పూజకు ఛాన్స్ మిస్ అయ్యింది..? | Pooja Hegde rejected for bunnys movie | Sakshi
Sakshi News home page

పూజకు ఛాన్స్ మిస్ అయ్యింది..?

Published Tue, Aug 30 2016 11:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

పూజకు ఛాన్స్ మిస్ అయ్యింది..?

పూజకు ఛాన్స్ మిస్ అయ్యింది..?

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ముకుంద సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మోడల్ పూజా హెగ్డే. తొలి సినిమాలోనే తన అందంతో అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటి, నాగచైతన్య సరసన నటించిన ఒక లైలా కోసం సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్లోనే కొనసాగుతుందని భావించినా.. హృతిక్ లాంటి స్టార్ హీరో సరసన బాలీవుడ్ ఛాన్స్ రావటంతో ముంబై బాట పట్టింది.

భారీ బడ్జెట్తో పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన మొహెంజోదారో చిత్రంలో హీరోయిన్గా నటించింది పూజ. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం కావటంతో మరే సినిమా అంగీకరించకుండా దాదాపు రెండేళ్ల సమయాన్ని మొహెంజోదారో కోసం కేటాయించింది ఈ బ్యూటి. అయితే ఆశించినట్టుగా మొహెంజోదారో సక్సెస్ కాకపోవటంతో పూజా కెరీర్ కష్టాల్లో పడింది.

ఒకప్పుడు పూజా హెగ్డే డేట్స్ కోసం ఎదురు చూసిన హీరోలు, దర్శకనిర్మాతలు ఇప్పుడు మొహం చాటేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభమైన సినిమాకు ముందుగా పూజానే హీరోయిన్ అన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా టాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ అయితేనే బెటర్ అని భావిస్తున్నారట. దీంతో బన్నీ లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ మిస్ అయ్యింది పూజా హెగ్డే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement