takes
-
ఏపీ అసెంబ్లీ: శాసనసభ్యుడిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును ఆడించిన కానిస్టేబుల్..
అహ్మదాబాద్: పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనుసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది. తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును కానిస్టేబుల్ ఒడిలోకి తీసుకుని ఆడించింది. గుజరాత్‌లోని ఓదావ్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. గుజరాత్లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్మెంట్ పరీక్ష ఆదివారం జరిగింది. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓదావ్‌లో జరిగిన సెంటర్ వద్దకు ఓ అభ్యర్థి తన బిడ్డతో పరీక్ష కేంద్రానికి హజరైంది. శిశువును సెంటర్ బయట వదిలి లోపలికి వెళ్లింది తల్లి. ఇంతలో ఆ శిశువును ఏడుపు ఆరంభించింది. పరిస్థితిని గమనించిన మహిళా కానిస్టేబుల్ దయా బెన్ ఆ చంటిబిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించింది. దీంతో ఆ మహిళా అభ్యర్థి సౌకర్యంగా పరీక్ష పూర్తి చేసింది. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. మహిళా కానిస్టేబుల్ దయా బెన్‌పై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. విధుల్లోనూ మాతృత్వాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దయా బెన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
మెట్రో రైలులో షికారుకెళ్లిన కోతి
-
ఐడీబీఐ బ్యాంక్‌కు భారీ ఊరట
సాక్షి, ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ను తన తీవ్ర నియంత్రణా పర్యవేక్షణా పరిధి (లేదా తగిన దిద్దుబాటు చర్యలు-పీసీఏ) నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం తొలగించింది. బ్యాంక్ ఫైనాన్షియల్ పరిస్థితులు మెరుగుపడ్డంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల క్రితం 2017 మేలో ఐడీబీఐ బ్యాంక్ పీసీఏ ఫ్రేమ్‌వర్క్ కిందకు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన సమస్యలతో పాటు 2017 నాటికి నికర మొండిబకాయిలు బ్యాంక్ రుణాల్లో 13 శాతానికి చేరడం వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ చేయడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెల ప్రారంభంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా ప్రకటన వెలువడ్డం గమనార్హం. కొనసాగనున్న పర్యవేక్షణ! తాజాగా 2021 ఫిబ్రవరి 18వ తేదీన ఫైనాన్షియల్ సూపర్విజన్ (బీఎఫ్ఎస్) బోర్డ్ ఐడీబీఐ బ్యాంక్ ఫైనాన్షియల్ పరిస్థితులపై సమీక్ష జరిపింది. 2020 డిసెంబర్ 31వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ ప్రకటించిన ఫలితాల ప్రకారం మూలధనం, ఎన్పీఏలు, లీవరేజ్ నిష్పత్తి అంశాల్లో బ్యాంక్ పీసీఏ మార్గదర్శకాలకు లోబడి ఉంది. అలాగే ఇందుకు సంబంధించి నియమనిబంధనలకు కట్టుబడి ఉంటానని కూడా బ్యాంక్ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ‘‘ఈ అంశాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్‌ను పీసీఏ చట్రం నుంచి తీసివేస్తున్నాం. అయితే మూలధనం, ఎన్పీఏలు, లీవరేజ్ నిష్పత్తి వంటి అంశాలన్నింటినీ మున్ముందూ జాగ్రత్తగా పర్యవేక్షించడం జరుగుతుంది’’ అని ఆర్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపింది. క్యూ3లో మంచి పనితీరు నేపథ్యం... లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన ఐడీబీఐ బ్యాంక్ 2020–21 డిసెంబర్ త్రైమాసికంలో రూ.378 కోట్ల(స్టాండెలోన్ ప్రాతిపదికన) నికర లాభాన్ని ఆర్జించింది. వడ్డీ ఆదాయాలు బాగుండడం ఇందుకు ప్రధాన కారణం. 2019–20 ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.5,763 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.1,532 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.1,810 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ మార్జిన్(ఎన్ఐఎం) 60 బేసిస్ పాయింట్లు(100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెరిగి 2.27 శాతం నుంచి 2.87 శాతానికి ఎగసింది. స్థూల ఎన్పీఏలు 28.72% నుంచి 23.52 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.25 శాతం నుంచి 1.94 శాతానికి దిగివచ్చాయి. 2019–20 క్యూ3తో పోల్చితే బ్యాంక్ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయి. -
పోలీస్‌శాఖలో అవినీతిని సహించను..
పెద్ద జిల్లాకు ఎస్పీగా రావడం ఆనందంగా ఉంది పరిస్థితులను అవగాహన చేసుకుంటూ చర్యలు చేపడతా రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై దృష్టిసారిస్తా జిల్లా ఎస్పీ విశాల్ గున్ని కాకినాడ క్రైం : పోలీస్‌శాఖలో క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ అవినీతిని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో 79వ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, ఆశ్వీరచనాల నడుమ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరుతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే పెద్ద జిల్లాకు ఎస్పీగా రావడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నక్సల్స్, అసాంఘిక, నేర కార్యకలాపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటానన్నారు. జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పోలీసులతో ప్రజా సంబంధాల మెరుగుకు కృషి చేస్తానన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రణాళిక.. నర్సీపట్నంలో ఓఎస్డీగా పనిచేసిన అనుభవంతో జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేరుగా తనను జిల్లా పోలీస్ కార్యాలయంలో కలుసుకోవచ్చన్నారు. తొలుత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కలెక్టర్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను, అనంతరం ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తిమ్మాపురంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడులను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఎస్పీ నేపథ్యమిది.. విశాల్ గున్ని సొంత రాష్ట్రం కర్నాటక 2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయనను 2013లో ప్రభుత్వం నర్సీపట్నం ఓఎస్డీగా నియమించింది. అనంతరం 2014 ఆగస్టులో విశాఖ రూరల్ ఏఎస్పీగా వెళ్లారు. అక్కడ దాదాపు రెండేళ్లపాటు పనిచేశాక మార్చి 2016 సంవత్సరంలో పదోన్నతిపై నెల్లూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. అక్కడ ఏడాదిన్నర పాటు పనిచేసి బదిలీపై జిల్లాకు వచ్చారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసే సమయంలో డయల్ యువర్ ఎస్పీ, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి మన్ననలు పొందారు. మెట్రోపాలిటన్ నగరాలకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ని నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ గ్రౌండ్ ఆధునికీకరణకు అధిక నిధులు మంజూరు చేయించారు. యువతను ఆకర్షించేందుకు పలు క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. -
సమరానికి సై అంటున్నమిస్త్రీ
ముంబై: టాటాసన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అన్నంత పనీ చేస్తున్నారు. టాటా గ్రూపు అరాచకాలపై పోరాడుతానని చెప్పిన మిస్త్రీ మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. కంపెనీల చట్టం సెక్షన్ 241, 242 కింద టాటా సన్స్ అణచివేత మిస్ మేనేజ్మెంట్ కు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మొదటి విచారణను ఎస్ సీఎల్ టీ డిసెంబర్ 22న చేపట్టనుంది. మరోవైపు సైరస్ మిస్త్రీ తాజా ఆరోపణలను టాటా గ్రూపు ఖండించింది. కాగా చట్టవిరుద్ధంతా తనను పదవి నుంచి తొలగించారని ఆరోపిస్తున్న మిస్త్రీ సోమవారం టాటా గ్రూపులోని అన్ని గ్రూపులకు రాజీనామా చేస్తూ ఒకప్రకటన విడుదల చేశారు. టాటా గ్రూపులోని ఆరు కంపెనీలకు రాజీనామా చేసిన ఆయన రతన్ టాటాకు వ్యతిరేకంగా చట్టానికి, సమానత్వానికి గౌరవం దక్కే సంస్థ ద్వారా తనపోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. తనపోరాటాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మిస్ వరల్డ్‌గా పొర్టారికో సుందరి
-
సిగరెట్ ఎలా తాగాలో అమ్మే నేర్పింది
-
'ఆర్ 3' పై సుబ్రహ్మణ్య స్వామి మరోసారి దాడి
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘు రామ్ రాజన్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోసారి విమర్శలకు దిగారు. రాజన్ ను 'ఆర్ 3' అని పేర్కొన్న స్వామి దేశంలో రుణాత్మక ద్రవ్యోల్బణ పరిస్థితులకు ఆయనే కారణమంటూ నిందించారు. దీనికి ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా పత్రాన్ని ఆయన కోట్ చేశారు. రాజన్ అనుసరించిన వడ్డీ రేట్ల విధానమే ద్రవ్యోల్బణానికి కారణమన్న సత్యాన్ని ఐఎంఎఫ్ పత్రం తేటతెల్లం చేసిందని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. మరికొన్ని వారాల్లో రాజన్ పదవీ కాలం ముగియనుండగా స్వామి తన ఘాటు వ్యాఖ్యలకు మరింత పదును పెట్టడం విశేషం. 2013, సెప్టెంబర్ లో ఆర్ బీఐ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తరవాత, రాజన్ క్రమంగా స్వల్పకాలిక లెండింగ్ రేట్లను 7.25 శాతం నుంచి 8 శాతం పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ కారణాలను చూపుతూ 2014వరకు అదే రేట్లను కొనసాగించారు. అయితే జనవరి 2015 లో రేట్లు తగ్గించే ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి 6.50 శాతంనుంచి 1.50శాతం మేర తగ్గించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వర్కింగ్ పేపర్ ను కోట్ చేసిన స్వామి రాజన్ పై తన విమర్శలను మరోసారి సమర్థించు కున్నారు. వడ్డీరేట్లను అత్యధిక స్థాయిలో ఉంచి దేశ ఆర్థిక వృద్ధి నాశనానికి కారణమవుతున్నాడని, ఆయన మన దేశానికి పనికిరాడంటూ రాజన్ పై గతంలో పలుసార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. Now IMF has in effect debunked that interest rate raising madness of R3 had a role in inflation control. Personal? pic.twitter.com/Xa2qiFjP6P — Subramanian Swamy (@Swamy39) August 19, 2016 -
ఉసురుతీసిన అప్పులు
అప్పులబాధతో రైతు బలవన్మరణం హుజూర్నగర్ మండల పరిధిలో ఘటన హుజూర్నగర్: అప్పులకుంపటి మరో రైతు ఉసురు తీసింది. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాక, అప్పుల వారి ఒత్తిడి తట్టుకోలేక చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హుజూర్నగర్ మండల పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన రాగం అంజయ్య (35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న మూడు ఎకరాల భూమిలో వరి సాగు చేశాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాల నిమిత్తం తెలిసిన వారి వద్ద రూ. 6 లక్షల వరకు అప్పు చేశాడు. గత రెండు సీజన్లుగా సాగు నీరు అందకపోవడంతో దిగుబడి ఆశాజనకంగా లేదు. దీంతో అప్పుల వారి ఒత్తిడి పెరిగిపోవడంతో తట్టుకోలేక మంగళవారం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకున్నాడు. కాగా అటువైపుగా వెళ్తున్న రైతులు చెట్టుకు వేలాడుతున్న అంజయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ టీచర్!
మెక్సికోః విద్యార్థులకు అర్థమయ్యేట్టు పాఠాలు బోధించడం అంటే అంత సులభం కాదు. అందులోనూ సైన్స్ పాఠాలు బోధించడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అందుకే ఓ టీచర్ పాఠాలు చెప్పేందుకు సింపుల్ సొల్యూషన్ కనిపెట్టాడు. విద్యార్థులు పాఠాలు శ్రద్ధగా వినేందుకు, వారిలో అవగాహన పెంచడంతోపాటు పాఠం వినడంలో పిల్లలు నిమగ్నమయ్యేందుకు సైన్స్ ను చక్కగా వివరించేందుకు కొత్త మార్గాన్ని అవలంబించాడు. పాఠం చెప్పేందుకు క్లాస్ రూం కు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి వెళ్ళాడు. క్లాసులో పిల్లలు పాఠాలు శ్రద్ధగా, ఇష్టంగా వినాలంటే టీచర్ చెప్పే విధానం బాగుండాలి. అయితే ఎంతో అనుభవం ఉన్న టీచర్లు కూడ ఒక్కోసారి విద్యార్థులను ఆకట్టుకోవడంలో విఫలమౌతుంటారు. అయితే పిల్లలకు పుస్తకాలంటే బోర్ కొట్టకుండా, పాఠం శ్రద్ధగా వినేందుకు మెక్సికోకు చెందిన 26 ఏళ్ళ సైన్స్ టీచర్.. మోజెస్ వాజ్ క్వెజ్ వినూత్న పద్ధతిలో ప్రయత్నించాడు. వాస్తవ జీవితంలో సూపర్ హీరోలా విద్యార్థులముందు స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కంప్యూటర్ సైన్స్ పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించాడు. మోజెస్ మెక్సికో నేషనల్ అటానమస్ విశ్వవిద్యాలయం (యుఎన్ ఏఎమ్) లో సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ పాఠాలపట్ల విసుగు చెందకుండా ఉండేందుకు మోజెస్ పలు స్పైడర్ మ్యాన్ కామిక్స్ ను ప్రయోగించి పాఠాలు బోధిస్తున్నాడు. పార్ట్ టైం సైన్స్ టీచర్, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ పీటర్ పార్కర్ స్ఫూర్తితో విద్యార్థులు సూపర్ హీరోగా భావించే స్పైడర్ మ్యాన్ సూట్ ధరించి పాఠాలు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనో, ఉత్తమ శ్రేణి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవాలనో తాను ప్రయత్నించడం లేదని, నిజాయితీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి, క్లాస్ రూం అంటే బెటర్ ప్లేస్ అన్న ఫీలింగ్ విద్యార్థుల్లో కలిగేట్లు ప్రయత్నిస్తున్నానని మోజెస్ చెప్తున్నాడు. తూర్పు మెక్సికోలో తన తల్లితోపాటు నివసిస్తున్న మోజెస్... స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి ప్రజారవాణా వాహనాల్లోనే యూనివర్శిటీకి వెడుతుంటాడు. తోటి ప్రయాణీకులు అతన్ని సూపర్ హీరోగా భావించినప్పటికీ తాను విశ్వవిద్యాలయంలో సైన్స్ టీచర్ ను మాత్రమే అని వివరిస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ ఆలోచనపై మోజెస్ కుటుబం మొదట్లో అతడి కెరీర్ కు హాని కలిగిస్తుందేమోనని భయపడింది. కానీ మోజెస్ తనదైన రీతిలో స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి తరగతులకు వెళ్ళి విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాడు. తన ఆలోచనతో ఒక్క విద్యార్థులనే కాక వర్శిటీలోని ఇతర ఉపాధ్యాయులనూ ఆకట్టుకున్నాడు. మొదటి రోజు వారంతా స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోయినా... తర్వాత సంతోషంగా నవ్వుతూ ఆహ్వానించారని, చేసే పనిపట్ల బాధ్యత కలిగి ఉంటే, శక్తి అదే వస్తుందని మోజెస్ చెప్తున్నాడు. -
ఇక అమెజాన్ లో కూడా అమ్మేయొచ్చట!
బెంగళూరు: అమ్మేయండి సార్.. అంటూ టాలీవుడ్ హీరోయాడ్ గుర్తుందా...పాత వస్తువులు తిరిగి అమ్ముకునేందుకు ఉద్దేశించిన ఈ ప్రకటన పెద్ద సంచలనం. ఇపుడిక ఇలా పాత వస్తువులను అమెజాన్ లో కూడా అమ్మేయొచ్చట. ఇలా ఇంట్లోని పాత వస్తువులను అమ్ముకునేందుకు ఆన్ లైన్ లో రకరకాల వెబ్ సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కోవలో ఓఎల్ఎక్స్ , క్వికర్ ఈబే లాంటివీ బహుళ ప్రజాదరణ పొందాయి. ఈ నేపథ్యంలో వీటికి పోటీగా మరో ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ రంగంలోకి దిగింది. పాత వస్తువులను విక్రయించే తనకొత్త ప్లాట్ ఫాం ను లాంచ్ చేసింది. . ఫ్లిప్ కార్ట్ కి పోటీగా జంగ్లీ ని లాంచ్ చేసిన అమెజాన్ ఆపుడు క్వికర్, ఓ ఎల్ఎక్స్ లతో పోటీకి సై అంటోంది. ఈ విషయన్ని సంప్రదించగా, అమెజాన్ భారతదేశం ప్రతినిధి దీన్ని ధ్రువీకరించారు, మొబైల్ ఫోన్లు, మాత్రలు, వాచీలు, పుస్తకాలు తదితర ఇతర పాత వస్తువులను విక్రయానికి అనుమతించే ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు చెప్పారు. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలోభారతదేశం ఒక బోల్డ్ బెట్ గా ఆయన అభివర్ణించారు. వస్తువులను అమ్మకందారుల ఇంటిదగ్గరే తీసుకునేలా పిక్ అప్ సర్వీసును కూడా అందిస్తున్నామన్నారు. వీటి ప్యాకేజింగ్, వస్తువులను కొనుగోలు దారుడికి అందించిన తరువాత మాత్రమే ఇరు పార్టీలనుంచి చార్జ్ వసూలు చేస్తామని చెప్పారు. అలాగే తమ వెబ్ సైట్ లో ప్రకటనలను ఉచితంగా ఇచ్చుకోవచ్చన్నారు. ముందు బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించామనీ, త్వరలోనే దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. -
'ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర'
-
క్రీడాంశంగా మారిన యోగా
-
కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు
-
అంత తొందరేల?
-
చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే...