
లక్నో: ‘నా భార్యకు నాకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తను ప్రతి రోజు నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే నేను నిద్ర పోలేకపోతున్నా. ఫలితమే నా విధుల్లో సమయ పాలన పాటించలేకపోతున్నా’అంటూ ఓ పారామిలటరీ జవాన్ తన కమాండర్‌కు లేఖ రాశారు. ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య పోరు పడలేక సదరు జవాన్ రాసిన ఆ లేఖను లక్షల మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు. ఇంతకి ఏం జరిగింది?
దేశంలో శాంతి భద్రతలకు విఘూతం కలగకుండా డేగ కన్నుతో నిత్యం రక్షణ కల్పించే పారా మిలరీ విభాగంలో ప్రొవిన్సియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (pac) విభాగం ఉంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా 44వ ప్రదేషిక్ ఆర్మ్డ్ కాన్స్టేబులరీ (Pradeshik Armed Constabulary) విభాగంలో ఓ జవాన్ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో సిన్సియర్‌గా, స్ట్రిక్ట్‌గా ఉండే సదరు జవాన్‌లో ఇటీవల కాలంలో సమయ పాలన లోపించింది. డ్యూటీ టైంకు రాకపోవడం,షేవింగ్ చేసుకోకపోవడం, చిందవందరగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో చేయకుండా ఆలస్యం చేస్తుండేవారు.
విధుల్లో నిర్లక్ష్యం.. అందుకు కారణం
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గత నెల 17న పీఏసీ 44వ బెటాలియన్ జీస్వ్కాడ్ కమాండర్ మదుసూధన్ శర్మ సదరు జవాన్‌కు విధుల్లో అలసత్వం వహిస్తున్నారని, వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో.. మందురోజు విధులు ఎలా జరిగాయో తెలుసుకుని.. ఆ రోజు విధులు ఎక్కడ నిర్వహించాలో ప్రతి రోజు ఉదయం బ్రీఫింగ్ ఉంటుంది. ఆ బ్రీఫింగ్‌కు గైర్హాజరు కావడం కాకుండా ఆలస్యంగా రావడం, మిలటరీ విభాగంలో విధులు నిర్వహించే వారు తప్పని సరిగా ఫుల్ షేవింగ్ చేసుకోవాలి. కానీ అలా షేవింగ్ చేసుకోకుండా విధులు నిర్వహించడం, ఇష్టానుసారంగా యూనిఫారమ్ ధరించడం, ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో లేఖలో పేర్కొన్నారు. వివరణ ఇచ్చేందుకు ఒకరోజు సమయం కూడా ఇచ్చారు.
అసలేం జరిగిందంటే?
కమాండర్ నుంచి వచ్చిన లేఖపై సదరు పీఏసీ జవాన్ వివరణ ఇచ్చారు. తాను విధుల్లో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారో భావోద్వేగంతో పలు కారణాల్ని జత చేశారు. ‘సార్ నేను ఫిబ్రవరి 16న డ్యూటీకి ఆలస్యంగా వచ్చాను. ఎందుకంటే వ్యక్తిగత సమస్యలు నన్ను తీవ్రంగా వేధిస్తున్నాయి. వాటి వల్ల రాత్రిపూట నిద్రపోవడం కష్టంగా మారింది. కొద్ది రోజుల క్రితం నా భార్యతో గొడవలు జరిగాయి. గొడవ తర్వాత నా భార్య నా కలలోకి వస్తుంది. నా గుండెలపై కూర్చుకుంటుంది. నా రక్తాన్ని తాగేందుకు ప్రయత్నిస్తుంది.
దీనికి తోడు నా తల్లిని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. కారణంగా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాను. తీవ్ర మనోవేధనకు గురవుతున్నా. దీని నుంచి భయటపడేందుకు చికిత్స తీసుకుంటున్నాను. నేను పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించేలా ఓ దారి చూపాలని ఆ లేఖలో ప్రాధేయపడ్డారు.
ఆ లేఖపై 44వ బెటాలియన్ పీఏసీ కమాండంట్ సత్యేంద్ర పటేల్ స్పందించారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న లేఖ నిజమేనా? అదే నిజమైతే ఎవరు రాశారో? పరిశీలిస్తాం. సదరు జవాన్‌కు ఇబ్బందులు ఉంటే అతనికి అండగా నిలుస్తాం. చికిత్స కూడా అందిస్తాం’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment