Top 5 Highest Paid Celebrities in Instagram, Cristiano Ronaldo and Kylie Jenner and More - Sakshi
Sakshi News home page

Instagram: ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! టాప్ 5 జాబితాలో ఎవరున్నారంటే?

Jun 24 2023 7:39 PM | Updated on Jun 24 2023 8:18 PM

Top 5 highest paid celebrities in instagram Cristiano Ronaldo Kylie Jenner and more - Sakshi

Highest Paid Instagram Stars 2023: ఆధునిక కాలంలో వాట్సాప్, ట్విటర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ రాజ్యమేలుతున్నాయి. సాధారణ ప్రజలను పక్కన పెడితే సెలబ్రిటీలు మాత్రమే ఇందులో బాగానే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఇన్‌స్టా ఒకటి. ఇది చాలా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్క్. దాదాపు అన్ని బ్రాండ్‌లు, విక్రయదారులు, ఏదో ఒక సమయంలో, ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కలిసి పనిచేసే ప్రణాళికలను కలిగి ఉంటారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న  ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవరు? వారు ఒక పోస్ట్‌కి ఎంత సంపాదిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

క్రిస్టియానో ​​రొనాల్డో
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరైన క్రిస్టియానో ​​రొనాల్డో గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌ ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీలలో ఒకడు. ఇతడు ఒక ఫోటో లేదా వీడియోని పోస్ట్ చేస్తే సుమారు 2.8 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. 643 మిలియన్స్ పాలొవర్స్ కలిగి ఉండటం వల్ల ఇంత మొత్తం చెల్లిస్తారని కూడా కొంతమంది చెబుతున్నారు.

కైలీ జెన్నర్
కైలీ బ్యూటీ బ్రాండ్, కైలీ కాస్మోటిక్స్ ఓనర్ అయిన జెన్నర్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎక్కువ సంపాదించే సెలబ్రిటీల జాబితాలో ఒకరు. ఈమె ఈమెకు సుమారు 415 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. జెన్నర్ ఒక పోస్టుకి లేదా వీడియోకి 1.8 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

లియో మెస్సీ
ఇక జాబితాలో మూడవ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీ అర్జెంటీనా దేశానికి చెందిన లియోనెల్ మెస్సీ. ఇతనికి 511  మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ లేదా వీడియో షేర్ చేస్తే 1.6 మిలియన్ డాలర్స్ తీసుకుంటాడని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్!)

సెలీనా గోమెజ్
ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను కలిగిన ఉన్న స్పానిష్ గాయని, నటి 'సెలీనా గోమెజ్' ఇన్‌స్టాలో ఒక పోస్టుకి 1.4 మిలియన్ల డాలర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈమెకు 456 మిలియన్స్ కంటే ఎక్కువ మంది పాలొవర్స్ ఉన్నారు. అంతే కాకుండా ఈమె అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా ఉంది.

(ఇదీ చదవండి: సెలబ్రిటీలతో కలిసి బిజినెస్.. ఆ నయా ట్రెండ్‌ మొదలుపెట్టిందే ఇతడు!)

డ్వేన్ జాన్సన్
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదించే సెలబ్రిటీల జివితలో ఐదవ వ్యక్తి డ్వేన్ జాన్సన్. ఈయన "ది రాక్"గా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు. ఈయన మొదట డబ్ల్యుడబ్ల్యుఈ టీవీ షోలో రెజ్లర్‌గా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా అనేక యాక్షన్ చిత్రాల్లో కూడా కనిపించాడు. ఇతడు ఒక పోస్టుకి ఇన్‌స్టాలో 1.1 మిలియన్ డాలర్లు తీసుకుంటాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement