సాక్షి, వరంగల్: సీనియర్ ర్యాగింగ్, భరించలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మరువక ముందే.. కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ప్రకటించారు. ఏడాదిపాటు హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాటు మూడు నెలలపాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. మరో 20 మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలిపారు.
సెప్టెంబర్ 14వ తేదీన కేఎంసీ హాస్టల్‌లో ఓ జూనియర్‌పై సీనియర్‌లు ర్యాగింగ్ కు పాల్పడి దాడి చేసి గాయపర్చారు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ర్యాగింగ్ యాక్ట్ తోపాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు అయింది. ర్యాగింగ్ పై కేఎంసీ లో ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై.. ఆరుగంటల పాటు చర్చించింది. ర్యాగింగ్ నిర్ధారణ కావడంతో.. పాల్పడిన వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కమిటీ.
అయితే.. కేఎంసీలో ర్యాగింగ్ జరగడం ఇదే తొలిసారని ప్రిన్సిపల్ అంటున్నారు. ప్రీతి ఘటన డిపార్ట్మెంట్ లో జరిగిందని, ప్రస్తుతం హాస్టల్ లో జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన తీసుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. మొదటి తప్పుగా భావిస్తు మూడు నెలలు సస్పెండ్ చేయడంతో పాటు ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే.. హాస్టల్ లో బర్త్ డే పార్టీలు నిషేధించామన్నారు. దాడికి పాల్పడ్డ 7గురి పై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారి విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment