రెండు రోజుల్లో మునుగోడు అభ్యర్థి ఖరారు  | Etala Rajender about munugodu candidate | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో మునుగోడు అభ్యర్థి ఖరారు 

Published Sun, Oct 29 2023 4:05 AM | Last Updated on Sun, Oct 29 2023 4:05 AM

 Etala Rajender about munugodu candidate - Sakshi

చౌటుప్పల్‌: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని రెండు రోజుల్లో ఖరారు చేస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ తెలిపారు. అందరికీ అమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలోకి దింపుతామని చెప్పారు. మునుగోడు అభ్యర్థిని త్వరగా ఖరారు చేయాలని కోరుతూ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు.

రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌బన్సల్, ఈటలను వారు కలిశారు. ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈటల ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.

ఆలస్యం జరగకుండా అభ్యర్థి ప్రకటన ఉంటుందన్నారు. కార్యకర్తలంతా పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్‌ దూడల భిక్షంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement