అహ్మదాబాద్: పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనుసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది. తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును కానిస్టేబుల్ ఒడిలోకి తీసుకుని ఆడించింది. గుజరాత్‌లోని ఓదావ్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.
గుజరాత్‌లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఆదివారం జరిగింది. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓదావ్‌లో జరిగిన సెంటర్ వద్దకు ఓ అభ్యర్థి తన బిడ్డతో పరీక్ష కేంద్రానికి హజరైంది. శిశువును సెంటర్ బయట వదిలి లోపలికి వెళ్లింది తల్లి. ఇంతలో ఆ శిశువును ఏడుపు ఆరంభించింది. పరిస్థితిని గమనించిన మహిళా కానిస్టేబుల్ దయా బెన్ ఆ చంటిబిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించింది. దీంతో ఆ మహిళా అభ్యర్థి సౌకర్యంగా పరీక్ష పూర్తి చేసింది.
ఈ వీడియోను గుజరాత్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. మహిళా కానిస్టేబుల్ దయా బెన్‌పై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. విధుల్లోనూ మాతృత్వాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దయా బెన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..!
Comments
Please login to add a commentAdd a comment