Quikr
-
ఈ రూ. 2 నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చా?
బెంగళూరు: నాణేల వాడకం రెండు వేల సంవత్సరాల క్రితం మొదలైనట్లు చరిత్ర చెబుతోంది. అయితే కాల క్రమేణా కొన్ని కనుమరుగైపోయాయి. అయితే పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని వూరికే చెప్పలేదు. 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన 2 రూపాయల నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చు. అరుదైన నాణేలను సేకరించే అలవాటు ఉంటే.. రూ .5 లక్షలు సంపాదించవచ్చు. బెంగళూరుకు చెందిన క్విక్కర్ వెబ్సైట్లో చాలా మంది కొనుగోలుదారులు ఈ పాత, అరుదైన నాణానికి భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది . పాత ఫీచర్లతో రూ .10 నోటు అంతేకాకుండా పాత ఫీచర్లతో ఉన్న రూ .10 నోట్ ఆన్లైన్లో కాయిన్బజార్ ప్లాట్ఫామ్లో అమ్మవచ్చు. ఈ అరుదైన పాత నోట్లు, నాణేల కోసం కొనుగోలుదారులు వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు వినికిడి. అయితే నోటులో ఒక వైపు అశోక స్తంభం, మరో వైపు పడవ ఉండాలి. ఈ నోట్ను 1943 సంవత్సరంలో జారీ చేసి ఉండాలి. ఇక ఈ నోట్లో అప్పటి ఆర్బీఐ గవర్నర్ సీడీ దేశ్ముఖ్ సంతకం ఉండాలి. ఇది కాకుండా, 10 రూపాయలు అని ఆంగ్ల భాషలో నోట్ రెండు చివర్లలో.. వెనుక వైపు రాసి ఉండాలి. చదవండి: US: కొవాగ్జిన్ తీసుకున్నారా.. మా దేశం రావచ్చు! -
క్వికర్ చేతికి ‘స్టెప్నీ’
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రకటనల పోర్టల్ క్వికర్, స్టెప్నీని బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. కారు యజమానులను, సమీపంలోని కారు సర్వీసు కేంద్రాలతో అనుసంధానానికి వీలు కల్పించేదే స్టెప్నీనీ. ఈ కొనుగోలుతో క్వికర్కార్స్ ద్వారా మరింత మందిని చేరువ కావచ్చని భావిస్తున్నట్టు క్వికర్ ప్రకటించింది. -
ఇక అమెజాన్ లో కూడా అమ్మేయొచ్చట!
బెంగళూరు: అమ్మేయండి సార్.. అంటూ టాలీవుడ్ హీరోయాడ్ గుర్తుందా...పాత వస్తువులు తిరిగి అమ్ముకునేందుకు ఉద్దేశించిన ఈ ప్రకటన పెద్ద సంచలనం. ఇపుడిక ఇలా పాత వస్తువులను అమెజాన్ లో కూడా అమ్మేయొచ్చట. ఇలా ఇంట్లోని పాత వస్తువులను అమ్ముకునేందుకు ఆన్ లైన్ లో రకరకాల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోవలో ఓఎల్ఎక్స్ , క్వికర్ ఈబే లాంటివీ బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో వీటికి పోటీగా మరో ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ రంగంలోకి దిగింది. పాత వస్తువులను విక్రయించే తనకొత్త ప్లాట్ ఫాం ను లాంచ్ చేసింది. . ఫ్లిప్ కార్ట్ కి పోటీగా జంగ్లీ ని లాంచ్ చేసిన అమెజాన్ ఆపుడు క్వికర్, ఓ ఎల్ఎక్స్ లతో పోటీకి సై అంటోంది. ఈ విషయన్ని సంప్రదించగా, అమెజాన్ భారతదేశం ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు, మొబైల్ ఫోన్లు, మాత్రలు, వాచీలు, పుస్తకాలు తదితర ఇతర పాత వస్తువులను విక్రయానికి అనుమతించే ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు చెప్పారు. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలోభారతదేశం ఒక బోల్డ్ బెట్ గా ఆయన అభివర్ణించారు. వస్తువులను అమ్మకందారుల ఇంటిదగ్గరే తీసుకునేలా పిక్ అప్ సర్వీసును కూడా అందిస్తున్నామన్నారు. వీటి ప్యాకేజింగ్, వస్తువులను కొనుగోలు దారుడికి అందించిన తరువాత మాత్రమే ఇరు పార్టీలనుంచి చార్జ్ వసూలు చేస్తామని చెప్పారు. అలాగే తమ వెబ్ సైట్ లో ప్రకటనలను ఉచితంగా ఇచ్చుకోవచ్చన్నారు. ముందు బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించామనీ, త్వరలోనే దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. -
క్వికర్ చేతికి కామన్ఫ్లోర్!
క్వికర్ చేతికి కామన్ఫ్లోర్! న్యూఢిల్లీ: ఆన్లైన్ క్లాసిఫైడ్ సంస్థ క్వికర్... రియల్ ఎస్టేట్ పోర్టల్ కామన్ఫ్లోర్ డాట్కామ్ను 10 కోట్ల నుంచి 20 కోట్ల డాలర్ల ధరకు కొనుగోలు చేయనున్నదని సమాచారం. దీనికి సంబంధించి చర్చలు తుదిదశలో ఉన్నాయని, త్వరలోనే ఒప్పందం ఖరారు కానున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, మార్కెట్ ఊహాగానాలపై స్పందించబోమని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత పటిష్టవంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, అయితే మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని క్వికర్ ప్రతినిధి చెప్పారు. 2007లో సుమిత్ జైన్, లలిత్ మంగళ్, వికాస్ మాల్పానీ కలిసి కామన్ఫ్లోర్ డాట్కామ్ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇప్పటికే యాక్సెల్ పార్ట్నర్స్, టైగర్ గ్లోబల్, గూగుల్ క్యాపిటల్ సంస్థల నుంచి 6 కోట్ల డాలర్ల నిధులను సమీకరించింది. నిధుల సమీకరణ కోసం చూస్తున్నామని, అయితే ఇంతవరకూ ఎలాంటి ఒప్పందం తుదిదశకు రాలేదని కామన్ఫ్లోర్ పేర్కొంది.