హైదరాబాద్: ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ్‌నగర్ వెంచర్-3 లో ఓ ఇంటిపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలు, మహిళతోపాటు ఓ విటుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారని పోలీస్ స్టేషన్కు తరలించారు.
పట్టుబడిన మహిళ లక్షల్లో వడ్డీ వ్యాపారం చేస్తుందని పోలీసులు తెలిపారు. కల్యాణ్నగర్లో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని ఆగంతకుడు పోలీసులకు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేశారు.