ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, శ్రీశైలం : శ్రీశైల మల్లన్న సన్నధిలో మరోసారి బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. ఘంటామఠం పునర్నిర్మాణం పనుల్లో మఠంలోని నీటిగుండం వద్ద ఆదివారం ఈ నాణేలు లభ్యమయ్యాయి. లభ్యమైన వాటిలో 15 బంగారు నాణాలు, 18 వెండి నాణాలు, ఓ బంగారు రింగ్ ఉంది. అయితే బయటపడ్డ ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటికి చెందినవి ఉన్నాయి. కాగా సెప్టెంబర్ 15న ఇదే తరహాలో శ్రీశైలం ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. వీటిలో శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా.. మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించినట్టుగా బయటపడింది. 97 వెండి నాణేలు విడిగా లభించగా.. 148 నాణేలు ఇత్తడి పాత్రలో లభ్యమయ్యాయి.(చదవండి : శ్రీశైలం గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు)
Comments
Please login to add a commentAdd a comment