ఆదిమానవుల సమాధుల పరిశీలన
మునుగోడు:
మండలంలోని వివిధ గ్రామాల్లో బయల్పడిన ఆదిమానవుల ఆనవాళ్లను తెలుసుకునేందుకు పురావస్తుశాస్త్ర వేత్తలతో పరిశీలింపచేస్తానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని ఇప్పర్తి గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆదిమానవుల సమాధులు, ఎముకలను పరిశీలించారు. ఒక్కొకరికి దాదాపు పదిగుంటల భూమిలో సమాధి కట్టడాన్ని చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, చీకటిమామిడి, గుండ్లోరిగూడెం గ్రామాల్లో ఆదిమానవులు నివాసం ఉండేవారని, తనకు పెద్దలు చెప్పారన్నారు. త్వరలో పరిశీలింపచేసి అందులో లభించిన వస్తువులను మ్యూజియంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.