Archeology
-
మోహన్ లాల్‌కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే ?
Mohanlal Questioned By Ed In Money Laundering Case With Monson Mavunkal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు మోహన్ లాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్‌కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్ లాల్ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు. 'కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.' అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్‌ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4431454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
2700 నాటి పురాతన టాయిలెట్.. ఎలా ఉందంటే?
జెరూసలేం: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో బెరూసలేం ఒకటన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేయడంతో పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్రూమ్లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్ కింద లోతైన సెప్టెక్ ట్యాంక్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను కొనుగోలు చేసేవారని చెప్పారు. టాయిలెట్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులోని జంతువుల ఎముకలతో పటు లభించిన పలు వస్తువల ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలితో పాటు అప్పటి వ్యాధులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ విహార ప్రదేశంలో పెద్ద ఎస్టేట్ ఉన్న ప్రదేశంలో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే. చదవండి: Taliban: సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశాం -
ఈ నత్త గుళ్లల వయసు ఆరున్నర కోట్ల ఏళ్లు..
సాక్షి, హైదరాబాద్: ఈ చిత్రంలోని నత్తగుళ్లల వయసు ఎంతో తెలుసా..? ఏకంగా ఆరున్నర కోట్ల సంవత్సరాలు. ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీ రేంజ్ పరిధిలోని గోయెనా గుట్టల మీద ఈ నత్తగుల్లల శిలాజాలను గుర్తించారు. ‘పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్ (ప్రిహా)’ప్రధాన కార్యదర్శి ఎంఏ శ్రీనివాసన్, ఫారెస్టు రేంజ్ అధికారి, ప్రిహా సభ్యుడు టి.ప్రణయ్, సిబ్బంది తాజాగా వీటిని గుర్తించారు. గతం లో ఈ ప్రాంతంలో మంచినీటి సరస్సు ఉండేదని, భూమి పొరల నుంచి లావా ఉబికి ఆ సరస్సు ప్రాం తాన్ని కమ్మివేయటంతో అందులోని జీవరాశులు ఇలా శిలాజాలుగా మారి ఉంటాయని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల తర్వాత.. సంగారెడ్డి జిల్లా తేర్పోల్ శివారులో 30 ఏళ్ల కిందట జియాలజిస్టు అయ్యస్వామి పరిశోధించి ఈ తరహా నత్త శిలాజాలను గుర్తించారు. దీంతో వాటిని ఆ గ్రామం పేరుతో ‘పైజా తిర్పోలెన్సిస్’ అని నామకరణం చేశారు. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన నత్త శిలాజాలు కూడా అదే ప్రజాతికి చెందినవని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావు నిర్ధారించినట్టు శ్రీనివాసన్ తెలిపారు. ఈ 3దశాబ్దాల కాలంలో ఇప్పటివరకు స్థానికంగా మరెక్కడా నత్త శిలాజాలు వెలుగు చూడలేదని పేర్కొన్నారు. అప్పుడు ఎడమ.. ఇప్పుడు కుడి.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నత్తగుళ్లలు కుడివైపు తెరుచుకుని కన్పిస్తుంటాయి. అరుదుగా మాత్రమే ఎడమవైపు తెరుచుకుంటాయి. ఈ శిలాజాల్లో మాత్రం ఎడమవైపు తెరుచుకుని ఉన్నాయి. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో నత్త శిలాజాలుండటం విశేషం. ఒకే రాతి ముక్కలో 18 నత్తగుళ్లలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగా ఇది సరస్సు ఉండే ప్రాంతమే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల ఇదే ప్రాంతంలో పొడవైన సున్నపురాతి గుహలను కూడా గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో ఇక్కడ పరిశోధనలు చేసి ఎన్నో శిలాజాలను గుర్తించింది. వెరసి ఈ ప్రాంతాన్ని ఫాజిల్(శిలాజ) పార్కుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, దీనివల్ల శిలాజాల చరిత్రను భావితరాలు తెలుసుకునేందుకు అవకా శం చిక్కుతుందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి శాంతారం, ఎస్డీవో దినేశ్ ప్రోత్సాహంతో ఈ శిలాజాలను గుర్తించినట్టు అటవీ శాఖ అధికారి ప్రణయ్ పేర్కొన్నారు. -
1200 ఏళ్ల నాటి వస్తువులు.. ఎలా ఉన్నాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మనిషి మొదటి మిత్రుడు రాయే. రక్షణకు ఆయుధం అదే. రోజువారీ జీవనంలో పనిముట్టూ అదే.. నివాసమూ అదే. చనిపోయిన తర్వాత శాశ్వత ఆవాసం వాటి మధ్యే. రామప్ప లాంటి విశ్వ విఖ్యాత దేవాలయ నిర్మాణం అంతా రాతితోనే జరిగింది. కానీ ఆ రాళ్ల నిండా కళాత్మకత ఉట్టిపడుతుంది. కానీ ఎలాంటి నగిషీలు లేకుండా రాళ్లను వాడిన తీరు మాత్రం చాలా అబ్బుర పరుస్తుంది. అలాంటి అలనాటి గుర్తులు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఇటీవల మర్కూక్ మండలం దామరకుంట ప్రాంతంలో కొత్త తెలంగాణ బృందం ప్రతినిధులు శ్రీరామోజు హరగోపాల్, అహోబిలం కరుణాకర్, చంటి, నసీర్, కొలిపాలక శ్రీనివాస్, ఔత్సాహిక పరిశోధకులు కందుల వెంకటేశ్‌లు సందర్శించినప్పుడు అలనాటి చారిత్రక అవశేషాలు ఎన్నో వెలుగు చూశాయి. రాతియుగం నాటి గుర్తులు, తదుపరి నిర్మాణాలు, వివిధ రాజవంశాల హయాంలో నిర్మితమైన శిథిల దేవాలయాలు కనిపించాయి. వాటిల్లో రెండు గుర్తులు ప్రత్యేకంగా నిలిచాయి. నూనెకు ఇదే సాధనం.. ఇటీవల కాలంలో గానుగ నూనెలకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. దీంతో యాంత్రిక గానుగలు విరివిగా వెలుస్తున్నాయి. కానీ వందల ఏళ్లనాడు గానుగలు కూడా రాతివే ఉండేవి. అందులో ఓ గానుగ దామరకుంట శివారు పొలాల్లో కూరుకుపోయి ఉంది. అప్పట్లో ధనవంతుల ఇళ్లలో సొంత అవసరాలకు నూనె తీసేందుకు ఉండేవి. దేవాలయాల్లో నూనె అవసరం బాగా ఉండటంతో అక్కడ ఉండేవి. దీని పైభాగంలో వేరుశనగ, కుసుమ, నువ్వుల నూనె లాంటి వాటిని వేసి రుబ్బురోలు లాంటి దాన్ని ఏర్పాటు చేసి దానికి ఎద్దును కట్టి తిప్పే వారు. నలిగిన గింజల నుంచి నూనె కారి వెలుపలికి వచ్చేది. ఇక ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలు వాటిపై ఆధారపడి ఉండేవి. క్రమంగా ఆ పేరుతో ఓ కులమే ఏర్పాటైంది. వారే నూనె తీసి