Ancient coins
-
మన తీరం.. విదేశీ బంధం..
సాక్షి, హైదరాబాద్: నెల్లూరులోని కొత్తపట్నం.. ప్రస్తుతం చేపలు పట్టేవారితో కూడిన ఓ చిన్న గ్రామం. కానీ ఒకప్పుడు ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించిన నౌకాశ్రయం. ఇటీవలే పరిశోధకులు దీని గుట్టు తేల్చారు. క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 16వ శతాబ్దం వరకు భారీ విదేశీ నౌకల లంగరుతో ఈ పోర్టు బిజీగా ఉండేదని గుర్తించారు. ఎన్నో దేశాలతో భారతదేశానికి ఉన్న వాణిజ్యంలో ఈ నౌకాశ్రయం కీలకంగా వ్యవహరించేదని చెబుతున్నారు. అయితే ప్రకృతి విపత్తులు, భౌగోళిక మార్పులతో ఇది నామరూపాల్లేకుండా పోయింది. ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించిన పరిశోధకుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కె.పుల్లారావు ఒకరు. ఇప్పుడు ఆయన మరోసారి ఈ పోర్టుకు సంబంధించిన కీలక విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు సమాయత్తం అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తీరం వెంట సముద్రమార్గం ద్వారా జరిగిన విదేశీ వాణిజ్యం, ఆయా దేశాలతో సంబంధాలు, సాంస్కృతిక మైత్రీ తదితర అంశాలపై ఆయన ఆధ్వర్యంలోని బృందం విస్తృత పరిశోధనలు చేయబోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ బృహత్తర పరిశోధన శనివారం నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ చొరవతో.. భారతదేశం తన సువిశాల సముద్ర తీరంతో అనాదిగా ప్రపంచదేశాలతో వాణిజ్యం నిర్వహిస్తోంది. వేల ఏళ్లుగా సాగిన ఈ వాణిజ్యంతో ఆర్థికపరంగానే కాకుండా, సాంస్కృతికంగా కూడా ఆయా దేశాలతో మైత్రి ఏర్పడింది. ఇక్కడి కొన్ని సాంస్కృతిక అంశాలను ఆయా దేశాలు తమలో కలుపుకోగా, విదేశీ సంప్రదాయాలు కొన్ని మనలో మమేకమయ్యాయి. క్రీస్తు పూర్వం నుంచి ఈ మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. అలాంటి ప్రత్యేకతలను వెలికి తీయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘ప్రాజెక్టు మౌసమ్’పేరుతో బృహత్తర పరిశోధన ప్రారంభించింది. ఇది కొత్తపట్నంలో అంతరించిన పోర్టు వద్ద లభించిన 14వ శతాబ్దం నాటి చైనా మింగ్ వంశం చక్రవర్తి టైజాంగ్ జారీ చేసిన నాణెం కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. భారత్‌తో సముద్రతీరాన్ని పంచుకుంటున్న 39 దేశాలతో తిరిగి వాణిజ్య, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంతో పాటు, ఆయా దేశాల ఆర్థిక సాంస్కృతిక వైవిధ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మైత్రీ పటిష్టం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా తీరం వెంట ఉన్న చారిత్రక, పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతాలు, అలనాటి నౌకాశ్రయాలున్న చోట పరిశోధనలు జరుపుతారు. గతంలో జరిగిన పరిశోధనల్లో వెలుగు చూసిన అంశాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇతర దేశాల తీర ప్రాంతాలకు వెళ్లి, అక్కడ వెలుగు చూసిన ఈ తరహా పరిశోధన వివరాలపై అధ్యయనం చేస్తారు. అలా మన దేశంలో తీర ప్రాంతమున్న రాష్ట్రాలకు ప్రత్యేక నిపుణులను కేటాయించారు. తమిళనాడు, కేరళ, ఒడిశా, బెంగాల్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పరిశోధన మొదలుకానుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలో శనివారం నుంచి నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో ఈ అన్వేషణ ప్రారంభం కానుంది. 70 అంశాలను పరిశీలిస్తాం కె.పుల్లారావు ‘క్రీస్తు పూర్వం నుంచి మనదేశం ఇతర దేశాలతో సముద్ర వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక మైత్రి నెరుపు తోంది. దాన్ని ఇప్పుడు బలోపేతం చేయాలన్నది కేంద్రం ఆలోచన. అందుకే ప్రాజెక్టు మౌసమ్లో మేం 70 రకాల అంశాలను పరిశీలిస్తాం. తొలి విడత పరిశోధన నెల్లూరు జిల్లా కొత్తపట్నం పురాతన పోర్టు ఉన్న ప్రాంతంలో మొదలవుతుంది. చారిత్రక, మానవ మనుగడ, ఆర్థిక పరిస్థితులే కాకుండా వృక్ష, జంతు జీవ వైవిధ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ -
ఈ రూ. 2 నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చా?
బెంగళూరు: నాణేల వాడకం రెండు వేల సంవత్సరాల క్రితం మొదలైనట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాల క్రమేణా కొన్ని కనుమరుగైపోయాయి. అయితే పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని వూరికే చెప్పలేదు. 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన 2 రూపాయల నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చు. అరుదైన నాణేలను సేకరించే అలవాటు ఉంటే.. రూ .5 లక్షలు సంపాదించవచ్చు. బెంగళూరుకు చెందిన క్విక్కర్ వెబ్సైట్లో చాలా మంది కొనుగోలుదారులు ఈ పాత, అరుదైన నాణానికి భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . పాత ఫీచర్లతో రూ .10 నోటు అంతేకాకుండా పాత ఫీచర్లతో ఉన్న రూ .10 నోట్ ఆన్లైన్లో కాయిన్‌బజార్ ప్లాట్ఫామ్లో అమ్మవచ్చు. ఈ అరుదైన పాత నోట్లు, నాణేల కోసం కొనుగోలుదారులు వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు వినికిడి. అయితే నోటులో ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉండాలి. ఈ నోట్‌ను 1943 సంవత్సరంలో జారీ చేసి ఉండాలి. ఇక ఈ నోట్లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. ఇది కాకుండా, 10 రూపాయలు అని ఆంగ్ల భాషలో నోట్ రెండు చివర్లలో.. వెనుక వైపు రాసి ఉండాలి. చదవండి: US: కొవాగ్జిన్ తీసుకున్నారా.. మా దేశం రావచ్చు! -
మల్లన్న సన్నిధిలో బంగారు, వెండి నాణేలు
సాక్షి, శ్రీశైలం : శ్రీశైల మల్లన్న సన్నధిలో మరోసారి బంగారు, వెండి నాణాలు బయటపడ్డాయి. ఘంటామఠం పునర్నిర్మాణం పనుల్లో మఠంలోని నీటిగుండం వద్ద ఆదివారం ఈ నాణేలు లభ్యమయ్యాయి. లభ్యమైన వాటిలో 15 బంగారు నాణాలు, 18 వెండి నాణాలు, ఓ బంగారు రింగ్ ఉంది. అయితే బయటపడ్డ ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటికి చెందినవి ఉన్నాయి. కాగా సెప్టెంబర్ 15న ఇదే తరహాలో శ్రీశైలం ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. వీటిలో శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా.. మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించినట్టుగా బయటపడింది. 97 వెండి నాణేలు విడిగా లభించగా.. 148 నాణేలు ఇత్తడి పాత్రలో లభ్యమయ్యాయి.(చదవండి : శ్రీశైలం గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు) -
గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు
శ్రీశైలం: శ్రీశైలంలోని ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు, ఒక రాగి నాణెం, 3 తామ్ర శాసనాలు (రాగి రేకులు) లభించాయి. ఉప స్థపతి జవహర్ మంగళవారం వీటిని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. ఆలయ ఈవో కేఎస్.రామారావు వాటిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ..5 ఇన్ టూ 9 అంగుళాల సైజులో ఉన్న రాగి రేకులపై నాగరి, కన్నడ లిపితో చెక్కిన శాసనాలు ఉన్నాయన్నారు. శివలింగం, నంది చిత్రీకరించిన రాగి రేకుపై ఒక రాజు శివలింగానికి నమస్కరిస్తున్నట్లుగా ఉందని, మరో రేకుపై గోవును కూడా చిత్రీకరించారని చెప్పారు. 97 వెండి నాణేలు విడిగా లభించాయని, 148 నాణేలు ఇత్తడి పాత్రలో ఉన్నాయని తెలిపారు. ఇవి 1800–1910 మధ్య తయారైనవిగా భావిస్తున్నట్లు చెప్పారు. వీటి పరిశీలనకు శ్రీశైలంలోని పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ అధ్యయన కేంద్రం సంస్కృతి, పురావస్తు విభాగం ఆచార్యులను పిలిపించామని, పురావస్తు కార్యాలయానికి కూడా సమాచారమిచ్చామని చెప్పారు. కాగా, ఇదే ప్రాంతంలో ఈ నెల 7, 8 తేదీలలో 29 తామ్ర శాసనాలు లభించాయి. (చదవండి: సింహం ప్రతిమలు మాయం, విచారణకు కమిటీ) -
బయటపడ్డ పురాతన నాణేలు
దహెగాం (సిర్పూర్) : ఓ పాత ఇంటిని కూల్చివేస్తుండగా పురాతన నాణేల కుండలు బయటపడ్డాయి. కుమురం భీం జిల్లా దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన జునగరి గంగ మ్మ ఇంటిని అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు వెల్ములే సురేశ్, రమేశ్ కొనుగోలు చేశారు. ఇల్లును కూల్చి కొత్తగా నిర్మించాలనుకున్నారు. ఈ క్రమంలో పాత ఇంటిని కూల్చివేస్తుండగా గోడలో ఉన్న పురాతన నాణేల కుండలు పగిలి బయటపడ్డాయి. రాగి, వెండి, ఇత్తడివి కలిపి మొత్తం 1365 నాణేలు లభ్యమయ్యాయి. వీటిపై 1862, 1885, 1899, 1907 సంవత్సరాలు ముద్రించి ఉన్నాయి. ఈ నాణేలపై బ్రిటిష్ చక్రవర్తి విక్టోరియా మహారాణి, చార్మినార్, హెడ్వట్ సెవెన్ పేర్లు ఉన్నాయి. నాణేలను పెంచికల్పేట్ తహసీల్దార్ రియాజ్ అలీ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. ఇంకేమైనా నాణేలు లభించాయా? అనే అనుమానంతో పోలీసులు.. సురేశ్, రమేశ్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. -
పురాతన నాణేల విక్రయ ముఠా అరెస్ట్
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణదా గ్రామ సమీపంలో పురాతన నాణేల సేకరణ, విక్రయ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న ఎల్విన్ పేట పోలీసులు.. వారి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కలెక్షన్ కింగ్
పైసా మే పరమాత్మ హై అని ఎవరైనా అంటే.. అదేమో గానీ తన ఆత్మ మాత్రం వాటి చుట్టూనే తిరుగుతుంటుంది అంటారాయన. అయితే అయనకు డబ్బుపై ఆశ కాదు... అభిరుచి. నాణేల నుంచి కరెన్సీ నోట్ల దాకా సేకరించే సరదా. ‘మనకున్న అలవాట్లే మనల్ని మంచి అభిరుచులకు చేరువ చేస్తాయి. బహుశా ఆ హాబీనే నన్ను బ్యాంక్ ఉద్యోగం ఎంచుకునేలా చేసి ఉంటుంద’ని అంటున్నారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమల్ చక్రవర్తి. పురాతన నాణేల నుంచి నయా కరెన్సీ నోట్ల వరకు ఇలా ప్రతి ఒక్కటీ సేకరించిన ఆయన.. అన్న ఇచ్చిన తొలి పూర్వపు నాణేమే ఈ రోజు భారీ కలెక్షన్ చేసే దిశగా నడిపించిందని చెప్పారు. ‘ఆ తర్వాత మిత్రులు, కొంత మంది స్క్రాప్ వ్యాపారుల నుంచి విభిన్న నాణేలు సేకరించాను. ఇదే క్రమంలో నాకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బద్వాణీలో ఎస్బీఐ బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాను. హెచ్‌సీయూ సమీపంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ డెవలప్మెంట్లో ఫ్యాకల్టీగా చేస్తున్నా. ఆర్బీఐ విడుదల చేసే స్మారక నాణేలు కూడా భద్రంగా దాచిపెడుతున్నాన’ని వివరించారు చక్రవర్తి. ది బెస్ట్.. ‘హరప్పా, మొహంజోదారా, కుషాణ్, మొఘల్ కాలాల నాటి ఆకర్షణీయమైన నాణేలు... ది వరల్డ్ ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ బ్యాంక్ నోట్లు... ఇలా 85 దేశాలకు చెందిన నోట్లు, నాణేలు సేకరించారు చక్రవర్తి. 300 బీసీకి చెందిన అలెగ్జాండర్, నెపోలియన్ కాయిన్స్, బెనిన్ రిపబ్లిక్, నిజాం, తంజావూరుకు చెందిన రూ.1000 నాణేం, ఆస్ట్రేలియాకు చెందిన పెంగో నోట్, యుగోస్లోవియాకు చెందిన ఐదు ట్రిలియన్ల నోట్, పది మిలియన్ల జపనీస్ నరోట్, జార్జ్ 6 కింగ్ కాయిన్, బంగ్లాదేశ్‌కు చెందిన 60 టకల నోట్లు చూసి చాలా మంది ఆయనను అభినందిస్తున్నారు. వీటి సంఖ్య వేలల్లోనే ఉంటుందంటున్నారు చక్రవర్తి. - సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
నిజం.. నిజాం నాటి నాణెం
చార్మినార్ వద్ద విక్రయానికి నిజాం కాలం నాటి నాణేలు చార్మినార్: పాతబస్తీ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వస్తున్న వారికి చార్మినార్ కట్టడం వద్ద నిజాం కాలం నాటి పురాతన నాణేలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఖరీదు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నిజాం కాలం నాటి పురాతన నాణేలను ఇప్పటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు. చూద్దామన్నా... ఎవరి దగ్గరా దొరక్కపోవచ్చు. నిజాం కాలంలో ఏక్ అణా.. దో అణా.. చార్ అణా.. అనే పైసలు చెలామణిలో ఉండేవి. వాటితో పాటు దాదాపు 50 దేశాలకు చెందిన పురాతన కరెన్సీలను ఇక్కడి చార్మినార్ కట్టడం వద్ద ఫుట్‌పాత్‌పై పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారి విక్రయిస్తున్నాడు. నిజాం కాలం నాటి ఒక రూపాయి నాణెం ధర ప్రస్తుతం రూ. 1500, చార్‌ఆణ 25 (పైసలు) ఖరీదు రూ. 800 లు గాను... ఏక్ ఆణ ఖరీదు రూ. 150 గాను... ఒక పైస ఖరీదు రూ. 100 గా విక్రయిస్తున్నట్లు నాణేల వ్యాపారి తెలిపాడు.