
ఆ నాణేలు విజయనగరాధీశులవే..!
‘ఉప్పరపల్లి’ బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ
అనంతపురం కల్చరల్: అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్దానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీటి వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చారిత్రక ఆధారాలతో చెప్తున్నారు.