warning letter
-
ఇన్ఫోసిస్‌కి సెబీ వార్నింగ్! ఏం జరిగింది?
SEBI warning letter to Infosys: దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పాలనాపరమైన హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ (ఎస్డీడీ)లో జాప్యం జరుగుతుండటంపై హెచ్చరించింది. ‘ఎస్‌డీడీలో కొన్ని ఎంట్రీలు ఆలస్యంగా నమోదయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు క్యాంపస్‌ల నుంచి కాకుండా వారి ఇళ్ల వద్ద నుంచే పని చేస్తున్న సమయంలో ఇన్పోసిస్ దీన్ని సమర్పించింది. అందువల్ల, ఈ రికార్డులను సమన్వయం చేయడం, నిర్వహించడం కష్టమైంది. అప్పుడు యూపీఎస్ఐకి సంబంధించిన సమాచారం కంపెనీ వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, ఎస్డీడీ సిస్టమ్‌లో నవీకరించడం ఆలస్యం అయింది’ అని ఆగస్ట్ 9న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ పేర్కొంది. అయితే, ఈ వాదనను అంగీకరించడం లేదని సెబీ తెలిపింది. సెబీ వార్నింగ్ లెటర్ ఎస్డీడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్ఫోసిస్‌కు పంపిన లేఖలో హెచ్చరించింది. ఎస్‌డీడీలో సమాచారం సరిగ్గా ఉండేలా ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉందంది. ఇందులో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇకపై ఎస్డీడీ నిర్వహణకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎస్డీడీ అంటే ఏమిటి? స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ లేదా ఎస్డీడీ అనేది వ్యక్తులు లేదా సంస్థ పేర్లకు సంబంధించిన సమాచారం. ఈ సమాచారాన్ని ప్రచురించడానికి వీలులేని విలువైన సున్నితమైన సమాచారం (యూపీఎస్‌ఐ)గా పేర్కొంటారు. దీన్ని సెబీ అంతర్గత ట్రేడింగ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ భావన సెబీ (ప్రోహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్) రెగ్యులేషన్స్, 2015 నుంచి ఉద్భవించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇదీ చదవండి: ఐటీ జాబ్ ఇంటర్వ్యూ మరి.. కుప్పలు కుప్పలుగా వచ్చారు! వీడియో వైరల్ కాగా సెబీ లేఖ వల్ల ఎలాంటి ఆర్థిక ప్రభావం లేదని ఇన్ఫోసిస్ చెప్పింది. సుపరిపాలనలో భాగంగా అసంపూర్తిగా ఉన్న ఎస్డీడీ రికార్డులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ వల్ల కంపెనీ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఇన్ఫోసిస్ పేర్కొంది. -
రైల్వే ప్రమాదంపై బెదిరింపు లేఖ.. పోలీసుల అదుపులో ఆగంతకుడు!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్రైలుకు మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. షాట్ సర్క్యూట్‌తో బోగీలకు మంటలు చెలరేగడంతో బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్య రైలును ఆపేశారు. అప్రమత్తమైన ప్రయాణికులు ట్రైన్ దిగి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వేకు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖ రాసిన విషయం తెలిసిందే. త్వరలో ఘోర రైలు ప్రమాదం జరుగుతుందని లేఖలో రైల్వే అధికారులను హెచ్చరించాడు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ – ఢిల్లీ మార్గంలో ఘటన జరుగుతుందని హెచ్చరించాడు. అయితే, ఆగంతకుడి నుంచి గతవారం హెచ్చరిక లేఖ రైల్వే అధికారులకు అందింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ లేఖపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, అతడిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి లేఖకు సంబంధంలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ఫలక్నామా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. ఇది కూడా చదవండి: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. 3 బోగీలు దగ్ధం -
ఖమ్మంలో బెదిరింపు లేఖ కలకలం.. శవాలు కూడా మిగలవంటూ..
సాక్షి, ఖమ్మం: ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ సభ, హస్తం పార్టీలోకి కీలక నేతలు చేరుతున్న సందర్బంగా పోస్టర్ల కలకలం చోటుచేసుకుంది. పొంగులేటితో పాటు ఆయన అనుచరులను టార్గెట్ చేస్తూ పోస్టర్లు కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. పొంగులేటి ఖబడ్దార్ అంటూ పోస్టర్లలో రాసి ఉండటం సంచలనంగా మారింది. మరోవైపు.. పొంగులేటి అనుచరుడు డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వ విజయబాబుకు వార్నింగ్ లేఖ కూడా వచ్చింది. ఇక, ఆ లేఖలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకుని క్షమించమని అడగాలంటూ హెచ్చరించారు. చీకటి కార్తిక్‌కు పట్టిన గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో వారి శవాలు కూడా దొరకవు అంటూ రాసుకొచ్చారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సభ వేళ బీఆర్ఎస్ బిగ్ షాక్ -
జడ్జినే బెదిరించాడు!
జైపూర్: మార్ఫ్డ్ ఫొటోలను పంపి రూ.20 లక్షలివ్వకుంటే వాటిని బయటపెడతామంటూ మహిళా జడ్జిని బెదిరించిన ఘటన రాజస్తాన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగంతకుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన ఓ మహిళా జడ్జికి ఫిబ్రవరి 7న ఒక పార్సిల్ వచ్చింది. జడ్జి పిల్లలు చదివే స్కూలు నుంచి వచ్చిందంటూ ఓ అగంతకుడు పార్సిల్‌ను కోర్టు స్టెనోగ్రాఫర్‌కు ఇచ్చాడు. పేరు అడగ్గా చెప్పకుండానే వెళ్లిపోయాడు. ఆ పార్సిల్లో కొన్ని స్వీట్లతోపాటు అభ్యంతరకరంగా ఉన్న జడ్జి ఫొటోలు కనిపించాయి. రూ.20 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫొటోలను ఆన్లైన్లో పెట్టి పరువు తీస్తాననే హెచ్చరికతో కూడిన ఉత్తరం ఉంది. జడ్జి చాంబర్‌లోని సీసీ కెమెరాలో ఓ 20 ఏళ్ల యువకుడు పార్సిల్ తెచ్చినట్లుగా రికార్డయింది. మరో 20 రోజుల తర్వాత జడ్జి ఇంటికి మళ్లీ ఒక పార్సిల్ వచ్చింది. ‘రూ.20 లక్షలు సిద్ధంగా ఉంచు. సమయం, ప్రాంతం త్వరలోనే చెబుతా’అంటూ లేఖ ఉంది. బాధిత న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిబ్రవరి 28వ తేదీన కేసు నమోదు చేశారు. ఆగంతకుడిని గుర్తించామని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గెహ్లోత్ వర్గంపై హైకమాండ్ సీరియస్..!
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ అంతర్గత విషయాలు, ఇతర నేతలపై బహిరంగ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ సీనియర్ సెంట్రల్ లీడర్ కేసీ వేణుగోపాల్ లేఖ పంపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసు నుంచి గెహ్లోత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే హెచ్చరికలు పంపటం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇతర నేతలకు వ్యతిరేకంగా, పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగ ప్రకటనలు చేయటానికి దూరంగా ఉండాలని పార్టీనేతలకు సూచిస్తున్నాం. ఎవరైనా హైకమాండ్ హెచ్చరికలను బేఖాతరు చేస్తే పార్టీ నిబంధనల మేరకు కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.’ అని లేఖ రాశారు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్. సచిన్ పైలట్ వర్గం నేత వేద్ ప్రకాశ్ సొలంకిపై ఆరోపణలు చేస్తూ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ధర్మేంద్ర రాథోడ్ ఓ వీడియో విడుదల చేయటంపై ఇప్పటికే క్రమశిక్షణ నోటీసులు ఇచ్చింది హైకమాండ్. ఈ అంశంపై గెహ్లోత్ వర్గం విలేకరుల సమావేశం నిర్వహించిన కొద్ది సేపటికే.. హెచ్చరిక లేఖ పంపారు కేసీ వేణుగోపాల్. ఇదీ చదవండి: దిగ్విజయ్‌తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు -
నాలుక కోస్తా.. బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ లెటర్ కలకలం
కర్నాటకలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వేడి ఇంకా చల్లరలేదు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో టిప్పు సుల్తాన్, వీడీ సావర్కర్ల ఫొటోలు ఉండడం.. తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప.. ముస్లిం యువకులను టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరప్పకు తాజాగా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. టిప్పు సుల్తాన్‌ను మరోసారి ‘ముస్లిం గుండా’ అని పిలిస్తే నాలుక కోస్తానని బెదిరింపు లేఖలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఈశ్వరప్ప పోలీసులను ఆశ్రయించి.. బెదిరింపు లేఖపై స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే ఈశ్వరప్ప మాట్లాడుతూ..‘ముస్లిం పెద్దలకు నేను చెప్పేది ఒక్కటే.. ముస్లింలందరూ గుండాలు అని అనలేదు. ముస్లిం సమాజంలోని పెద్దలు గతంలో శాంతి కోసం ప్రయత్నాలు చేశారు. కొందరు యువత గుండాయిజంలో మునిగిపోతున్నారు. వారికి మాత్రమే సలహా ఇవ్వాలని నేను చెప్పాలనుకుంటున్నాను. లేని పక్షంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని ఈశ్వరప్ప కౌంటర్ ఇచ్చారు. #Karnataka BJP MLA KS Eshwarappa files complaint after receiving threat letter over his remarks on #TipuSultan.https://t.co/fiIML4qsi5 — TIMES NOW (@TimesNow) August 25, 2022 ఇది కూడా చదవండి: స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు -
డెల్టా కంటే 3 రెట్లు వేగం.. ఒమిక్రాన్‌తో బహుపరాక్.. రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్‌ను మించి మూడురెట్ల వేగంతో వ్యాపిస్తున్న కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా డెల్టా వేరియంట్ ఉంది. తాజాగా, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయిన ఒమిక్రాన్ అందుకు మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రస్తుతం ఆధారాలున్నాయి. అందుకే, అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తత, డేటా ఎనాలిసిస్, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం, కంటైన్మెంట్ విషయంలో చురుగ్గా ఉండాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘వార్‌రూంలను క్రియాశీలకం చేయాలి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేసుల్లో చిన్నపాటి పెరుగుదల కనిపించిన ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలి. జిల్లా, స్థానిక స్థాయిల్లో కంటెయిన్మెంట్ చర్యలను కట్టుదిట్టం చేయాలి. అవసరమైన చోట్ల రాత్రి కర్ఫ్యూ విధించాలి. పెళ్లిళ్లు, ఉత్సవాల్లో ప్రజలు భారీగా గుమికూడకుండా నియంత్రించాలి. వైరస్ బాధితుల హోం ఐసోలేషన్ సమయంలో నిబంధనలను తు.చ.తప్పకుండా పాటించాలి’అని ఆయన పేర్కొన్నారు. ‘డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్హులైన మొదటి, రెండో డోస్ లబ్ధిదారులందరికీ టీకా వేగంగా అందేలా చూడాలి. వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి’అని ఆయన కోరారు. గత వారం రోజులుగా టెస్ట్ పాజిటివిటీ రేటు 10%, అంతకంటే ఎక్కువగా ఉన్న, ఐసీయూ బెడ్ ఆక్యుపెన్సీ 40%, ఆపైన ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. క్లస్టర్లలో సేకరించిన శాంపిళ్లను తక్షణమే తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఇన్సాకాగ్ ల్యాబ్‌లకు పంపాలన్నారు. ప్రస్తుతం పిల్లలకు టీకా అక్కర్లేదు ప్రస్తుతానికి దేశంలో చిన్నారులకు కోవిడ్–19 టీకా అవసరం లేదని వ్యాధి నిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్టీఏజీఐ వర్కింగ్ గ్రూప్‌లో నిర్ణయించినట్లు పేర్కొంది. ‘పిల్లలకు కోవిడ్ ముప్పు అంతగా లేదు. అందుకే, చిన్నారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అవసరం లేదు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాం’అని మంగళవారం ఎన్టీఏజీఐ తెలిపింది. -
ఏజెంట్లకు మావోయిస్టు బెదిరింపు లేఖ!
సాక్షి, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన అమాయకులైన ఆదివాసీ వలస కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భద్రాచలానికి చెందిన కొందరు.. ఏజెంట్లుగా అవతారమెత్తి వారి శ్రమను డబ్బు రూపంలో దోచుకుంటున్నారని సీపీఐ (మావోయిస్టు) ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంత కమిటీ జోనల్ సెక్రటరీ గణేశ్ పేరుతో విడుదలైన లేఖలో పేర్కొన్నారు. సదరు ఏజెంట్లు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం భద్రాచలంలోని పత్రిక కార్యాలయాల ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ఈ లేఖలను కవర్లో పెట్టి విడిచి వెళ్లారు. లేఖలోని సారాంశం.. ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు పని కల్పిస్తామని వలస కార్మికులుగా మార్చి భద్రాచలానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏజెంట్లుగా మారారని, ఈ ఆదివాసీలను పనులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. వారి శ్రమను పెట్టుబడిగా మార్చుకొని ఈ ఐదుగురు వ్యక్తులు భద్రాచలంలో తమ ఆస్తులను విపరీతంగా పెంచుకుంటున్నారని, వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని తెలిపారు. అమాయక ఆదివాసీలకు కూలీ పనులు చూపెడతామంటూ ఇక్కడకి రప్పించి, వారిని పలు పనులకు గుండుగుత్తగా అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు. ఆదివాసీలకు భాష రాకపోవడం, కూలీ పనులకు ఎంత సొమ్ము చెల్లిస్తారో తెలియకపోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు పనికల్పించే వారితో కుమ్మక్కై వారికి చెల్లించే కూలీ సొమ్మును కూడా ఏజెంట్లే తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. కొన్ని సమయాల్లో కూలీ డబ్బులు అడిగితే ఈ ఆదివాసీ కూలీలను పశువుల కన్నా హీనంగా కొట్టి హింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఐదుగురు ఏజెంట్ల ఇంటి ఆవరణలో ఉన్న షెడ్లలో బంధించి సగం డబ్బులే ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్, పోలీసులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఈ ఐదుగురు ఏజెంట్లు రూ.కోట్లతో భవంతులు నిర్మించుకుంటున్నారని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దేశీ ఫార్మాకు ఎఫ్‌డీఏ జ్వరం..!
భారతీయ ఫార్మా కంపెనీలకు కామధేనువుగా ఉన్న అమెరికా... ఇప్పుడు చేదు గుళికలా మారుతోంది. అక్కడి ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)పరంగా చిక్కులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్లాంట్లలో తయారీ ప్రమాణాలు, ఔషధాల నాణ్యతకు సంబంధించి .. ఇటీవలి కాలంలో ఎఫ్‌డీఏ నుంచి వచ్చే హెచ్చరికలతో కంపెనీలకు షాక్‌లమీద షాక్ తగులుతోంది. గతేడాది 7 లెటర్స్ రాగా ఈ ఏడాది ఇప్పటిదాకా 12 వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యాపారాలకు రిస్కులను తగ్గించుకునే ప్రయత్నాలపై దృష్టి సారిస్తున్నాయి. ప్రధాన ఔషధాల ఉత్పత్తి, సరఫరాకు ఒకే సైటుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి దిగుమతులపై నిషేధం వర్తించేలా నోటీసులేమైనా వస్తే .. ఇబ్బందిపడకుండా ప్రత్యామ్నాయంగా తయారీ సైట్లను అభివృద్ధి చేసుకుంటున్నాయి. తమ దేశానికి దిగుమతయ్యే ఔషధాల నాణ్యత, వాటి తయారీ ప్రమాణాలను ఎఫ్‌డీఏ తరచూ సమీక్షిస్తుంది. ఆయా ఔషధాలు తయారయ్యే ప్లాంట్లలో తనిఖీలు నిర్వహిస్తుంది. అక్కడ పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, ఉల్లంఘనల తీవ్రతను బట్టి వివిధ స్థాయుల్లో నోటీసులు ఇస్తుంటుంది. అధికారికంగా తప్పనిసరిగా తీసుకోవాల్సిన చర్యలుంటే ఓఏఐ కింద, స్వచ్ఛందంగా అమలు చేయాల్సిన చర్యలుంటే వీఏఐ కింద, ఎలాంటి చర్యలు అవసరం లేకపోతే ఎన్ఏఐ కింద వర్గీకరిస్తూ తదనుగుణంగా లేఖలు పంపుతుంది. సాధారణంగా ఓఏఐ స్థాయి ఉల్లంఘనలు ఉంటే.. వార్నింగ్ లెటర్లు వస్తుంటాయి. సదరు ప్లాంటులో తయారు చేసే ఔషధాలకు సంబంధించి పేటెంట్లేమైనా పెండింగ్‌లో ఉన్న పక్షంలో.. ఈ వార్నింగ్ లెటర్ల ప్రతికూల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు.. తెలంగాణలోని అరబిందో ఫార్మా ఏడో యూనిట్‌కు సంబంధించి జారీ చేసిన ఫారం 483 (తనిఖీ నివేదిక వంటిది)లో ఎఫ్‌డీఏ ఏడు అంశాలను ప్రస్తావించింది. ఈ సైటు నుంచి 33 ఔషధాల తయారీకి అరబిందో చేసుకున్న దరఖాస్తులు ఎఫ్‌డీఏ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 483లో ప్రస్తావించిన తీవ్రమైన అంశాలకు సంబంధించి ఎఫ్‌డీఏ నుంచి మరిన్ని సూచనలు రావొచ్చని, తదుపరి వార్నింగ్ లెటర్.. ఆపై మరీ పరిస్థితి దిగజారితే దిగుమతి అలర్టులూ రావొచ్చని బ్రోకరేజి సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ పేర్కొంది. అయితే, అరబిందోకు ప్రత్యామ్నాయంగా చాలా ప్లాంట్లు ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా టోరెంట్‌కు లెటర్.. గురువారం టోరెంట్ ఫార్మాకు చెందిన ఇంద్రాద్ (గుజరాత్) ప్లాంటుకు ఇలాంటి వార్నింగ్ లెటరే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 నుంచి 16 దాకా ఈ ప్లాంటులో తనిఖీలు నిర్వహించిన ఎఫ్‌డీఏ ఆ తర్వాత దీన్ని జారీ చేసింది. ఔషధాల తయారీలో నిర్దేశిత ప్రమాణాలను పాటించడంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని అందులో పేర్కొన్నట్లు టోరెంట్ వెల్లడించింది. 2019 మార్చి 11–19 మధ్య దహేజ్ ప్లాంటులో కూడా ఇలాంటి ఉల్లంఘనలే కనిపించాయని, పలు సైట్లలో ఇలాంటివి బైటపడటం కంపెనీ యాజమాన్య వైఫల్యాన్ని తెలియజేస్తోందని ఎఫ్‌డీఏ వ్యాఖ్యానించింది. వీటిని సరిదిద్దుకోకపోతే ఇంద్రాద్ ప్లాంటులో తయారయ్యే ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది. రీకాల్స్తో సందేహాలు .. వాస్తవానికి.. దేశీ ఫార్మా కంపెనీలు పలు ఔషధాల బ్యాచ్‌లను గతేడాది వివిధ అంశాల కారణంగా వెనక్కి తెప్పించడం ఎఫ్‌డీఏ దృష్టిలో పడిందని విశ్లేషకులు తెలిపారు. అందుకే తనిఖీలను మరింతగా పెంచిందని పేర్కొన్నారు. 2018లో భారతీయ కంపెనీలు 58 రీకాల్స్ ప్రకటించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 87 శాతం అధికమని విశ్లేషకులు తెలిపారు. అంతే కాకుండా.. 2015–18 మధ్య కాలంలో జనరిక్ ఔషధాలకు అనుమతులు పెరగడంతో పోటీ కూడా తీవ్రంగా పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ జైన్ చెప్పారు. దీనితో ఎఫ్‌డీఏ తనిఖీలు కూడా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. దేశీ ఫార్మా కంపెనీలకు అత్యధికంగా 2017లో 16, 2015లో 17 వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. ఈ ఏడాది ఎఫ్‌డీఏ తనిఖీలకు సంబంధించి ఇప్పటిదాకా 12 వార్నింగ్ లెటర్స్ వచ్చాయి. ప్రత్యామ్నాయ సైట్లపై కసరత్తు.. ఇలాంటి పరిణామాలు ఎదురైతే వ్యాపారం దెబ్బతినకుండా చూసుకునేందుకు ఫార్మా కంపెనీలు కొన్నాళ్లుగా వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ఒకే ప్లాంటుపై ఆధారపడకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయ వనరులను కూడా అభివృద్ధి చేసుకోవడం కొనసాగిస్తున్నట్లు సిప్లా గ్లోబల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కేదార్ ఉపాధ్యే తెలిపారు. అహ్మదాబాద్ దగ్గర్లోని మొరాయాలోని క్యాడిలా హెల్త్‌కేర్ ప్లాంటుకు 2015 డిసెంబర్లో వార్నింగ్ లెటరు వచ్చింది. అప్పటికి అమెరికా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాల్లో ఆ ప్లాంటు వాటా 60 శాతం దాకా ఉండేది. లెటర్స్ దరిమిలా ఆ ప్లాంటులో కార్యకలాపాలు స్తంభించి, వ్యాపారం దెబ్బతినకుండా క్యాడిలా మొరాయా ప్లాంటులో తయారయ్యే 9 ఉత్పత్తులను ఇతర ప్లాంట్లకు మళ్లించింది. గ్లెన్‌మార్క్ కూడా బహుళ సైట్స్ వ్యూహాలను పాటిస్తోంది. -
టీఆర్ఎస్కు మావోయిస్టుల హెచ్చరిక
సాక్షి,కొత్తగూడెం: చర్ల మండలంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే నల్లూరి శ్రీనివాసరావును హతమార్చామని, పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తే ప్రజల చేతిలో శిక్ష తప్పదని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించారు. శ్రీనివాసరావును ఎస్బీ పోలీసులు ఇన్ఫార్మర్గా మార్చుకుని దళాల సమాచారం సేకరించేవారని, అలాగే ఆదివాసీల 80 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేసినం దునే చంపినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం లేఖను విడుదల చేశారు. ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, అధికారంలోకి వచ్చిన అనంతరం అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి హరితహారం పేరుతో అటవీశాఖ, పోలీసులతో పెద్ద ఎత్తున అటవీ భూములపై దాడులను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా కార్పొరేట్లు, భూస్వాముల కోసం సల్వాజుడం దాడులను కొనసాగిస్తున్నారన్నారు. కొమ్రం భీం జిల్లా కొత్త సార్సాల గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు, చెలిమన్ననగర్ గ్రామాల్లో అటవీ శాఖాధి కారులు, పోలీసులు ఆదివాసీలకు జీవనాధారమైన భూముల్లో బలవంతంగా ట్రాక్టర్లతో దున్ను తూ మొక్కలు నాటుతూ ఆదివాసీలను గెంటివేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు దాడులకు దిగాల్సి వచ్చిందన్నారు. దీనికి బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఇల్లెందు మండలం కోటగడ్డ, వీరాపురం, ముత్తారికట్ట, లక్ష్మీదేవిపల్లి మండలం ఇల్లెందు క్రాస్‌రోడ్, దమ్మపేట మం డలం బాలరాజుగూడెం, ఇల్లెందు, బయ్యారం, కారేపల్లి గ్రామాల్లో ఆదివాసీ రైతులను భూముల నుంచి గెంటివేస్తూ అటవీ అధికారులు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇచ్చిన భూముల్లో కూడా కందకాలు తవ్వి భూములను సాగు చేయకుండా ఆపారన్నారు. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి అడవిలో ఆదివాసీలు ఉడతలు పట్టుకున్నా.. ఉడుములు పట్టుకున్నా వేల రూపాయల జరిమానా విధిస్తూ జైళ్లలో పెడుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీ పాలకుల కుట్రలను, వాస్తవ విషయాలను ఆదివాసీలకు, పీడిత ప్రజలకు తెలియజేస్తూ ఉంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, పోలీసు అధికారులు ఆదివాసీలను మావోయిస్టు పార్టీ తప్పుదోవ పట్టిస్తున్న దని చెప్పడం దొంగే దొంగ అన్న చందంగా ఉంద న్నారు. అనేక గ్రామాల్లో ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అక్రమంగా అరెస్టులు చేసి తీవ్రమైన చిత్రహింసలకు గురిచేస్తున్నారని, మావోయిస్టు దళాలకు కొరియర్లుగా పనిచేస్తూ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఆహారం సప్లై చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులను చంపడానికి పెట్టిన బాంబులను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అరెస్టులు చేస్తున్నట్లు మహబూబాబాద్, జయశంకర్, భద్రాద్రి జిల్లాల ఎస్పీలు బూటకపు ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసు, అటవీ శాఖల అధికారులు హరితహారం పేరుతో దాడులను ఆపకపోతే, మావోయిస్టుల పేరుతో అక్రమ అరెస్టులను నిలిపి వేయకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ ప్రాంతంలో అధికంగా అడవులను నరికిన భూస్వాములు, రాజకీయ నాయకులు, పెత్తందారులు, ధనిక రైతుల చేతిలో ఎక్కువ భూములున్నాయన్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు కొనసాగించాలని జగన్ పిలుపునిచ్చారు. -
భారత్‌లో ఆ ప్రాంతాలకు వెళ్లకండి : చైనా
బీజింగ్ : భారత్‌లోని పలు నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లొద్దని తమ దేశ పౌరులను చైనా హెచ్చరించింది. చైనా పౌరులు ఇండియాలోని పలు నిషేధిత ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తూ జరిమానాలు చెల్లిస్తుండటంతోపాటు విచారణ ఎదుర్కోవడం అవసరం అయితే, జైళ్లకు కూడా వెళుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీ చేసింది. భారత్‌లోని స్థానిక చట్టాలను తప్పనిసరిగా గౌరవించాలని కూడా చైనా తమ పౌరులకు సూచించింది. ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం మణిపూర్‌లోని ఇండియా-మయన్మార్ సరిహద్దులో ఓ చైనీయుడిని గుఢాచారిగా అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా ఇలాంటి అరెస్టులు చాలా జరిగాయి. భారత స్థానిక చట్టాలను ఉల్లంఘించారని వారికి జరిమానాలు విధించడం, వీలయితే జైలులో పెట్టడం కూడా సమర్థంగా భారత్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఢిల్లీలోని చైనా విదేశాంగ కార్యాలయం మాండరిన్ భాషలో తమ పౌరులకు వార్నింగ్ నోటీసులు విడుదల చేసింది. తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో భారత్‌లోని నిషేధిత ప్రాంతాలకు వెళ్లవద్దని ఆ నోటీసులో కోరారు. అంతేకాకుండా నిషేధిత వస్తువులను కొనడంగానీ, దగ్గర పెట్టుకోవడంగానీ, చైనాకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దని ప్రత్యేకంగా అందులో సూచించింది. -
జనవరి 26న దాడిచేస్తాం: ఐసిస్ లేఖ కలకలం
సాక్షి,ముంబై: ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెదిరింపు లేఖ కలకలం రేపింది. 2018 జనవరి 26న దాడి చేస్తామంటూ ఐఎస్ఎస్ హెచ్చరించిన లేఖ కార్గో విమానంలో వెలుగు చూసింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్న విమానాశ్రయం పీఆర్వో వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ బెదిరింపు లేఖ అంశాన్ని ఎఎన్ఐ రిపోర్ట్ చేసింది. ముంబై విమానాశ్రయంలో కార్గో విమానం బాత్ రూంలో బుధవారం ఈ వార్నింగ్ లెటర్ దర్శనమిచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు. పోలీసులు, సీఐఎస్ఎప్ దళాలు రంగంలోకి దిగాయి. ప్రయాణీకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత మాత్రమే ప్రవేశానికి అనుమతినిస్తున్నారు. -
ఆ ఎమ్మెల్యేను బెదిరించింది బంధువులే
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురిని టేకులపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్పమత్తమైన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు ఆయన బంధువులు కావడం విశేషం. నిందితులు పూనెం బాలకృష్ణ, పూనెం ప్రకాష్, ఇర్ప కిషోర్‌లు చాలా సార్లు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరిస్తుండేవారు. తండ్రీకొడుకులైన బాలకృష్ణ, ప్రకాష్‌లు మరో నలుగురితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రూ. లక్ష ఇవ్వాలని ఎమ్మెల్యే కనకయ్యను డిమాండ్ చేస్తూ చంపుతామని హెచ్చరించారని వివరించారు. వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్‌కు వార్నింగ్..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోనే రెండో అతిపెద్ద ఔషద తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్‌కి శుక్రవారం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మూడు తయారీ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు సరిగ్గా లేవని హెచ్చరిస్తూ అమెరికాలోని మందుల నియంత్రణాధికార సంస్థ... యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) డాక్టర్ రెడ్డీస్‌కి లేఖ రాసింది. ఈ మేరకు వార్నింగ్ లెటర్ వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ మూడింట్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఏపీఐ యూనిట్, విశాఖపట్నంలోని దువ్వాడలో ఉన్న అంకాలజీ ఫార్ములేషన్ యూనిట్‌తో పాటు, తెలంగాణలోని మిర్యాలగూడలో ఉన్న ఏపీఐ యూనిట్ ఉన్నాయి. చిత్రమేంటంటే శ్రీకాకుళం యూనిట్‌లోని లోపాలను యూఎస్ఎఫ్డీఏ ఎత్తి చూపించి దాదాపు ఏడాది గడుస్తోంది. ఇంతవరకూ వాటిని సరిచేయటమో, దానిపై మరో నిర్ణయమో తీసుకోకుండానే సంస్థ నెట్టుకురావటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికితోడు ఇప్పుడు కొత్తగా మరో రెండు యూనిట్లకు ఏకంగా వార్నింగ్ నోటీసులే వచ్చాయి. ఈ హెచ్చరిక లేఖలకు కంపెనీ 15 రోజుల్లోగా తగు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ సమాధానానికి యూఎస్ఎఫ్డీఏ సంతృప్తి చెందితే సరి. లేని పక్షంలో ఈ యూనిట్లలో జరిగే ఉత్పత్తిని ఎగుమతి చేయకుండా నిషేధం విధిస్తూ యూఎస్ఎఫ్డీఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే కంపెనీ ప్రతిష్టతో పాటు ఆదాయంపై కూడా గణనీయమైన ప్రభావం పడుతుంది. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్‌కు వస్తున్న ఆదాయంలో 10 నుంచి 12 శాతం ఈ యూనిట్ల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. గడచిన ఏడాది డాక్టర్ రెడ్డీస్ ఆదాయం రూ.10,000 కోట్ల మార్కును అధిగమించగా... ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలానికి ఆదాయం రూ.5,423 కోట్లుగా ఉంది. ఆదాయంపై ప్రభావం లేదు.. కాగా ప్రస్తుతం జారీ చేసిన హెచ్చరిక లేఖ వల్ల కంపెనీ ఆదాయంపై ఎటువంటి ప్రభావం పడదని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. వీటికి సమాధానమివ్వడానికి 15 రోజుల సమయం ఉందని, ఈ లోగా ఎఫ్‌డీఏ లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇస్తామని డాక్టర్ రెడ్డీస్ సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. తాము సమాధానం ఇచ్చిన తర్వాత యూఎస్ ఎఫ్‌డీఏ మూడు యూనిట్లనూ పరిశీలించి క్లీన్చిట్ ఇస్తుందని భావిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి పేర్కొన్నారు. ఇన్వెస్టర్లలో ఆందోళన... ఏకంగా మూడు యూనిట్లలోని నాణ్యతా ప్రమాణాలను హెచ్చరిస్తూ యూఎస్ఎఫ్డీఏ లేఖ రాయడంపై ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. నవంబర్, 2014లోనే శ్రీకాకుళం యూని ట్లో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలపై యూఎస్ఎఫ్డీఏ 483 కింద అభ్యంతరాలు లేవనెత్తింది. ఆ తర్వాత యూఎస్ఎఫ్డీఏ జనవరి, 2015లో మిర్యాలగూడ, ఫిబ్రవరిలో దువ్వాడ యూని ట్లను సందర్శించింది. ఏడాది క్రితమే శ్రీకాకుళం యూనిట్లలో లేవనెత్తిన అబ్జర్వేషన్స్‌కు కంపెనీ తగురీతిలో సమాధానపరచకపోవటం... తాజాగా మరో రెండు యూనిట్లకు కూడా హెచ్చరికలు రావడంతో ఈ ఆందోళన మరింత తీవ్రమయ్యింది. దీంతో శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో డాక్టర్ రెడ్డీస్ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయించారు. కొనుగోళ్ల మద్దతు దొరక్కపోవటంతో షేరు ఒక్కరోజులోనే 15 శాతానికి పైగా నష్టపోయింది. షేరు ధర రూ. 623 నష్టపోయి (15 శాతం) రూ.3,629 వద్ద ముగిసింది. ఈ నష్టంతో ఈ కంపెనీ షేర్ హోల్డర్ల సంపద ఒక్కరోజులోనే దాదాపు రూ.10వేల కోట్ల మేర హరించుకుపోయింది. ఈ వ్యవహారంపై కంపెనీ ఎంత త్వరగా స్పందిస్తుందో, తక్షణం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో... వాటిపైనే కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ ఫార్మా ఎనలిస్ట్ సరబ్జిత్ కౌర్ చెప్పారు. -
వైసీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు
హైదరాబాద్: గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణారెడ్డికి ఇసుకు మాఫియా నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఇసుక వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఓ బెదిరింపు లేఖ ఆదివారం మంగళగిరిలోని ఎమ్మెల్యే కార్యాలయానికి అందింది. దాంతో కార్యాలయ సిబ్బంది వెంటనే ఆ లేఖను ఎమ్మెల్యేకు అందజేశారు. దీంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇసుక తవ్వకాలు ఇటీవల కాలంలో మరింత జోరందుకున్నాయి. దాంతో ఆ వ్యవహారాన్ని కట్టడి చేసేందుకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నడుంబిగించారు. అది ఇసుకు మాఫియా ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి బెదిరింపు లేఖ అందుకున్నారు. -
కేసీఆర్‌ను ఫోన్లో బెదిరించిన విద్యార్థి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును హతమారుస్తామంటూ ఈ నెల 6న ఫోన్ ద్వారా హెచ్చరించిన యువకుడ్ని ఇక్కడి బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెంగళూరులో తన పెద్దమ్మ వద్ద ఉంటూ ఇంటర్ చదువుతున్న యువకుని(మైనర్) స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి పట్టణం. ఈ నెల 6న తన మొబైల్ నుంచి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవరావుకు ఫోన్‌చేసి కేసీఆర్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. కేసీఆర్‌ను చంపుతామంటూ ఈ నెల 12న లేఖ కూడా రాశాడు. దీనిపై విచారణ చేపట్టిన బంజారాహిల్స్ పోలీసులు ఫోన్‌నంబర్ ఆధారంగా యువకుడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఆవేశంలోనే కేసీఆర్‌కు లేఖ రాశాడు కావలి, న్యూస్‌లైన్: రాష్ట్ర సమైక్యత కోసం ఆవేశపడే తమ కుమారుడు కేసీఆర్‌కు బెదిరింపు లేఖ పంపాడని, దీంతో కష్టాలు ఎదుర్కోవలసి వస్తోందని అతని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడైన తమ కుమారుడు అలా ప్రవర్తించడం.. పోలీసులు అరెస్టు చేయడంతో వారు కుంగిపోతున్నారు. ఉద్యమంలో పోరాడుతున్న వారు బాసటగా నిలిచి తమ కుమారుడిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయపడాలని కోరుతున్నారు.