Rajat Bedi Reveals Many Of His Scenes Were Cut Out From Koi Mil Gaya Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Rajat Bedi: నా సీన్లు లేపేశారు.. అందుకే నటనకు దూరం

Published Wed, Jun 28 2023 8:35 AM | Last Updated on Wed, Jun 28 2023 10:22 AM

Rajat Bedi Koi Mil Gaya Movie Issue - Sakshi

మన దేశంలో వచ్చిన సూపర్‌హీరో సినిమాల్లో 'క్రిష్' ఓ సంచలనం. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు మూడు సినిమాలొచ్చాయి. నాలుగో దానికోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ సిరీస్ లో నటించిన ప్రముఖ నటుడు సంచలన కామెంట్స్ చేశాడు. ఈ చిత్రం వల్లే తాను ఏకంగా ఇండస్ట్రీకి పరోక్షంగా దూరం కావాల్సి వచ్చిందని అన్నాడు. 

ఏం జరిగింది?
హృతిక్ రోషన్, ప్రీతి జింతా జంటగా నటించిన 'కోయి మిల్ గయా'.. 2003లో థియేటర్లలో విడుదలైంది. కొన‍్నాళ్లకు తెలుగులోనూ విడుదల చేస్తే ఇక్కడ కూడా ఆదరణ దక్కించుకుంది. ఇందులో నటుడు రజత్ బేడీ విలన్ గా నటించాడు. తన వంతుగా ఆకట్టుకున్నాడు. అయితే ఇతడి పాత్రకు సంబంధించి చాలా సన్నివేశాలు తీశారట. వాటిని ఎడిటింగ్ లో కత్తిరించారట. ఈ విషయాన్ని స్వయంగా రజత్ బేడీనే చెప్పుకొచ్చాడు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఇదంతా బయటపెట్టాడు. ఇదికాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?)

ఏం చెప్పాడు?
'కోయి మిల్ గయా సినిమాలో నా పాత్ర హీరోహీరోయిన్లకు సమానంగా ఉంటుంది. కానీ ఫైనల్ ఎడిట్ లో నా సీన్స్ అన్నీ తీసేశారు. ప్రీతితో చాలా సన్నివేశాలు ఉంటాయి. వాటన్నింటినీ లేపేశారు. ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. ఇలా జరిగేసరికి చాలా బాధగా అనిపించింది. నా పాత్రకు అస్సలు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో చాలా నిరాశచెందాను' అని రజత్ బేడీ ఆవేదన వ్యక్తం చేశాడు. 

అందుకే నటన వదిలేశా
'అయితే ఇండస్ట్రీని విడిచిపెట్టడానికి 'కోయి మిల్ గయా' సినిమా ఒక్కటే రీజన్ కాదు. మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సన్నీ డియోల్ తో కలిసి ఓ మూవీ చేస్తే.. నాకు రెమ్యునరేషన్ చెక్ రూపంలో ఇచ్చారు. అదేమో బౌన్స్ అయింది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నా స్నేహితులేమో రూ.2000 కోట్ల టర్నోవర్ తో కంపెనీలు నడుపుతుంటే.. ఇక్కడేం చేస్తున్నానా అనిపించింది. పాపులారిటీ వస్తోంది కానీ సంపాదన కూడా ముఖ్యం అనిపించింది' అని రజత్ బేడీ చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement