కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు ఆన్‌లైన్లో హాల్‌టికెట్లు
Published Fri, Jan 13 2017 9:46 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) :
కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి 22న నిర్వహించే ఫైనల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ హాల్‌టికెట్లను ఆ¯ŒSలైన్లో పొందవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం మూడంచెల పరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న విషయం విదితమే. తొలి విడతలో భాగంగా నవంబర్ 8న జేఎ¯ŒSటీయూకే ఆధ్వర్యంలో అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 20 నుంచి జిల్లా పోలీస్ మైదానంలో శారీరక సామర్థ్యం, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ఆ««దl్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరుగు పరీక్షలో పారదర్శకత కోసం ఆధునిక పరిజ్ఙానం కలిగిన స్పెన్సర్లు చిప్ అమర్చిన జాకెట్లను అభ్యర్థుల చొక్కాకు తగిలించారు. హాల్‌టికెట్లను.. రిక్రూట్‌మెంట్.ఏపీపోలీస్.గవ్.ఇ¯ŒSదద్వారా పొందవచ్చని వారు సూచించారు.
Advertisement
Advertisement