Munugode Bypoll 2022: K. A. Paul: We Will Win Munugode Bypoll With Big Majority - Sakshi
Sakshi News home page

మునుగోడులో 50వేల మెజార్టీతో గెలవబోతున్నా: కేఎ పాల్

Published Wed, Nov 2 2022 7:56 AM | Last Updated on Wed, Nov 2 2022 11:45 AM

We Will Win In Munugodu Bypoll With 50 Majority - Sakshi

నల్గొండ: 50వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ తెలిపారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో మంగళవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలివైన మునుగోడు ప్రజలు తనకే అండగా ఉన్నారని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్‌లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రజలు ప్రధాన పార్టీలను ఓడిస్తారని తెలిపారు.

 తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానన్నారు. హైదరాబాద్‌కు తాను ప్రపంచ స్థాయి కంపెనీలు తీసుకురావడంతో అభివృద్ధి చెందిందని.. అదే మాదిరిగా మునుగోడుకు సైతం తీసుకొస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100–112 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలకు పెట్టిన ఖర్చు మునుగోడుకు ఇస్తే ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా తాను విజయం సాధిస్తున్నానని తెలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన బహిరంగ సభను రద్దు చేసుకున్నాడని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం కేసీఆర్‌ చేసిందేమీ లేదని, ఆ సామాజిక వర్గం టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. వారంతా తనకే మద్దతుగా ఉన్నారని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement