ఉత్సాహంగా రాతిదూలం పోటీలు
అనంతపురం రూరల్ : ఉప్పరపల్లి పాలవేరు వీరనాగమ్మ అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు ఉత్సహంగా సాగాయి. ఒంగోలు పాలపళ్ల జాతి గిత్తలు పోటీల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చాయి. రాజీవ్‌కాలనీ ఓబుళపతి ఆచారి వృషభాలు ప్రథమ, జనశక్తినగర్ హనుమంతరెడ్డి వృషభాలు ద్వితీయ, చాగల్లు ఆదినారాయణ వృషభాలు తృతీయ బహుమతి, ముదిగుబ్బ రాజగోపాల్ వృషభాలు నాలుగో స్థానంలో నిలిచాయి.
విజేత వృషభాల యజమానులకు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5వేలు చొప్పున ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. పోటీలను తిలకించేందుకు వచ్చిన వారికి అన్నదానం నిర్వహించారు. సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి బండ లాగుడు పోటీలకు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వృషభాలు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం వీరనాగమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో ఊరేగించారు.