బోధన్‌రూరల్(బోధన్): మండలంలోని పెగడపల్లిలో భూ వివాదంతో అన్న భార్యను కర్రలతో దాడి చేసి హత్య చేసి న కేసులో ముగ్గరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బోధన్ రూరల్ సీఐ గోవర్ధన గిరి శనివారం తెలిపారు. పది గుంటల భూమి వివాదంతోనే నిందితుడు వదినను హత్యకు చేసి నట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నర్సవ్వ–బాలయ్యకు ఎల్లప్ప, లక్ష్మణ్ అనే ఇద్దరు కొడుకులు, లక్ష్మి(గంగామణి) కూతురు ఉంది. ఇద్ద రు కొడుకులు పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరు గా ఉంటున్నారు. అయితే నర్సవ్వ పెద్ద కొడుకు ఎల్లప్ప 2014లో భార్య గోంటి సావిత్రి, గోంటి యోగేష్ చేతిలో హత్య కు గురయ్యాడు. నర్సవ్వ భర్త బాలయ్య చనిపోవడంతో చిన్న కొడుకు లక్ష్మణ్ వద్ద ఉంటోంది. కూతురు లక్ష్మి పెళ్లి అ యినా పెగడాపల్లిలోనే ఉంటుంది.
ఈ క్రమంలోనే నర్సవ్వ పేరుపై ఉన్న 30 గుంటల భూమిలోనుంచి గ్రామ పెద్దలు చిన్న కొడుకు గోంటి లక్ష్మణ్‌కు 10 గుం టల భూమిని కేటాయించారు. మిగిలిన 20 గుంటల భూమిని నర్సవ్వను ఎవరు పోషిస్తే వారు సాగు చేసుకోవాలని సూచించారు. దీంతో లక్ష్మణ్ తల్లిని పోషిస్తూ, మంచి చెడులు చూస్తూ ఆ భూమి ని సాగు చేశాడు. అయితే పెద్ద కొడుకు ఎల్లప్ప భార్య సావిత్రి అందులో 10 గుంటల పొలం తమదని, దాన్ని ఇప్పిం చాలని అంటుండేది. దీంతో రెండు కుటుంబాలకు తరుచూ వివాదాలు అయ్యేవి. అయితే ఇటీవల లక్ష్మణ్ సాగు చేసిన పొలంలో పంటను నర్సవ్వ కోసి ఇంటికి తెచ్చుకుంది.
దీంతో లక్ష్మణ్ తల్లి నర్పవ్వ, అక్క లక్ష్మి కలిసి శుక్రవారం సావిత్రి ఇంటి వద్దకు వెళ్లి గొడవకు దిగారు. వారి మధ్య మాటమాట పెరిగి లక్ష్మణ్ వదిన సావిత్రి, ఆమె కొడుకు యోగేష్‌లపై కర్రలతో దాడి చేశాడు. సావిత్రి తలకు బలమైన గాయం కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. యోగేష్ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారని సీఐ తెలిపారు. సావిత్రి అన్న సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఈ కేసులో ఏ1 నిందితుడిగా గోంటి లక్ష్మణ్, ఏ2గా గోంటి లక్ష్మి, ఏ3గా గోంటి నర్సవ్వను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. కాగా యోగేశ్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment