kmc Principal
-
కేఎంసీలో ర్యాగింగ్.. ఏడుగురిపై కఠిన చర్యలు
సాక్షి, వరంగల్: సీనియర్ ర్యాగింగ్, భరించలేక ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం మరువక ముందే.. కాకతీయ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ర్యాగింగ్‌కు పాల్పడిన ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్ దాస్ ప్రకటించారు. ఏడాదిపాటు హాస్టల్ నుంచి బహిష్కరించడంతో పాటు మూడు నెలలపాటు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి.. మరో 20 మంది విద్యార్థులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీన కేఎంసీ హాస్టల్లో ఓ జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడి దాడి చేసి గాయపర్చారు. ఆ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ర్యాగింగ్ యాక్ట్ తోపాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు అయింది. ర్యాగింగ్ పై కేఎంసీ లో ప్రిన్సిపల్ మోహన్ దాస్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై.. ఆరుగంటల పాటు చర్చించింది. ర్యాగింగ్ నిర్ధారణ కావడంతో.. పాల్పడిన వైద్య విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది కమిటీ. అయితే.. కేఎంసీలో ర్యాగింగ్ జరగడం ఇదే తొలిసారని ప్రిన్సిపల్ అంటున్నారు. ప్రీతి ఘటన డిపార్ట్మెంట్ లో జరిగిందని, ప్రస్తుతం హాస్టల్ లో జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన తీసుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. మొదటి తప్పుగా భావిస్తు మూడు నెలలు సస్పెండ్ చేయడంతో పాటు ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే.. హాస్టల్ లో బర్త్ డే పార్టీలు నిషేధించామన్నారు. దాడికి పాల్పడ్డ 7గురి పై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో వారి విచారణ ఇంకా కొనసాగుతుందని ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. -
249 మంది వైద్య విద్యార్థులపై వేటు
ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వితీయ, తృతీయ ఏడాది చదువుతున్న 249 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. పరీక్షలు రాసేందుకు శుక్రవారం వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కేఎంసీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తృతీయ సంవత్సరానికి చెందిన 176 మంది ఎస్పీఎం సబ్జెక్టులో, ద్వితీయ సంవత్సరానికి చెందిన 15 మంది ఫార్మకాలజీలో, 18 మంది పథాలజీ, 40 మంది మైక్రోబయాలజీ తరగతులకు సక్రమంగా హాజరుకాలేదు. వారి హాజరు 75 శాతం కంటే తక్కువగా ఉండటంతో పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవగా.. పోలీసులు వారికి నచ్చజెప్పి సామరస్య పూర్వకంగా పరిశీలించుకోవాలన్నారు. విద్యార్థుల విన్నపాన్ని పరిశీలిస్తాం ఆయా విభాగాల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటం వల్లే పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించాం. ఈనెల 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. హాజరు శాతంపై ఆయా విభాగాధిపతులతో చర్చించాం. విద్యార్థుల విన్నపాన్ని పరిశీలిస్తాం. విద్యార్థులు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంధ్య, ప్రిన్సిపాల్, కేఎంసీ -
మెడికల్ సీట్లు కాపాడుకోవాలి
- ఎంసీఐ తనిఖీ మళ్లీ జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదన - పరికరాలు, వైద్యుల కొరతపై స్పష్టత ఇవ్వండి - కేఎంసీ సమీక్ష సమావేశంలో డీఎంఈ పుట్ట శ్రీను. ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో పెరిగిన సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు, వైద్య సిబ్బంది విషయంలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) చేసిన తనిఖీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు డీఎంఈ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలలో ఆదివారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్, కేఎంసీ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ ఎస్. రమేశ్ ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంజీఎం ఆస్పత్రితోపాటు మెడికల్ కళాశాలలో ఎంసీఐ తనిఖీలు నిర్వహించిన సమయంలో పెరిగిన 50 సీట్లకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేదని వారు అభిప్రాయపడినట్లు ఆయన వెల్లడించారు. తనిఖీల సందర్భంగా నిజామాబాద్‌లో 100 సీట్లు, గాంధీ ఆస్పత్రిలో 50 సీట్లు, కేఎంసీలో కూడా మరికొన్ని సీట్లు కోల్పోయే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేఎంసీలో సీట్లు కోల్పోకుండా ఉండేందుకు లోటుపాట్లను సవరించి తిరిగి ఎంసీఐ తనిఖీ నిర్వహించేలా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ల సంఖ్య మెడికల్ సీట్లకు తగినట్లుగా లేదని, వైద్యసిబ్బంది కొరత కూడా ఉందని, కళాశాల పరిధిలో విద్యార్థులకు 8 లెక్చరర్స్ హాల్స్ ఉండాల్సి ఉండగా నాలుగు మాత్రమే ఉన్నావని, పరికరాల కొరత తీవ్రంగా ఉందని ఎంసీఐ తన నివేదికలో పేర్కొనట్లు ఆయన తెలిపారు. వెంటనే ఆయా విభాగాలకు కావాల్సిన పరికరాల వివరాలతోపాటు సిబ్బంది కొరతను తనకు వెంటనే నివేదించాలని ఆయా విభాగాధిపతులను ఆదేశించారు. క్యాన్సర్ ఆస్పత్రి కోసం ప్రతిపాదనలు జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని కేఎంసీ ప్రిన్సిపాల్‌ను డీఎంఈ పుట్ట శ్రీనివాస్ ఆదేశించారు. వరంగల్‌లో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన వెల్లడించారు. ఎంజీఎం ఆస్పత్రిలో గత 11 నెలలుగా క్యాన్సర్ విభాగం మూతపడిన విషయాన్ని వైద్యులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయూలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థులు డీఎంఈని కలిసి తమకున్న సమస్యలను వివరించారు. డీఎంఈ వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.