శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న అమిత్‌ షా | Union Home Minister Amit Shah Srisailam Tour | Sakshi
Sakshi News home page

శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్న అమిత్‌ షా

Aug 12 2021 11:59 AM | Updated on Aug 12 2021 3:08 PM

Union Home Minister Amit Shah Srisailam Tour - Sakshi

తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్‌, అధికారులు అమిత్‌ షాకు ఘన స్వాగతం పలికారు.

సాక్షి, హైదరాబాద్‌/కర్నూలు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామివారిని గురువారం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి  అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సున్నిపెంట చేరుకున్నారు. అమిత్‌ షాకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్‌, అధికారులు ఘన స్వాగతం పలికారు.

అక్కడ నుంచి అమిత్‌ షా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భ్రమరాంబ అతిథిగృహంలో అమిత్ షా మధ్యాహ్న భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు అమిత్ షా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement