canistable
-
‘నా భార్య నా రక్తం తాగేస్తోంది.. ఏం చేయమంటారు!’
లక్నో: ‘నా భార్యకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తను ప్రతి రోజు నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నేను నిద్ర పోలేకపోతున్నా. ఫలితమే నా విధుల్లో సమయ పాలన పాటించలేకపోతున్నా’అంటూ ఓ పారామిలటరీ జవాన్ తన కమాండర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య పోరు పడలేక సదరు జవాన్ రాసిన ఆ లేఖను లక్షల మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇంతకి ఏం జరిగింది?దేశంలో శాంతి భద్రతలకు విఘూతం కలగకుండా డేగ కన్నుతో నిత్యం రక్షణ కల్పించే పారా మిలరీ విభాగంలో ప్రొవిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (pac) విభాగం ఉంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా 44వ ప్రదేషిక్ ఆర్మ్డ్ కాన్స్టేబులరీ (Pradeshik Armed Constabulary) విభాగంలో ఓ జవాన్ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో సిన్సియర్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండే సదరు జవాన్‌లో ఇటీవల కాలంలో సమయ పాలన లోపించింది. డ్యూటీ టైంకు రాకపోవడం,షేవింగ్ చేసుకోకపోవడం, చిందవందరగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో చేయకుండా ఆలస్యం చేస్తుండేవారు.విధుల్లో నిర్లక్ష్యం.. అందుకు కారణంఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గత నెల 17న పీఏసీ 44వ బెటాలియన్ జీస్వ్కాడ్ కమాండర్ మదుసూధన్ శర్మ సదరు జవాన్‌కు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో.. మందురోజు విధులు ఎలా జరిగాయో తెలుసుకుని.. ఆ రోజు విధులు ఎక్కడ నిర్వహించాలో ప్రతి రోజు ఉదయం బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్‌కు గైర్హాజరు కావడం కాకుండా ఆలస్యంగా రావడం, మిలటరీ విభాగంలో విధులు నిర్వహించే వారు తప్పని సరిగా ఫుల్ షేవింగ్ చేసుకోవాలి. కానీ అలా షేవింగ్ చేసుకోకుండా విధులు నిర్వహించడం, ఇష్టానుసారంగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో లేఖలో పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు ఒకరోజు సమయం కూడా ఇచ్చారు.అసలేం జరిగిందంటే?కమాండర్ నుంచి వచ్చిన లేఖపై సదరు పీఏసీ జవాన్ వివరణ ఇచ్చారు. తాను విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో భావోద్వేగంతో పలు కారణాల్ని జత చేశారు. ‘సార్ నేను ఫిబ్రవరి 16న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాను. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. వాటి వల్ల రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం నా భార్యతో గొడవలు జరిగాయి. గొడవ తర్వాత నా భార్య నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుకుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి తోడు నా తల్లిని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాను. తీవ్ర మనోవేధనకు గురవుతున్నా. దీని నుంచి భయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాను. నేను పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించేలా ఓ దారి చూపాలని ఆ లేఖలో ప్రాధేయపడ్డారు. ఆ లేఖపై 44వ బెటాలియన్ పీఏసీ కమాండంట్ సత్యేంద్ర పటేల్ స్పందించారు. ఆన్లైన్లో వైరల్ అవుతున్న లేఖ నిజమేనా? అదే నిజమైతే ఎవరు రాశారో? పరిశీలిస్తాం. సదరు జవాన్‌కు ఇబ్బందులు ఉంటే అతనికి అండగా నిలుస్తాం. చికిత్స కూడా అందిస్తాం’అని అన్నారు. -
నడిరోడ్డుపై కానిస్టేబుళ్ల కొట్లాట
పాట్నా: బిహార్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు నడిరోడ్డుపై ముష్టియుద్ధానికి దిగారు. జనం చూస్తున్నారనే విషయం కూడా పట్టించుకోకుండా కొట్టుకున్నారు. బిహార్‌లో నలందకు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. లంచం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదంతో వీడియో ప్రారంభం అవుతుంది. లంచం తీసుకున్నట్లు ఒప్పుకోవాలని ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ప్రశ్నించడంతో ఘర్షణ మొదలయ్యింది. నడిరోడ్డుపైనే ఇద్దరు దాదాపు ముష్టి యుద్ధానికి దిగారు. అనంతరం ఓ కానిస్టేబుల్ పోలీసు వాహనంలో నుంచి లాఠీ తీసుకుని ఫైటింగ్‌కి దిగాడు. ఇక చుట్టుపక్కల చేరిన జనం వారిని హెచ్చరిస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. बिहार पुलिस के जवान आपस में हिसाब-किताब करते हुए, नालंदा का वीडियो. pic.twitter.com/8KWlChndwl — Utkarsh Singh (@UtkarshSingh_) September 18, 2023 ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఫైరయ్యారు. ఇద్దరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇద్దరు పోలీసులను విధుల నుంచి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. सोशल मीडिया पर नालन्दा जिला अंतर्गत दो पुलिस कर्मियों के बीच विवाद का वायरल विडिओ पर पुलिस अधीक्षक, नालन्दा के द्वारा संज्ञान लेते हुए दोनों पुलिस कर्मियों को पुलिस केंद्र वापस किया गया है और जांच का आदेश दिया गया है।(1/2) . .#BiharPolice #HainTaiyaarHum #Bihar — Bihar Police (@bihar_police) September 18, 2023 ఇదీ చదవండి: తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ.. -
తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును ఆడించిన కానిస్టేబుల్..
అహ్మదాబాద్: పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ గొప్ప మనుసు చాటుకుంది. పరీక్ష రాయడానికి వచ్చిన ఓ అభ్యర్థి బిడ్డను సొంత కూతురిలా అక్కున చేర్చుకుంది. తల్లి పరీక్ష రాస్తుండగా.. శిశువును కానిస్టేబుల్ ఒడిలోకి తీసుకుని ఆడించింది. గుజరాత్‌లోని ఓదావ్‌లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. గుజరాత్లో హైకోర్టు ప్యూన్ రిక్రూట్మెంట్ పరీక్ష ఆదివారం జరిగింది. వేల సంఖ్యలో అభ్యర్థులు ఉద్యోగం కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఓదావ్‌లో జరిగిన సెంటర్ వద్దకు ఓ అభ్యర్థి తన బిడ్డతో పరీక్ష కేంద్రానికి హజరైంది. శిశువును సెంటర్ బయట వదిలి లోపలికి వెళ్లింది తల్లి. ఇంతలో ఆ శిశువును ఏడుపు ఆరంభించింది. పరిస్థితిని గమనించిన మహిళా కానిస్టేబుల్ దయా బెన్ ఆ చంటిబిడ్డను ఒడిలోకి తీసుకుని లాలించింది. దీంతో ఆ మహిళా అభ్యర్థి సౌకర్యంగా పరీక్ష పూర్తి చేసింది. ఈ వీడియోను గుజరాత్ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది. మహిళా కానిస్టేబుల్ దయా బెన్‌పై ప్రశంసలు కురిపించారు నెటిజన్లు. విధుల్లోనూ మాతృత్వాన్ని చూపినందుకు ధన్యవాదాలు తెలిపారు. దయా బెన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఇదీ చదవండి: హరిద్వార్‌లో రాకాసి మేఘం.. చూస్తే..! -
తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులు.. ఆపై ఆత్మహత్య
శ్రీనగర్: ఇంటో టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ)కి చెందిన కానిస్టేబుల్ తన తోటి సైనికులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్‌పుర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన వెలుగుచూసింది. ముగ్గురు సహచరులపై కాల్పులు జరిపిన అనంతరం తానూ కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కానిస్టేబుల్. ఉధంపుర్లోని దేవికా ఘాట్ కమ్యూనిటీ సెంటర్లో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ 8వ బెటాలియన్ భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. 'జమ్ముకశ్మీర్‌లోని ఉధమ్ఫుర్లో ముగ్గురు జవాన్లపై ఐటీబీపీ 8వ బెటాలియన్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఆ తర్వాత తనకు తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తూటాలు తగిలిన ముగ్గురు జవాన్లను ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.' అని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది ఐటీబీపీ. కాల్పులు జరిపేందుకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొంది. మృతి చెందిన కానిస్టేబుల్ ఐటీబీపీలోని ఎఫ్ కంపెనీకి చెందినట్లు తెలిపింది. ఇదీ చూడండి: విషాదం.. మజాక్‌ల చేసిన పనితో దోస్త్ ప్రాణం పోయింది -
డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చంద్రాయణగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. బైక్‌పై రాంగ్ రూట్లో వచ్చిన ఇద్దరు దుండగులు కర్రలతో కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటను స్థలానికి చేరుకొని కానిస్టేబుల్‌ను హుటాహుటిన డిఆర్డీఏ ఆపోలో ఆసుపత్రికి తరలించారు. ఫలక్‌నుమా ఏసీపీ మజీద్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు..? ఎందుకు దాడిచేశారు..? రాంగ్ రూట్లో వెళ్తున్నారని ప్రశ్నించినందుకు దాడి చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. -
మాకొద్దీ పోలీసు కొలువు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల శిక్షణ ప్రారంభమైంది. వివిధ రకాల పోస్టులకు దాదాపు 16 వేల మంది ఎంపికయ్యారు. ఈ సమయంలో 2 విషయాలు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది 1,370 మంది పోలీసు ఉద్యోగానికి ఎంపికైనా చేరడానికి ఆసక్తి చూపలేదు. వీరిలో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక 500 మంది ప్రాథమిక సమాచారం ఇవ్వ లేదు. శిక్షణకు రాలేమని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. మరో 750 మంది అసలు అటెస్టేషన్ ఫామ్‌లనే సమర్పించలేదు. మిగిలిన 120 మంది మెడికల్ పరీక్షలకు హాజరవ్వలేదు. వీటి వెనక వ్యక్తిగతమైన అంశాలు కారణమై ఉండొచ్చని టీఎస్ఎల్ పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇక రెండో అంశం 3,800 మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) అభ్యర్థులు ఉద్యోగానికి ఎంపికైనా శిక్షణ కోసం పిలుపురాలేదు. వీరి శిక్షణ విషయంపై తెలంగాణ పోలీసుశాఖ ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఇక సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, ప్రిజన్స్, ఫైర్, మెకానిక్, డ్రైవర్, ఐటీ విభాగాలు కలిపి దాదాపు 9,200 మంది ట్రైనీలకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ.. మరో 900 మందిలో 500 మంది వరకు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు రిక్రూట్మెంట్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసింది. 200 మంది వైద్య పరీక్షలో విఫలం కాగా, 200 మంది అసంపూర్తిగా వివరాలు సమర్పించారు. టీఎస్ఎస్పీ శిక్షణ జాప్యమవుతున్న విషయాన్ని ఉన్నతాధికారులు ముందే తెలియజేశారు. సీనియారిటీపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే శిక్షణకు సంబంధించిన సమాచారం తెలియజేస్తామంటున్నారు. -
కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు ఆన్లైన్లో హాల్‌టికెట్లు
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి 22న నిర్వహించే ఫైనల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ హాల్‌టికెట్లను ఆ¯ŒSలైన్లో పొందవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మూడంచెల పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. తొలి విడతలో భాగంగా నవంబర్ 8న జేఎ¯ŒSటీయూకే ఆధ్వర్యంలో అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 20 నుంచి జిల్లా పోలీస్ మైదానంలో శారీరక సామర్థ్యం, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ఆ««దl్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరుగు పరీక్షలో పారదర్శకత కోసం ఆధునిక పరిజ్ఙానం కలిగిన స్పెన్సర్లు చిప్ అమర్చిన జాకెట్లను అభ్యర్థుల చొక్కాకు తగిలించారు. హాల్‌టికెట్లను.. రిక్రూట్మెంట్.ఏపీపోలీస్.గవ్.ఇ¯ŒSదద్వారా పొందవచ్చని వారు సూచించారు.