అమ్మేవారు. కొన్ని రాజుల కాలాల్లో గానుగపై నూనె తయారీకి సుంకం కూడా విధించినట్లు చారిత్రక ఆధారాలు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లాలో వెలుగు చూసిన ఓ శాసనంలో గానుగ నిర్వహించే వారు చెల్లించాల్సిన సుంకం వివరాలు వెలుగుచూశాయి. ఇలాంటి వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. వెయ్యేళ్లు దాటినా నిలిచే.. రాష్ట్రకూటుల హయాంలో జైన బసదులు నిర్మితమయ్యాయి. జైన ఆరాధకులు తపస్సు చేసేందుకు ఎలాంటి ఆడంబరం, అలంకరణ లేకుండా చిన్నచిన్న గుదులు నిర్మించుకునేవారు. ముఖ్యంగా జైన దిగంబరులు వాటిని ఆశ్రయించేవారు. దామరకుంటలో పరుపు బండపై ఉన్న రాతి గూళ్లు అలాంటివే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. పెద్ద పెద్ద రాతి సల్పలను ఒకదానికొకటి ఆధారంగా ఉండేలా ఇంటర్ లాకింగ్ విధానంతో నిలిపి ఉంచేవారు. పునాదులు, అనుసంధాన మిశ్రమాలు లేకుండా అనామతుగా నిలిపి చిన్న గూళ్లులాగా చేసిన నిర్మాణాలు 1200 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ నిలిచే ఉండటం విశేషం. ఆ తర్వాత ఇవి శివాలయాలుగా మారినట్టు పేర్కొంటున్నారు. శైవమతాచార్యుల సమాధులపై నిలిపే లింగ శిలలు వాటి పక్కనే ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. వాటిపై ఎలాంటి అలంకరణ, ఆడంబర గుర్తులుండవు. సిద్దిపేట పరిసర గ్రామాల్లో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఇలాంటి నిర్మాణాలను తొలగించి స్థానికులు రాళ్లను ఇతర అవసరాలకు తీసుకెళ్లిపోతున్నారు. ఫలితంగా ఇలాంటి అతిపురాతన నిర్మాణాలు క్రమంగా మాయమవుతున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. -
తెలుంగాణపురం ఎక్కడుందో తెలుసా?
త్రిలింగ దేశం.. ఆ తర్వాత తిలింగరాజ్యం.. కొందరు మహమ్మదీయ రాజులు తిలింగ్, తెలింగ అని.. మరికొందరు విదేశీయులు ట్రిలింగాన్ అని.. వేర్వేరు సామ్రాజ్యాలు, కాలాల్లో ఇలా రకరకాల పేర్లతో సంబోధించారు. ఆ ప్రాంతమే ప్రస్తుత తెలంగాణ. మరి మొదటిసారి తెలంగాణ అన్న పదాన్ని ఎవరు, ఎప్పుడు వాడారో తెలుసా? ఇప్పుడు దానికి సంబంధించిన శాసనమే ఆసక్తి రేపుతోంది. ఆరు శతాబ్దాల క్రితం వేయించిన ఆ శాసనం ఇరుకు సందులో ఇళ్ల మధ్య బందీ అయిపోయింది. దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయింది. కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు రికార్డు చేసినా, అది కొంతమందికే పరిమితమైంది. దేశంలో 29వ రాష్ట్రం (కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారకముందు)గా ఆవిర్భవించిన తెలంగాణ పేరును తొలిసారి లిఖితపూర్వకంగా వాడింది ఈ శాసనంలోనే. అంటే ‘తెలంగాణ’అస్తిత్వానికి తొలి నిదర్శనం అన్నమాట. - సాక్షి, హైదరాబాద్ ‘తెలుంగాణపురం’ఎక్కడుంది? ఈ ప్రశ్నకు...‘అది మన రాష్ట్రం పేరు, ఆ పేరుతో ఊరు కూడా ఉందా?’అన్న ఎదురు ప్రశ్నే సమాధానంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఓ ఊరు కూడా ఉండేది.. అది ఎక్కడో కాదు... భాగ్యనగర శివార్లలోనే. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పురోగతికి ఇప్పుడు చిరునామాగా కనిపిస్తున్న తెల్లాపూరే... ఒకప్పటి తెలుంగాణపురం. కాలక్రమంలో తెలుంగాణపు రం కాస్తా క్రమంగా తెల్లాపూర్‌గా మారిపోయింది. తెలంగాణ అన్న పదం ఉన్న తొలి తెలుగు శాసనం వెలుగుచూసింది ఈ గ్రామంలోనే. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది. 604 ఏళ్ల కిందట.. బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1417లో విజయనగర రాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న పానగల్లు కోట మీద దాడికి బయలుదేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం ఆ సైన్యం పనిగా పెట్టుకుంది. ఈ క్రమంలో పలు మందిరాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో తెల్లాపూర్ కూడా ప్రణాళికాబద్ధంగా ఎదిగిన పట్టణం. తెలుంగాణ పురమన్న పేరుతో అభివృద్ధి చెందిన ప్రాంతం. కొందరు విశ్వకర్మలు ఈ ప్రాంతంలో మంచి పనిమంతులైన శిల్పులుగా పేరుపొంది ఉన్నారు. వారు నగల తయారీలోనే కాకుండా, నగర ప్రణాళికల రూపకల్పనలోనూ నేర్పు ఉన్నవారు. అందులో కొండమీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లబోజు తదితరులు ఇక్కడ పెద్ద మామాడి తోటను నిర్వహించేవారు. దానికి నీటి కోసం విశాలమైన దిగుడు బావి తవ్వించి ఏతాం పద్ధతిలో నీటి సాగుకు వాడేవారు. పానగల్లు కోటపై దాడి కోసం ఫిరోజ్ షా ఇదే మార్గంలో వెళ్లనున్నారని తెలిసి, వారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండలు దిద్దిన కంఠాభరణం, బంగారు గాజులు అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఆ మల్లోజు వంశస్తులు ప్రశస్తి శాసనం చెక్కి దిగుడుబావి పైన ఏతాం కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభాల మధ్య ఏర్పాటు చేయించారు. అదే ఈ శాసనం. అందులో ఈ ప్రాంతాన్ని తెలుంగాణపురంగా పేర్కొన్నారు. ఆ శాసనంపై తెలుగులో24 పంక్తుల వివరాలున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా పురావస్తు శాఖలో స్తపతి ఈమని శివనాగిరెడ్డి ఈ శాసనాన్ని 2008లో పరిశీలించారు. అప్పటికే బావిని సింహభాగం పూడ్చేశారు. కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పైగా గిరక కోసం ఏర్పాటు చేసిన రెండు రాతి శిలలు పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఆయన వాటిని క్రమపద్ధతిలో పూర్వపు స్థితిలో తిరిగి ఏర్పాటు చేయించారు. ఆ శిలల దిగువన కాకతీయ శైలిలో కళాత్మకంగా చెక్కిన భారీ రాతి బేస్ ఉంది. ఆ తర్వాత మొత్తం బావిని స్థానికులు పూడ్చేశారు. ఇప్పుడు దాని చుట్టూ ఇళ్లు వెలియటంతో పూర్తి ఇరుకు స్థలంలో ఆ శాసనం బందీగా ఉండిపోయింది. అప్పట్లోనే శివనాగిరెడ్డి... నేతలను తీసుకెళ్లి దీన్ని చూపించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి ‘తెలంగాణ అన్న పేరును వాడిన తొలి శాసనానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంత పెద్ద ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో.. రాష్ట్రం పేరును తొలిసారి వాడిన శాసనంగా దానికి అందలం దక్కాల్సి ఉంది. -శివనాగిరెడ్డి, చరిత్రకారులు -
మల్లన్న సన్నిధిలో బంగారు, వెండి నాణేలు
సాక్షి, శ్రీశైలం : శ్రీశైల మల్లన్న సన్నధిలో మరోసారి బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. ఘంటామఠం పునర్నిర్మాణం పనుల్లో మఠంలోని నీటిగుండం వద్ద ఆదివారం ఈ నాణేలు లభ్యమయ్యాయి. లభ్యమైన వాటిలో 15 బంగారు నాణాలు, 18 వెండి నాణాలు, ఓ బంగారు రింగ్ ఉంది. అయితే బయటపడ్డ ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటికి చెందినవి ఉన్నాయి. కాగా సెప్టెంబర్ 15న ఇదే తరహాలో శ్రీశైలం ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. వీటిలో శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా.. మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించినట్టుగా బయటపడింది. 97 వెండి నాణేలు విడిగా లభించగా.. 148 నాణేలు ఇత్తడి పాత్రలో లభ్యమయ్యాయి.(చదవండి : శ్రీశైలం గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు) -
హరప్పా సమాధుల్లో చరిత్ర
అతి ప్రాచీనమైన సింధు నాగరికతలో అత్యంత ముఖ్యపట్టణం రాఖీఘరీ. ప్రస్తుతం మన దేశంలోని హరియాణా రాష్ట్రంలో ఉంది. 4,500 ఏళ్ల క్రితం ఆ పట్టణ శివార్లలోని ఒక పురుషుడు, ఒక మహిళని ఉమ్మడిగా సమాధి చేశారు. ఇçప్పుడు ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి అస్తిపంజరాలు భారతదేశం, దక్షిణ కొరియాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. 2016వ సంవత్సరం లోనే ఆ అస్థి పంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి హరప్పా కాలం నాటి పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటి వివరాలను ఒక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘ఒక పురుషుడు, మహిళకు చెందిన ఆ అస్థిపంజరాలు ఒకరికొకరు అభిముఖంగా, అత్యంత సన్నిహితంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయి ఉంటారు. ఒకేసారి వారిద్దరూ మరణించారు. అతని వయసు దాదాపుగా 35 ఏళ్లు ఉంటే, ఆమె వయసు 25 ఉంటుంది. ఇద్దరూ మంచి పొడగరులు. అతను 5 అడుగుల 8 అంగుళాలు ఉంటే, ఆమె 5 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది. వాళ్లు మరణించే సమయంలో ఆరోగ్యకరంగానే ఉన్నారు. వారి ఎముకల్ని పరీక్షించి చూశాం. ఎవరూ వారిని హత్య చెయ్యలేదు. బ్రెయిన్ ఫీవర్ వంటి అనారోగ్యాలు కూడా వారికి లేవు. మరి వారి మరణానికి కారణమేమై ఉంటుందో ఇంకా అంతు పట్టడం లేదు‘ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త , పుణేలోని డెక్కన్ కాలేజీకి చెందిన వసంత్ షిండే వెల్లడించారు. ఇలా జంటగా అస్తిపంజరాలు బయటపడడం అరుదైన విషయమని, దీనిని బట్టి భారతీయ వివాహ వ్యవస్థ అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇదే మొదటిది కాదు హరప్పాలో ఇలా జంటగా పాతిపెట్టిన సమాధులు బయటపడడం ఇది తొలిసారేం కాదు. 1950లో గుజరాత్‌లోని లోథల్‌లో కూడా ఇలాంటి సమాధి బయటపడింది. అందులో మహిళ అస్థిపంజరం తలపై గాయాలు కనిపించాయి. భర్తని ఎవరో చంపేస్తే, దానిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చారు. రఖీఘరీలో ఇప్పటికే పురావస్తు శాస్త్రవేత్తలు 70 సమాధుల్ని గుర్తించారు. వాటిలో 40ని తవ్వి వాటిల్లో దాగి ఉన్న రహస్యాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఇలా జంట అస్తిపంజరాలు బయల్పడడం మాత్రం ఉత్సుకతనే