హైదరాబాద్‌లో మరో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టు | prostitution rackets busted in hyderabad, three arrested | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టు

Published Fri, Oct 20 2017 9:08 AM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

నగర శివార్లలో మరో సెక్స్‌ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు చెక్‌ పెట్టారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్‌గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్.....ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యవభిచారం చేయిస్తోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన సదరు బాలిక.....ఆ నరకకూపం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. నిర్వాహకురాలు నిషాఖాన్‌తో పాటు....అందుకు సహకరించిన పహాడీ షరీఫ్‌కు చెందిన తహసీన్ ఫాతిమా , సభా అనే మరో ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్‌ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి....మైనర్ బాలికను నరకకూపంలోకి దింపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement