోనూ విడుదల చేస్తే ఇక్కడ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇందులో నటుడు రజత్ బేడీ విలన్ గా నటించాడు. తన వంతుగా ఆకట్టుకున్నాడు. అయితే ఇతడి పాత్రకు సంబంధించి చాలా సన్నివేశాలు తీశారట. వాటిని ఎడిటింగ్ లో కత్తిరించారట. ఈ విషయాన్ని స్వయంగా రజత్ బేడీనే చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టాడు. ఇదికాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) ఏం చెప్పాడు? 'కోయి మిల్ గయా సినిమాలో నా పాత్ర హీరోహీరోయిన్లకు సమానంగా ఉంటుంది. కానీ ఫైనల్ ఎడిట్ లో నా సీన్స్ అన్నీ తీసేశారు. ప్రీతితో చాలా సన్నివేశాలు ఉంటాయి. వాటన్నింటినీ లేపేశారు. ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. ఇలా జరిగేసరికి చాలా బాధగా అనిపించింది. నా పాత్రకు అస్సలు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో చాలా నిరాశచెందాను' అని రజత్ బేడీ ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే నటన వదిలేశా 'అయితే ఇండస్ట్రీని విడిచిపెట్టడానికి 'కోయి మిల్ గయా' సినిమా ఒక్కటే రీజన్ కాదు. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సన్నీ డియోల్ తో కలిసి ఓ మూవీ చేస్తే.. నాకు రెమ్యునరేషన్ చెక్ రూపంలో ఇచ్చారు. అదేమో బౌన్స్ అయింది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా స్నేహితులేమో రూ.2000 కోట్ల టర్నోవర్ తో కంపెనీలు నడుపుతుంటే.. ఇక్కడేం చేస్తున్నానా అనిపించింది. పాపులారిటీ వస్తోంది కానీ సంపాదన కూడా ముఖ్యం అనిపించింది' అని రజత్ బేడీ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య) -
అప్పుడు నా గుండె ముక్కలైపోయింది: పూజా హెగ్డే
Pooja Hegde Reveals Her Heart Broken Moment With Hrithik Roshan: టాలీవుడ్ బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించిన 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో చెర్రీకి సరసన పూజా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది పూజా హెగ్డే. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో 'కోయీ మిల్గయా' ఒకటి. ఈ సినిమా సమయంలో జరిగిన విషయాలను పూజా హెగ్డె చెప్పుకొచ్చింది. 'కోయీ మిల్గయా సినిమా సమయంలో నాకు పన్నెండేళ్లు. నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఫొటో దిగాలని ప్రీమియర్ షోకు వెళ్లాను. కానీ ఫొటో కోసం ప్రయత్నిస్తుంటే హృతిక్ స్టేజి దిగి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైపోయినట్లుగా అనిపించింది.' అని తెలిపింది. (చదవండి: పూజా హెగ్డేపై దిల్‌రాజు కామెంట్స్.. షాక్ అయిన ఆడియెన్స్) అయితే సుమారు పదేళ్ల తర్వాత పూజా హెగ్డే, హృతిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా 'మొహంజొదారో' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తున్న సర్కస్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో రణ్వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెస్తోపాటు పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తోంది. (చదవండి: ఆ స్టార్ హీరోను 'ఆంటీ' అంటానంటున్న పూజా హెగ్డే) -
క్రిష్-3 లేటెస్ట్ స్టిల్స్
-
క్రిష్ 3 పోస్టర్స్
కోయి మిల్ గయా, క్రిష్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం క్రిష్ 3 హృతిక్ రోహన్, ప్రియాంక చోప్రా, కంగనా రౌనత్ ముఖ్యపాత్రల్లో నటించారు హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఈ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించారు