ఈ ఫోటోతో వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా? | Hansika Motwani Reacted On Her Childhood Photo Controversy After That Pic Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

ఈ ఫోటోతో భారీ వివాదంలో చిక్కుకున్న టాప్ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Published Sun, Feb 11 2024 4:59 PM | Last Updated on Sun, Feb 11 2024 6:07 PM

Hansika Motwani Her Child Photo Viral Now - Sakshi

అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. యూత్‌ గుండెల్లో చెరగిపోని ముద్రే వేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడం అవి పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పూర్తిగా అవకాశాలు తగ్గాయి. ఈ మధ్యే మై నేమ్ ఈజ్ శృతి,105 మినిట్స్‌ సినిమాలతో మళ్లీ తెరపైకి కనిపించింది ఈ బ్యూటీ.

తాజాగా హన్సిక చైల్డ్‌వుడ్‌ ఫోటో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంది. ముంబయికి చెందిన హన్సిక పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లో యాక్ట్ చేసింది. ఆ సమయంలోని ఫోటో ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. కానీ ఈ ఫోటో వల్ల ఆమె కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంది.

2003లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఉన్న హన్సిక కేవలం నాలుగేళ్ల గ్యాప్‌లో అంటే 2007లో దేశముదురు చిత్రంతో హీరోయిన్‌ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్‌లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. కానీ ఆ రూమర్స్‌ను ఆమె కొట్టిపారేసింది. కానీ తన అమ్మగారు చాలా బాధపడినట్లు ఆమె చెప్పుకొచ్చింది. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న హన్సిక రెండేళ్ల క్రితం ఓ బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకొని లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Video

View all
 
Advertisement