Sumedha
-
యాక్సిడెంటల్ డెత్: సుమేధ ఘటనపై కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్
సాక్షి, నేరేడ్మెట్: వినాయకనగర్ డివిజన్ దీనదయాళ్నగర్ కాలనీలో గత ఏడాది ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన 12 ఏళ్ల బాలిక సుమేధ కేసులో ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. కేసుపై సోమవారం మల్కాజిగిరి కోర్టులో బాలిక తల్లి సుకన్య కపూరియా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ‘యాక్సిడెంటల్ డెత్’గా నివేదిక ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తిరిగి విచారణ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుమేధ తల్లి కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్‌ను వేశారు. చదవండి: జోగులాంబ గద్వాల్లో ఎస్సై వీరంగం.. వీడియో వైరల్ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 20కి కోర్టు వాయిదా వేసింది. ఈ ఘటనపై మల్కాజిగిరి డీఈఈ, ఏఈఈతోపాటు మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, అప్పటి మేయర్ బొంతురాంమోహన్ తదితరులపై నేరేడ్మెట్ ఠాణాలో అప్పట్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: ఎస్ఐ కోచింగ్ సెంటర్లో పరిచయం.. వంచించి, అబార్షన్ ట్యాబ్లెట్లు వేసి.. -
మంత్రి కేటీఆర్, మేయర్‌పై సుమేధ తల్లి ఫిర్యాదు
నేరేడ్మెట్ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రాంమోహన్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ఎమ్మెల్మే, కార్పొరేటర్లపై ఇటీవల మృతి చెందిన చిన్నారి సుమేధ కపూరియా తల్లి సుకన్య కపూరియ నేరేడ్మెట్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. వర్షా కాలంలో ఓపెన్‌నాలాలు పొంగి ప్రవహించడం వల్ల ఈస్ట్‌దీనదయాళ్‌నగర్ కాలనీతో వరదనీటితో ముంపునకు గురవుతుందన్నారు. ఓపెన్ నాలాల సమస్యను పరిష్కారించాలని ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. గతంలో ఓగర్భిణి నాలాలో పడి కొట్టుకుపోతుంటే స్థానికులు కాపాడారని, ఈనెల 17న తన కూరుతు సుమేధ నాలాలో పడి మరణించిందన్నారు. కేటీఆర్, మేయర్, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం,బాధ్యతారాహిత్యమే తన కూతురు మృతికి కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలనిఫిర్యాదులో పేర్కొన్నారు. సుమేధ తల్లి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు దర్యాప్తు చేస్తామని సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు. -
సుమేధ మృతి: మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ నాలాలో పడి మృతి చెందిన సుమేధ కపూరియా (12) తల్లిదండ్రులు సోమవారం నేరేడ్మెట్ పోలీసులను కలిశారు. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ.. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్, సంబంధిత ఏఈ, డీఈలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వీరందరిపై ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేయాలని ఈ మేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. కాగా, నేరేడ్మెట్లోని కాకతీయ నగర్లో నివాసముండే అభిజిత్, సుకన్య దంపతుల కుమార్తె సుమేధ గత గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లింది. దీన్‌దయాళ్ నగర్‌లోని ఓపెన్ నాలాలో ప్రమాదవశాత్తూ పడి మరణించింది. వరద ఉధృతికి బాలిక మృతదేహం బండచెరువుకు కొట్టుకొచ్చింది. (చదవండి: ‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’) (చదవండి: ఉసురు తీసిన నాలా) -
‘ఆ ప్రాంతంలో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు’
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు కడుపుకోత మిగిలిందని సుమేధ కపూరియా తల్లిదండ్రులు సుకన్య, అభిజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగొద్దని అన్నారు. ఆదివారం వారు ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మా కూతురు ప్రాణాలు కోల్పోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం. సుమేధ మృతిపై మానవ హక్కుల సంఘం స్పందించినందుకు ధన్యవాదాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలా మూసివేయాలి. మా కూతురు మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వారు ఆలోచించుకోవాలి. తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారు. నాలా కారణంగానే మా బిడ్డ మరణించడం అధికారుల వైఫల్యం కాదా? అభివృద్ధి చేయలేనప్పడు ట్యాక్సులు ఎందుకు వసూలు చేస్తున్నారు. మా కూతురు ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు. కాలనీలో ఒక్క సీసీ కెమెరా లేదు. ఘటన జరిన ప్రాంతంలో చుట్టుపక్కల ఒక్క సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోవడం బాధ్యతారాహిత్యం కాదా?’అని సుమేధ తల్లిదండ్రులు ప్రశ్నించారు. కాగా, నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్లో నివాసముండే 12 ఏళ్ల సుమేధ సైకిల్ తొక్కుకుంటూ బయటికెళ్లి ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడిపోడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వరద ఉధృతికి సుమేధ మృతదేహం స్థానికంగా ఉండే బండ చెరువుకు కొట్టుకెళ్లింది. (చదవండి: ఉసురు తీసిన నాలా ) -
లోయలో పడిన బస్సు : 17 మంది మృతి
హిమాచల్‌ప్రదేశ్ సిమౌర్ జిల్లా మైలా గ్రామ సమీపంలో బుధవారం బస్సు లోయలో పడింది. ఆ దుర్ఘటనలో 17 మంది ప్రయాణికులు మరణించగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఎస్పీ సుమేథా వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని పొనాట సాహిబ్ ఆసుపత్రికి తరలించి ప్రాధమిక చికిత్స అందించామని తెలిపారు. అనంతరం వారని మెరుగైన వైద్య చికిత్స కోసం షిల్లై ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే క్షతగాత్రులలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని... చంఢీగఢ్లోని పీజీఐ ఆసుపత్రికి వారిని తరలించాలని వైద్యులు సూచించారని, ఈ నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా.... ఇంకో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. బస్సు మిలా నుంచి పనోటా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎస్పీ సుమేధా వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.