2 Rupee Coin Value 5 Lakh: You Can Earn Rs 5 Lakhs In Online By Old 2 Rupee Coin - Sakshi
Sakshi News home page

ఈ రూ. 2 నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చా?

Published Tue, Jun 15 2021 2:15 PM | Last Updated on Tue, Jun 15 2021 7:55 PM

You Can Earn Rs 5 Laksh In Online If You Have A Rare Rs 2 Coin - Sakshi

బెంగళూరు: నాణేల వాడకం రెండు వేల సంవత్సరాల క్రితం మొదలైనట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాల క్రమేణా కొన్ని కనుమరుగైపోయాయి. అయితే పెద్దలు ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని వూరికే చెప్పలేదు. 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన 2 రూపాయల నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చు.

అరుదైన నాణేలను సేకరించే అలవాటు ఉంటే.. రూ .5 లక్షలు సంపాదించవచ్చు. బెంగళూరుకు చెందిన క్విక్కర్‌ వెబ్‌సైట్‌లో చాలా మంది కొనుగోలుదారులు ఈ పాత, అరుదైన నాణానికి భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది .

పాత ఫీచర్లతో రూ .10 నోటు
అంతేకాకుండా  పాత ఫీచర్లతో ఉన్న రూ .10 నోట్‌ ఆన్‌లైన్‌లో కాయిన్‌బజార్ ప్లాట్‌ఫామ్‌లో అమ్మవచ్చు. ఈ అరుదైన పాత నోట్లు, నాణేల కోసం కొనుగోలుదారులు వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు వినికిడి. అయితే నోటులో ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉండాలి. ఈ నోట్‌ను 1943 సంవత్సరంలో జారీ చేసి ఉండాలి. ఇక ఈ నోట్‌లో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. ఇది కాకుండా, 10 రూపాయలు అని ఆంగ్ల భాషలో నోట్ రెండు చివర్లలో.. వెనుక వైపు రాసి ఉండాలి.

చదవండి: US: కొవాగ్జిన్‌ తీసుకున్నారా.. మా దేశం రావచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement