సాక్షి, కర్నూలు: శ్రీశైలం మహాక్షేత్రంలోని పేరొందిన దర్శనీయ స్థలాలలో పాలధార–పంచధారలు ఒకటి. శ్రీశైల ప్రధానాలయానికి మూడు కిలోమీటర్ల దూరములో రహాదారిని అనుకొని ఎడమవైపుగల లోయ ప్రాంతమే పాలధార–పంచధార. రోడ్డుమార్గము నుంచి 146మెట్లను దిగి ఈ పాలధార–పంచధారలను చేరుకోవాల్సి ఉంటుంది.
నిరంతరం వెలువడే జలధారలు:
పాలధార–పంచధారల వద్ద కొండరాళ్ల మధ్య నుంచి ఒక జలధార, మరోకచోట ఐదు జలధారలు ప్రవహిస్తుంటాయి. ఎండా వానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తుండడం ఈ జలధారల విశేషం. క్షణకాల సందర్శనతో క్షణాలను మరిపించే ఈ దివ్యస్థల సందర్శనతో భక్తులు ముగ్దులవుతారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పాలధార–పంచధారలను తప్పనిసరిగా సందర్శిస్తుంటారు.
ఆదిదేవుడి నుంచి అవిర్బావం:
ఆదిదేవుడైన పరమేశ్వరుడి నుంచే ఈ పాలధార–పంచధారలు ఉద్బవించాయని చెప్తుంటారు. పరమశివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘెర, తత్పురుష, ఈశాన్య ముఖాల నుంచి ఉద్భవించినవే పంచధారలని చెబుతారు. ఈ జలధారల ప్రవాహతీరులో ఎంతో విశేషం కూడా ఉంది. నిరంతరం వెలువడే ఈ జలధారలు ముందుకు ప్రవహించకుండా అక్కడికక్కడే అంతరించి పోవడం అశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా ఈ జలధారలు తెల్లగా కనిపించడం వల్ల కొందరు దీన్ని పాలధార–పంచధార అని కూడా పిలుస్తారు. మన ప్రాచీన కావ్యాలు ఈ పాలధార–పంచధారలను పావనతీర్థంగా అభివర్ణించాయి.
ఆ జలంతో రోగ నివారణ:
ఔషధీ సమ్మిళతమైన పాలధార–పంచధారల నీటికి రోగాన్ని నివారించే శక్తి ఉందనే భావన చాలా ప్రసిద్దంగా ఉంది. ఇప్పటికే కొందరు పాలధార–పంచధార జలాలలను పవిత్ర తీర్థగంగగా భావించి రోగాల నివారణకు వాడుతుంటారు.
Comments
Please login to add a commentAdd a comment