SEBI warning letter to Infosys: దేశీయ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌కి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పాలనాపరమైన హెచ్చరిక జారీ చేసింది. కంపెనీ స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ (ఎస్‌డీడీ)లో జాప్యం జరుగుతుండటంపై హెచ్చరించింది.
‘ఎస్‌డీడీలో కొన్ని ఎంట్రీలు ఆలస్యంగా నమోదయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు క్యాంపస్‌ల నుంచి కాకుండా వారి ఇళ్ల వద్ద నుంచే పని చేస్తున్న సమయంలో ఇన్పోసిస్ దీన్ని సమర్పించింది. అందువల్ల, ఈ రికార్డులను సమన్వయం చేయడం, నిర్వహించడం కష్టమైంది. అప్పుడు యూపీఎస్‌ఐకి సంబంధించిన సమాచారం కంపెనీ వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ, ఎస్‌డీడీ సిస్టమ్‌లో నవీకరించడం ఆలస్యం అయింది’ అని ఆగస్ట్ 9న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ పేర్కొంది. అయితే, ఈ వాదనను అంగీకరించడం లేదని సెబీ తెలిపింది.
సెబీ వార్నింగ్ లెటర్
ఎస్‌డీడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్ఫోసిస్‌కు పంపిన లేఖలో హెచ్చరించింది. ఎస్‌డీడీలో సమాచారం సరిగ్గా ఉండేలా ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉందంది. ఇందులో ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. ఇకపై ఎస్‌డీడీ నిర్వహణకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఎస్‌డీడీ అంటే ఏమిటి?
స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ లేదా ఎస్‌డీడీ అనేది వ్యక్తులు లేదా సంస్థ పేర్లకు సంబంధించిన సమాచారం. ఈ సమాచారాన్ని ప్రచురించడానికి వీలులేని విలువైన సున్నితమైన సమాచారం (యూపీఎస్‌ఐ)గా పేర్కొంటారు. దీన్ని సెబీ అంతర్గత ట్రేడింగ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా నిర్వహించాలి. ఈ భావన సెబీ (ప్రోహిబిషన్ ఆఫ్ ఇన్‌సైడర్ ట్రేడింగ్) రెగ్యులేషన్స్, 2015 నుంచి ఉద్భవించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.
ఇదీ చదవండి: ఐటీ జాబ్ ఇంటర్వ్యూ మరి.. కుప్పలు కుప్పలుగా వచ్చారు! వీడియో వైరల్
కాగా సెబీ లేఖ వల్ల ఎలాంటి ఆర్థిక ప్రభావం లేదని ఇన్ఫోసిస్ చెప్పింది. సుపరిపాలనలో భాగంగా అసంపూర్తిగా ఉన్న ఎస్‌డీడీ రికార్డులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ వల్ల కంపెనీ ఆర్థిక, ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని ఇన్ఫోసిస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment