
హైదరాబాద్ లో బ్రోతల్ హౌస్ గుట్టురట్టు!
హయత్‌నగర్: ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్రోతల్ హౌస్ గుట్టురట్టయింది. ఈ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ఓ మహిళ, విటున్ని అరెస్ట్ చేశారు. శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. గడిశె ప్రభావతి అనే మహిళ హయత్‌నగర్ డివిజన్‌లోని అరుణోదయనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. బహదూర్‌పురాకు చెందిన విటుడు గాదె నాగప్పతో పాటు ఓ మహిళను, నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు.