
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌టీ వసూళ్లు నాలుగోసారి రూ.1.60 లక్షల కోట్లు దాటాయి. సెపె్టంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో 10 శాతం పెరిగి రూ. 1.47 లక్షల కోట్ల నుంచి రూ. 1.62 లక్షల కోట్లకు చేరాయి. ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గత నెల స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ. 1,62,712 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీ రూ. 29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ రూ. 37,657 కోట్లు, సమీకృత జీఎస్‌టీ రూ. 83,623 కోట్లు, సెస్సు రూ. 11,613 కోట్లుగా ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెపె్టంబర్) స్థూల జీఎస్‌టీ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11 శాతం పెరిగి రూ. 9,92,508 కోట్లకు చేరాయి. సగటున ప్రతి నెలా రూ. 1.65 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. రూ. 1.60 లక్షల కోట్ల వసూళ్లు ఇకపై సర్వసాధారణమైన విషయంగా మారవచ్చని కేపీఎంజీ పరోక్ష పన్నుల విభాగం హెడ్ అభిõÙక్ జైన్ తెలిపారు. రాబోయే పండుగ సీజన్‌లో వసూళ్లు మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. ఎకానమీ స్థిరంగా వృద్ధి బాటన కొనసాగుతుండటాన్ని ఇది సూచిస్తుందని ఈవై ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ తెలిపారు. జమ్మూ .. కశీ్మర్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లలో వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతుండటమనేది ఆయా ప్రాంతాల్లో వినియోగం పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment