ర్యాగింగ్ చేసిన యువకుడు
శ్రీకాళహస్తి: ర్యాగింగ్ చేసిన ఓ యువకుడికి బాలిక తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన శ్రీకాళహస్తి పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని కైలాసరిగి కాలనీ ప్రాంతానికి చెందిన బాలికలు పాఠశాలకు వెళ్లి వస్తుంటే రెండు రోజులుగా కొందరు యువకులు వారిని ర్యాగింగ్ చేస్తూ ఇబ్బంది పెట్టారు. దాంతో బాలికలు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు సోమవారం కాపు కాసి వారిలో ఒకరిని పట్టుకున్నారు. చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు. ఆ యువకుడితో పాటు ఉన్న వ్యక్తులు ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఆ యువకుడు కేవీబీపురం మండలానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment