ఆమెకు ఒక్క ఎపిసోడ్ కే రూ.1.25 కోట్లు! | Raveena Tandon becomes 'highest paid' Bollywood actress on TV | Sakshi
Sakshi News home page

ఆమెకు ఒక్క ఎపిసోడ్ కే రూ.1.25 కోట్లు!

Published Mon, Feb 22 2016 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

ఆమెకు ఒక్క ఎపిసోడ్ కే రూ.1.25 కోట్లు!

ఆమెకు ఒక్క ఎపిసోడ్ కే రూ.1.25 కోట్లు!

భారతీయ బుల్లితెరలపై ప్రసారాలు మొదలైనప్పటి రియాలిటీ షోలలో సినీనటులదే హవా అని తెలిసిందే. హీరోల విషయం పక్కనపెడితే రియాలిటీ షోల్లో నటీమణుల ఎంపిక విధానం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. వివిధ భాషల్లో రియాలిటీ షోలు చేస్తోన్న హీరోలు ఒకేసారి వెండితెర, బుల్లితెరలపై అభిమానుల్ని కనువిందు చేస్తున్నారు. అదే మహిళల దగ్గరికి వచ్చేసరికిమాత్రం ట్రెండిగ్ హీరోయిన్లను కాదనుకుని మాజీ హీరోయిన్లకు పట్టం కడుతుంటారు షో నిర్వాహకులు.

మాధురీ దీక్షిత్, శిల్పా శెట్టి, సోనాలి బింద్రే, కాజల్ సోదరి తనీషా, ఇషా డియోల్, తెలుగులో సదా, రోజా, తమిళంలో కుష్భూ లాంటివాళ్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న లేదా వ్యవహరించిన రియాలిటీ షోలు ఎంత హిట్ అయ్యాయో తెలిసింది. ఒకానొక దశలో మాధురీ, శిల్పాలకు ఒక్కో ఎపిసోడ్ కు గానూ కోటి రూపాయాల పారితోషికం లభించేంది. ఇప్పుడా రికార్డును మరో వెటరన్ హీరోయిన రవీనా టాండన్ బద్దలుకొట్టబోతోంది.

ఒక్క ఎపిసోడ్ కు రూ.1.25 కోట్లు.. బాలీవుడ్ నటీనటుల పరంగా బుల్లితెర చరిత్రలోనే అత్యధిక పారితోషికం ఇది! ఈ రికార్డు పారితోషికం అందుకోబోతోంది మరెవరోకాదు.. వెటరన్ హీరోయిన్ రవీనా టాండన్. చానెల్ 'వి' రూపొందిస్తోన్న 'షైన్ ఆఫ్ ఇండియా' రియాలిటీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ షోకు మరో నటి ఫర్నాజ్ షెట్టి యాంకరింగ్ చేస్తారు. రవీనా గతంలోనూ 'సాహిబ్ బీవీ గులాం', 'ఛోటే మియా', కామెడీకా మహా ముఖాబ్లా', సింప్లీ బాతే విత్ రవీనా' లాంటి రియాలిటీ షోల్లో ప్రేక్షకులను మెప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement