ఇక అమెజాన్ లో కూడా అమ్మేయొచ్చట!
బెంగళూరు: అమ్మేయండి సార్.. అంటూ టాలీవుడ్ హీరోయాడ్ గుర్తుందా...పాత వస్తువులు తిరిగి అమ్ముకునేందుకు ఉద్దేశించిన ఈ ప్రకటన పెద్ద సంచలనం. ఇపుడిక ఇలా పాత వస్తువులను అమెజాన్ లో కూడా అమ్మేయొచ్చట. ఇలా ఇంట్లోని పాత వస్తువులను అమ్ముకునేందుకు ఆన్ లైన్ లో రకరకాల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోవలో ఓఎల్ఎక్స్ , క్వికర్ ఈబే లాంటివీ బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో వీటికి పోటీగా మరో ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ రంగంలోకి దిగింది. పాత వస్తువులను విక్రయించే తనకొత్త ప్లాట్ ఫాం ను లాంచ్ చేసింది.
.
ఫ్లిప్ కార్ట్ కి పోటీగా జంగ్లీ ని లాంచ్ చేసిన అమెజాన్ ఆపుడు క్వికర్, ఓ ఎల్ఎక్స్ లతో పోటీకి సై అంటోంది. ఈ విషయన్ని సంప్రదించగా, అమెజాన్ భారతదేశం ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు, మొబైల్ ఫోన్లు, మాత్రలు, వాచీలు, పుస్తకాలు తదితర ఇతర పాత వస్తువులను విక్రయానికి అనుమతించే ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు చెప్పారు. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలోభారతదేశం ఒక బోల్డ్ బెట్ గా ఆయన అభివర్ణించారు. వస్తువులను అమ్మకందారుల ఇంటిదగ్గరే తీసుకునేలా పిక్ అప్ సర్వీసును కూడా అందిస్తున్నామన్నారు. వీటి ప్యాకేజింగ్, వస్తువులను కొనుగోలు దారుడికి అందించిన తరువాత మాత్రమే ఇరు పార్టీలనుంచి చార్జ్ వసూలు చేస్తామని చెప్పారు. అలాగే తమ వెబ్ సైట్ లో ప్రకటనలను ఉచితంగా ఇచ్చుకోవచ్చన్నారు. ముందు బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించామనీ, త్వరలోనే దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్టు తెలిపారు.