నింపింది. హరప్పాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్నో సమాధుల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు ఉమ్మడిగా దర్శనమిచ్చాయి. ఇటలీ, రష్యా వంటిదేశాల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు అత్యంత సన్నిహితంగా, చేతిలో చెయ్యి వేసుకున్నట్టు కనిపించింది. ఇక గ్రీస్‌లో 6 వేల ఏళ్ల క్రితం నాటి జంట అస్థిపంజరాలు ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా కౌగిలించుకొని కనిపించాయి. సమాధుల్లో సంగతులెన్నో హరప్పా, మొహంజదారో సమాధుల్లో ఎక్కడా ఆడంబరాలు కనిపించవు. పశ్చిమాసియా రాజుల మాదిరిగా అంత్యక్రియలు వాళ్లు ఆడంబరంగా జరుపుకోరు అని ఎర్లీ ఇండియన్స్, ది స్టోరీ ఆఫ్ అవర్ ఏన్సెస్టర్స్ అండ్ వేర్ వి కేమ్ ఫ్రమ్ పుస్తక రచయిత టోని జోసెఫ్ అభిప్రాయపడ్డారు. మోసొపొటేమియా నాగరికత కాలం నాటి సమాధుల్లో అత్యంత విలువైన నగలు, కళాఖండాలు దర్శనమిస్తాయి. విశేషమేమిటంటే హరప్పా నుంచి ఎగుమతి అయిన అత్యంత విలువైన నవరత్నాలు, నీలాలు, గోమేధికాలతో తయారు చేసిన నగలతోనే అప్పట్లో రాజుల్ని పూడ్చి పెట్టేవారని చరిత్రకారుల అంచనా. అదే హరప్పా సమాధుల్లో ఆహారంతో నింపిన కుండలు, కొన్ని పూసల నగలు కనిపిస్తాయి. మరణించిన వారికి పునర్జన్మ ఉంటుందన్న నమ్మకంతో అప్పట్లో ఆహారంతో నింపిన కుండలు సమాధుల్లో ఉంచేవారని చరిత్రకారుల అభిప్రాయం. -
పరడ ‘బుద్ధుడి’పై క్వారీ పడగ!
సాక్షి, హైదరాబాద్: అదో పెద్ద గుట్ట.. దానిపై మూడో శతాబ్దం నాటి వృత్తాకార నిర్మాణం... మట్టిదిబ్బలో కూరు కుపోయి కొన్ని ఇటుకలు కనిపిస్తున్నాయి. వాననీటి ప్రవా హానికి కొట్టుకుపోకుండా దానికి ఆధారంగా గుట్ట అంచున రాతి నిర్మాణం.. వాటి దిగువన ముచుళింద శిల్పం... ఇవన్నీ బౌద్ధ స్తూప ఆనవాళ్లు. ఈ గుట్టపై ఉన్న నిర్మాణాలూ ఇది బౌద్ధస్తూపమనే దానిని రూఢీ చేస్తున్నా యి. అదే నిజమైతే... రాష్ట్రంలో బౌద్ధం జాడలున్నాయనే వాదన మరింత బలోపేతమవుతుంది. ప్రపంచానికి బౌద్ధాన్ని పరిచయం చేసేందుకు ప్రచారం చేసిన బావరి రాష్ట్రానికి చెందినవాడేనని ఇప్పటికే ఆధారాలు వెలుగు చూడటం, విదేశీ బౌద్ధ సన్యాసులనూ అబ్బురపరిచే స్తూపాలు, చైత్యాల జాడలిక్కడ ఉండటం ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు దోహదం చేస్తున్నాయి. అంతటి ప్రాధాన్యమున్న ఈ ప్రాంతం కొద్ది రోజుల్లో కాలగర్భంలో కలిసిపోబోతోంది. ఆ నిర్మాణం బౌద్ధ స్తూపమా.. కాదా.. అన్నది వెలుగు చూడకుండానే అదృశ్యం కాబోతోంది. క్వారీ పనులతో గుట్టను గుటుక్కుమనేందుకు కొందరు శరవేగంగా ముందుకు కదులుతుండటమే దానికి కారణం. చరిత్ర బృందం పరిశోధన...: నల్లగొండ జిల్లా కట్టం గూరు మండలం పరడ గ్రామ శివారులో ఓ గుట్ట ఉంది. దానిపైన పురాతన శివుడి గుడి ఉండటంతో దాన్ని శివుని గుట్ట అని పిలుస్తారు. ఆలయానికి ఉత్తరాన మట్టి దిబ్బ ఉంది. దాన్ని ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళి, రాంప్రసాద్, చంటి çపరిశీలించారు. దిబ్బలో 25 అడుగుల వ్యాసంతో వృత్తా కార నిర్మాణం ఉన్నట్టు గుర్తించారు. దానికి వాడిన భారీ ఇటుకలను పరిశీలిస్తే అవి 2, 3 శతాబ్దాలకు చెందినవిగా తెలుస్తోంది. అంటే