జెరూసలేం: జెరూసలేంలో 2,700 సంవత్సరాల నాటి పురాతన టాయిలెట్‌ను ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరాలలో బెరూసలేం ఒకటన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలను ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ విడుదల చేయడంతో పవిత్ర నగరమైన జెరూసలేంలో 2,700 సంవత్సరాల క్రితం కూడా ప్రైవేటు బాత్‌రూమ్‌లు ఉండేవని తేలింది. ఆ టాయిలెట్ కింద లోతైన సెప్టెక్ ట్యాంక్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పురాతన కాలంలో టాయిలెట్ క్యూబికల్ నిర్మించడం చాలా అరుదైన విషయమని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ అధికారి తెలిపారు. అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి మరుగుదొడ్లను కొనుగోలు చేసేవారని చెప్పారు. టాయిలెట్ కింద ఉన్న సెప్టిక్ ట్యాంకులోని జంతువుల ఎముకలతో పటు లభించిన పలు వస్తువల ఆధారంగా ఆ సమయంలో నివశించిన వ్యక్తుల జీవనశైలితో పాటు అప్పటి వ్యాధులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జెరూసలేంలోని అర్మోన్ హనాట్జీవ్ విహార ప్రదేశంలో పెద్ద ఎస్టేట్ ఉన్న ప్రదేశంలో ఈ టాయిలెట్‌ను కనుగొన్నారు. కాగా ఈ టాయిలెట్ సెట్‌ను అధికారులు పురావస్తు సదస్సులో ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు, అయితే అది వీక్షించడానికి మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment