ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
-
ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
డక్కిలి : మండలంలోని నాగవోలు పంచాయతీ మహాసముద్రం చిన్నచెరువు తూము వద్ద అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన 33 ఎర్ర చందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ ఆధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ హరనాథ్‌బాబు కథనం మేరకు... మహాసముద్రం ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలు దాచి ఉంచినట్లు అధికారులకు ముందుగా సమాచారం అందింది. దీంతో మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో డీఎస్పీ హరనాథ్‌బాబు తమ సిబ్బందితో గాలించగా చిన్న చెరువు తూములో 33 ఎర్రచందనం దుంగలు దాచి ఉంచడాన్ని గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ గాలింపుల్లో వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై జిలాని, టాస్క్‌ఫోర్స్ ఎస్సై హజావలీ, ఎఫ్‌ఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు.
ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్
మహాసముద్రం చిన్నచెరువు వద్ద అక్రమంగా దాచి ఉంచిన 33 ఎర్రచందనం దుంగలకు సంబంధించిన స్మగ్లర్లు అయిన అదే గ్రామానికి చెందిన కృష్ణయ్య, వెంకటగిరికి చెందిన కోండయ్య, సుమంత్‌ను అరెస్ట్ చేశారు. వారిని అని కోణాల్లో విచారిస్తున్నారు.