శాతవాహనుల కాలంనాటి నిర్మాణాలని ప్రాథమికంగా రూఢీ అయింది. అక్కడే 8 అంగుళాల ఎత్తున నాగ ముచుళింద శిల్పం కనిపించింది. దానిపై స్వస్తిశ్రీ మనుమధ నామ సంవత్సర... అన్న పొడి అక్షరా లున్నాయి. వెరసి ఇది బౌద్ధ స్తూపాన్ని పోలినట్టు స్పష్టమ వుతోంది. బుద్ధుడికి జ్ఞానోదయమైన సమయంలో ఎడతె రిపి లేకుండా 7 రోజులు భారీ వర్షాలు కురిస్తే నాగరాజైన ముచుళిందుడు పాతాళం నుంచి వచ్చి తన పడగ నీడతో రక్షణ కల్పించాడని పురాణగాథ. అందుకే బౌద్ధ స్తూపాలు న్న చోట నాగ ముచుళింద విగ్రహాలు కనిపిస్తాయి. చుట్టూ చెట్లు, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. దిబ్బను తవ్వితే లోపలి నిర్మాణంపై స్పష్టత వస్తుంది. కానీ, ఇప్పటికీ పురావస్తు శాఖ ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఈలోపు కొందరు దాన్ని క్వారీగా మార్చి గుట్టను పిండి చేయటం మొదలు పెట్టారు. ఇప్పటికే కొంతవరకు అది నాశనమైంది. మిగతాది అదృశ్యం కాకుండా ప్రభుత్వం కాపాడాలంటూ స్థానికులు ఇప్పటికే కలెక్టర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. పురావస్తు శాఖ స్పందించి దానిపై స్పష్టతనిచ్చి పరిరక్షించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. -
ఆదిమానవుల సమాధుల పరిశీలన
మునుగోడు: మండలంలోని వివిధ గ్రామాల్లో బయల్పడిన ఆదిమానవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు పురావస్తుశాస్త్ర వేత్తలతో పరిశీలింపచేస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఇప్పర్తి గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆదిమానవుల సమాధులు, ఎముకలను పరిశీలించారు. ఒక్కొకరికి దాదాపు పదిగుంటల భూమిలో సమాధి కట్టడాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, చీకటిమామిడి, గుండ్లోరిగూడెం గ్రామాల్లో ఆదిమానవులు నివాసం ఉండేవారని, తనకు పెద్దలు చెప్పారన్నారు. త్వరలో పరిశీలింపచేసి అందులో లభించిన వస్తువులను మ్యూజియంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. -
ఆ నాణేలు విజయనగరాధీశులవే..!
‘ఉప్పరపల్లి’ బంగారు నాణేలపై పురావస్తుశాఖ అధికారుల నిర్ధారణ అనంతపురం కల్చరల్: అనంతపురం జిల్లా ఉప్పరపల్లి గ్రామంలో ఇటీవల బయటపడిన బంగారు నాణేలు విజయనగర రాజుల కాలం నాటివని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. 16వ శతాబ్దానికి చెందిన అరవీడు వంశస్తులు ఈ తరహా నాణేలు వాడారని తెలిపారు. ప్రధానంగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన అరవీటి వంశస్తుడైన మూడో శ్రీరంగరాయల కాలంలో ఈ తరహా నాణేలు అధికంగా వాడకంలో ఉన్నాయని చారిత్రక ఆధారాలతో చెప్తున్నారు. -
కొనసాగుతున్న పురావస్తు తవ్వకాలు
మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల మండలం ఉర్లోవకొండ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన పురావస్తు తవ్వకాలు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. పది మంది సభ్యుల బృందం ఈ తవ్వకాలలో పాలుపంచుకుంటోంది. ఎందుకోసం ఈ తవ్వకాలన్న విషయమై సమాచారం బయటకు రాలేదు. ఖనిజాల కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.