Woman Gets Husband Arrested 7 Times In Less Than 10 Years In Gujarat - Sakshi
Sakshi News home page

పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్టు చేయించింది..మళ్లీ భార్యే..

Published Wed, Jul 12 2023 3:50 PM | Last Updated on Wed, Jul 12 2023 4:02 PM

Woman Gets Husband Arrested 7 Times In Less Than 10 Years In Gujarat - Sakshi

ఓ మహిళ తన భర్త గృహహింసకు పాల్పడుతున్నాడంటూ కేసు పెట్టి అరెస్టు చేయించేది. చివరికి మళ్లీ ఆమె హామీగా ఉండి మరీ బెయిల్‌ ఇచ్చి విడుదల చేయించేది. ఇలా పదేళ్లలో ఏడుసార్లు భర్తను అరెస్టు చేయించింది. ఈ విచిత్రమైన ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..గుజరాత్‌లోని మొహసానాలో ఓ మహిళ తన భర్తను గృహహింసకు పాల్పడినందుకు గానూ 2015లో తొలిసారిగా కేసు పెట్టి అరెస్టు చేయించింది. అలా పదేళ్లో ఏడుసార్లు అరెస్టు చేయించింది. ఐతే అతను అరెస్టు అయిన తర్వాత మళ్లీ భార్యే హామీగా ఉండి బెయిల్‌ ఇచ్చి విడుదల చేయించేది. ఆ దంపతుల పేర్లు సోనూ, ప్రేమ్‌ చంద్‌.

వారికి 2001లో వివాహం అయ్యింది. 2014 నుంచి వారి వైవాహిక బంధంలో ఇబ్బందులు మొదలయ్యాయి. సోను 2015లో తన భర్త భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ తొలిసారిగా కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఆమెకు నెలవారి భరణం కింద రూ. 2000 ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఐతే రోజువారీ కూలీ అయిన ప్రేమ్‌చంద్‌, భరణం మొత్తాన్ని చెల్లించడానికి కష్టపడటంతో అతనిని అరెస్టు చేశారు. దీంతో ప్రేమ్‌చంద్‌ ఐదు నెలలు జైల్లో ఉన్నాడు. విచిత్రమేమిటంటే మళ్లీ అతడి భార్య సోనూనే అతనికి విడుదలయ్యేల బెయిల్‌ ఏర్పాటు చేసేది. మళ్లీ భార్యభర్తలిద్దరూ కలిసిపోయేవారు

చట్టబద్ధంగా..చూస్తే వేరువేరుగా ఉండాలి అయినప్పటికీ ఇద్దరూ కలిసే జీవించేవారు.  మళ్లీ కొద్దిరోజులకే యథాలాపంగా గొడవపడటం మళ్లీ పోలీసు మెట్లక్కెడం. ఆ దంపతుల బాగోతం ఓ దినచర్యలా సాగుతోంది. ఐతే ఈ సారి ప్రేమ్‌చంద్‌ ఈ ఏడాది ప్రారంభంలో కూడా భరణం చెల్లించడంలో విఫలంకావడంతో అరెస్టు అయ్యాడు. మళ్లీ భార్య సోనూనే విడుదల చేయించింది. ఇక విసుగొచ్చిందో ఏమో ప్రేమ్‌చంద్‌ ఇక సోంతూరు వెళ్లిపోయి..అక్కడే తన అమ్మతో కలిసి ఉండటం మొదలుపెట్టాడు.

తన భార్య సోనూ, అమె కొడుకు తనపై దాడి చేశారంటూ అతడే కేసు పెట్టాడు. తన వాలెట్‌, సెల్‌ఫోన్‌ కనిపించటం లేదని అడిగినందుకు తనపై దాడి చేశారని వాపోయాడు. ఈ కేసు పోలీసులకు కూడా ఓ తలనొప్పిలా మారింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ప్రతిసారి భార్య కేసులు పెడుతండగా..ఈసారి ప్రేమ్‌చందే తన భార్య, ఆమె కొడుకుపై కేసు పెట్టడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.  

(చదవండి: నా కోసం ఎదురు చూడొద్దు!.. మళ్లీ పెళ్లి చేసుకో: ఓ నేరస్తుడి భావోద్వేగ సందేశం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement