upparapalli
-
హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
-
హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్‌గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్.....ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యవభిచారం చేయిస్తోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన సదరు బాలిక.....ఆ నరకకూపం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. నిర్వాహకురాలు నిషాఖాన్‌తో పాటు....అందుకు సహకరించిన పహాడీ షరీఫ్‌కు చెందిన తహసీన్ ఫాతిమా , సభా అనే మరో ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి....మైనర్ బాలికను నరకకూపంలోకి దింపారు. మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి సికింద్రాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ సందర్భంగా హోటల్లో పేకాట ఆడుతున్న 38మందిని అదుపులో తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ శశిధర్ రాజు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. హోటల్లో మూడు గదులను ఆర్గనైజర్స్ బుక్ చేసుకున్నారని, సంజయ్ అనే ఆర్గనైజర్‌తో పాటు మరో ఇద్దరు కూడా హోటల్లో వేరువేరుగా రూమ్స్ బుక్ చేసుకుని మూడు కార్డ్స్ గేమ్‌ను ఆడిస్తున్నారన్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.24 లక్షల నగదుతోపాటు 1800 క్యాసినో కాయిన్స్, 38 సెల్ఫోన్లు, మద్యం సీసాలు, హుక్కా పాట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ముగ్గురు ఆర్గనైజర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హోటల్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
ఉత్సాహంగా రాతిదూలం పోటీలు
అనంతపురం రూరల్ : ఉప్పరపల్లి పాలవేరు వీరనాగమ్మ అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సహంగా సాగాయి. ఒంగోలు పాలపళ్ల జాతి గిత్తలు పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చాయి. రాజీవ్‌కాలనీ ఓబుళపతి ఆచారి వృషభాలు ప్రథమ, జనశక్తినగర్ హనుమంతరెడ్డి వృషభాలు ద్వితీయ, చాగల్లు ఆదినారాయణ వృషభాలు తృతీయ బహుమతి, ముదిగుబ్బ రాజగోపాల్ వృషభాలు నాలుగో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులకు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5వేలు చొప్పున ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన వారికి అన్నదానం నిర్వహించారు. సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి బండ లాగుడు పోటీలకు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వృషభాలు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం వీరనాగమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
ఎంజీఎంలో చికిత్స పొందుతున్నబాధితురాలు చెన్నారావుపేట : భార్యపై కిరోసిన్ పోసి భర్త నిప్పంటించిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కడబోయిన సదయ్య కుమార్తె సరితను పదేళ్లక్రితం ఉప్పరపల్లికి చెందిన కుక్కల రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జ న్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్‌పోసి నిప్పం టించాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఎంజీ ఎంకు తరలించారు. బాధిత మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు. -
కారును ఢీకొట్టిన ఆటో: ఐదుగురికి తీవ్ర గాయాలు
వరంగల్ : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి సమీపంలో మంగళవారం కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదురుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
ఆ నాణేలు విజయనగరాధీశులవే..!
‘ఉప్పరపల్లి’ బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ అనంతపురం కల్చరల్: అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్దానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీటి వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చారిత్రక ఆధారాలతో చెప్తున్నారు. -
ఆ నాణేలు విజయనగర రాజుల కాలం నాటివి..
- 'ఉప్పరపల్లి' బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ - 16వ శతాబ్దంలో అరవీడు వంశస్తులు వీటిని వాడారని వెల్లడి అనంతపురం : అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్ధానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీడు వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చరిత్రాత్మక ఆధారాలతో చెప్తున్నారు. 'సుమారు 52.9 గ్రెయిన్స్ (గ్రాముకన్నా తక్కువ) బరువుగల ఈ నాణేలకు ఒక వైపు వేంకటేశ్వరుడు నిలబడిన విధంగా, మరోవైపు దిగువ భాగాన 'శ్రీవేంకటేశ్వరాయ నమః' అని దేవనాగరి లిపిలో అక్షరాలు కన్పిస్తున్నాయి. ఈ నాణేలు ఇలా బయటపడటం వెనుక అనేక సందేహాలున్నాయి' అని అనంతపురంలోని పురావస్తు మ్యూజియం టెక్నికల్ అసిస్టెంట్ రామసుబ్బారెడ్డి అన్నారు. సాధారణంగా ఇటువంటి నాణేలు బయట పడాలంటే ఆ పరిసర ప్రాంతాలలో చారిత్రక ఆలయాలుగానీ, పురాతన బావులుగానీ, కోటలాంటి ప్రదేశాలుగానీ ఉండాలి. నాణేలు విసిరేసినట్టుగా కాకుండా కుండలలోనో, రాగి పాత్రలలోనో తప్పనిసరిగా ఉంటాయి. ఉప్పరపల్లిలో అలాంటి చిహ్నాలేవీ కనపడకపోవడం మరింత పరిశోధనకు దారి తీస్తోందని వివరించారు. తమ దృష్టికి వచ్చిన నాణెం 'కాయిన్స్ ఆఫ్ విజయనగర' పుస్తకంలోని వివరాలతో సరిపోలినందున ఇది కచ్చితంగా ఆ కాలానికి చెందినదేనని నిర్ధారించారు. దాదాపు 20 నాణేలు దొరికినట్టు గ్రామస్తులు చెబుతున్నా వాటిని వెంటనే కరిగించేయడం లేదా కెమికల్ క్లీనింగ్ చేయించడం వల్ల చారిత్రక విషయాల పరిశోధన కొంత కష్టంగా మారే అవకాశముందన్నారు.