రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో ఓ బాలికపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
- పోలీసుల అదుపులో ముగ్గురు.. పరారీలో మరొకరు
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామంలో ఓ బాలికపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సీఐ మదన్‌మోహన్‌రెడ్డి కథ నం ప్రకారం.. మండల పరిధిలోని నానక్‌నగర్‌కు చెందిన ఓ బాలిక(17) మాల్‌లోని బంధువుల వద్ద ఉంటోంది. బుధవారంరాత్రి ఆమె బహిర్భూమి నిమిత్తం సమీపంలోని పొలంలోకి వెళ్ల అదే గ్రామానికి చెందిన చిన్నొళ్ల చిన్న(19), పెద్దొళ్ల విజయ్(19), గుడుకుట్ల శేఖర్(21), గుడుకుట్ల వెంకటేష్(19)లు అటకాయించి అత్యాచారం చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు గురువా రం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నింది తుడు చిన్నొళ్ల చిన్న పరారీలో ఉన్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నగరంలోని ఓ ఆస్పత్రికి పంపారు.