ఖమ్మం : పురాతన ఆలయంలో చోరీకి గురైన మూడు పంచలోహ విగ్రహాలను ఖమ్మం సీసీఎస్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని.. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఖమ్మం జిల్లా కోయచెలక గ్రామానికి చెందిన జంగాల వెంకన్న, ఏపూరి ప్రసాద్, గద్దల శ్యాం ముఠాగా ఏర్పడ్డారు. వరంగల్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామంలోని రంగనాయకుల ఆలయంలో గత నెల 15వ తేదీన రంగనాయకులస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను దొంగిలించి.. ఖమ్మం తీసుకొచ్చారు. తర్వాత కోయచలకకు తీసుకొచ్చి పొలంలో దాచారు. రంగనాయకుల విగ్రహానికి ఉన్న శంఖుచక్రాన్ని విడగొట్టి అమ్మడానికి తిరుగుతున్నారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. వెంటనే వారి వద్ద నుంచి మూడు పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.కోటికి పైగా ఉన్నట్లు తెలిసింది.
రూ.కోటి విలువైన విగ్రహాలు స్వాధీనం
Published Sat, Apr 2 2016 8:19 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement
Advertisement