సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో మరో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. ఉప్పర్‌పల్లిలోని హ్యాపీ హోమ్స్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ముగ్గురు విటులను సైతం కటకటాల వెనక్కి నెట్టారు. పాతబస్తీకి చెందిన నిషా ఖాన్ అనే మహిళను ముఠా లీడర్‌గా గుర్తించారు. గతంలో పలుమార్లు వ్యభిచార కేసుల్లో పట్టుబడిన నిషాఖాన్.....ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యవభిచారం చేయిస్తోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన సదరు బాలిక.....ఆ నరకకూపం నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. నిర్వాహకురాలు నిషాఖాన్‌తో పాటు....అందుకు సహకరించిన పహాడీ షరీఫ్‌కు చెందిన తహసీన్ ఫాతిమా , సభా అనే మరో ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి....మైనర్ బాలికను నరకకూపంలోకి దింపారు.
మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి
సికింద్రాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ సందర్భంగా హోటల్‌లో పేకాట ఆడుతున్న 38మందిని అదుపులో తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ శశిధర్ రాజు తెలిపారు. నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. హోటల్లో మూడు గదులను ఆర్గనైజర్స్ బుక్ చేసుకున్నారని, సంజయ్ అనే ఆర్గనైజర్‌తో పాటు మరో ఇద్దరు కూడా హోటల్లో వేరువేరుగా రూమ్స్ బుక్ చేసుకుని మూడు కార్డ్స్ గేమ్‌ను ఆడిస్తున్నారన్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.24 లక్షల నగదుతోపాటు 1800 క్యాసినో కాయిన్స్, 38 సెల్‌ఫోన్లు, మద్యం సీసాలు, హుక్కా పాట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో ముగ్గురు ఆర్గనైజర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. హోటల్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment